ఇంటర్‌ ఫలితాల్లో ‘‘విజ్ఞాన్‌’’ విజయభేరి

ఇంటర్‌ ఫలితాల్లో ‘‘విజ్ఞాన్‌’’ విజయభేరి
ఇంటర్‌ ఫలితాల్లో తమ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని విజ్ఞాన్‌ విద్యాసంస్థల సమన్వయకర్త గుదిమెళ్ల శ్రీకూర్మనాథ్‌ బుధవారం తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్‌ జూనియర్‌ కళాశాలలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ జే.మోహనరావు మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వ విద్యా శాఖ విడుదల చేసిన ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో తమ కళాశాలకు చెందిన రెండో సంవత్సరం విద్యార్థులు కేవీఎల్‌ విష్ణువర్ధన్‌ (988), జీ.విష్ణువర్ధన్‌ బాబు (987), కే.వెంకట శివ ప్రణయ్‌ (986), ఆర్‌. శివకుమార్‌ (985), ఎమ్‌.వరుణ్‌ (985), పీ,బాలాజీ (985), జే.అజయ్‌ కుమార్‌ (985), కేఎన్‌ఎమ్‌హెచ్‌ శశాంక్‌ (983), ఎం.పవన్‌ సాయి ( 982), ఏ.తరుణ్‌ మాధవ్‌ (981), కేహెచ్‌ వర్ధన్‌ చౌదరి( 981), డీ.నీరజ్‌బాబు( 980), టీ.వెంకట రమణ (980)  మార్కులు సాధించారన్నారు. మొదటి సంవత్సరం విద్యార్థుల్లో టీ.సంజయ్‌ తేజ∙(463), ఏ.రోహన్‌ (463), టీసీ చంద్రశేఖర్‌ (463), ఐ.హనీత్‌ (462), కే. నాగసాయి (462), ఎస్‌.అరవింద్‌ కుమార్‌ (462), జీడీవీజీ పుల్లారెడ్డి (462), ఎమ్‌.వివేక్‌ పూజిత్‌ కుమార్‌ (462), బీ.హేమంత్‌ (462), సీహెచ్‌ వెంకట ఉదయ్‌ ఆదిత్య(462), బీ,యోగ విజయ్‌ కుమార్‌ (462), జీ.శశిధర్, పీ,కౌశిక్‌ సాయి కుమార్‌ (462), వై.లక్ష్మీపతి(462) మార్కులు సాధించారు. మొదటి సంవత్సరం విద్యార్థుల్లో 450కు పైగా మార్కులు 148 మంది సాధించారని పేర్కొన్నారు. రెండో సంవత్సరం విద్యార్థుల్లో 950కి పైగా మార్కులు 133 మంది సాధించారని తెలియజేసారు. అద్భత ఫలితాలు సాధించిన విద్యార్థులను విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల అధినేత డాక్టర్‌ లావు రత్తయ్య ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో వడ్లమూడి, గుంటూరు జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపల్స్‌ జే.మోహనరావు, వై. వెంకటేశ్వరరావు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.