స్త్రీ బహుముఖ ప్రజ్ఞా మతి

*శీర్షిక:

స్త్రీ  బహుముఖ ప్రజ్ఞా మతి!*
*********************
స్త్రీ అంటే తెల్లదనం!.
స్త్రీ అంటేమల్లెదనం!

స్త్రీ అంటే  సహన  ఘనం!
స్త్రీ అంటే సుఖపు వనం!

స్త్రీ అంటే త్యాగ ఫలం!
స్త్రీ అంటే సొగసు జాలం!

స్త్రీ అంటే తల్లి దనం!
స్త్రీ అంటే చల్ల దనం!

ఆమెలోనే ఉంది మమత!
ఆమెలోనే ఉన్న సమత!

అందుకే స్త్రీ కి మన జోత!
నిలవాలి పాదాల చెంత!

స్త్రీ వుంటే లేదెన్నడు చింత!
ప్రతి ఇంటా నిలచు నిశ్చింత!

స్త్రీదేనేడుఅన్నింటాఅగ్రస్థానం!
కోపంతోకన్నుతెరిస్తేఉగ్రస్థానం! 

స్త్రీ అంటే నాట్య  తరంగం!
స్త్రీ అంటే లాస్య తారంగం!

స్త్రీలోవున్నవిబహుముఖాలు!
వర్ణిస్తేఅగుపుంఖానుపుంఖాలు!
************************
డా. బి హెచ్.వి.రమాదేవి.
రాజమహేంద్రవరం.
చర వాణి:6305543917.
20_4_23.