విజ్ఞాన్స్‌ లారాకు ప్రతిష్టాత్మక నాక్‌ ఏ+ అక్రిడిటేషన్‌

విజ్ఞాన్స్‌ లారాకు ప్రతిష్టాత్మక నాక్‌ ఏ+ అక్రిడిటేషన్‌
చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలకు ప్రతిష్టాత్మక నాక్‌ ఏ+( నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రిడిటేషన్‌ కౌన్సిల్‌) సాధించిందని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కే.ఫణీంద్రకుమార్‌ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ‘‘సక్సెస్‌ మీట్‌’’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ రాష్ట్రంలోని అతికొన్ని ఇంజినీరింగ్‌ కళాశాలలకే మాత్రమే ఉన్న నాక్‌ అక్రిడిటేషన్‌  గుర్తింపు ఉన్న సందర్భంలో విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలకు నాక్‌ ఏ+ అక్రిడిటేషన్‌ లభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎప్పటికప్పడు సెల్ఫ్‌ అసెస్‌మెంట్, కంటిన్యూస్‌ ఇంప్రూవ్‌మెంట్, కరికులర్‌ ఆస్పెక్ట్స్, టీచింగ్‌–లెర్నింగ్‌ అండ్‌ ఎవాల్యూషన్, రీసెర్చ్, ఇన్నోవేషన్స్‌ అండ్‌ ఎక్స్‌టెన్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ లెర్నింగ్‌ రిసోర్సెస్‌ కేటగిరీలతో పాటు వివిధ అంశాల్లో కళాశాల ముందంజలో ఉన్నందువలన నాక్‌ ఏ+ అక్రిడిటేషన్‌ లభించిందన్నారు. వీటితో పాటు స్టూడెంట్స్‌ సపోర్ట్‌ అండ్‌ ప్రోగ్రెస్సన్, గవర్నెనెన్స్, లీడర్‌షిప్‌ అండ్‌ మేనేజ్‌మెంట్, ఇనిస్టిట్యూషన్‌ వాల్యూస్‌ అండ్‌ బెస్ట్‌ ప్రాక్టీసెస్‌లలో తమ కళాశాల సత్తాచాటిందన్నారు. ఈ సంవత్సరంలోనే జేఎన్‌టీయూ– కాకినాడ నుంచి పర్మినెంట్‌ అఫ్లియేషన్‌ పొందిన తమ కళాశాలలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన విద్యార్థులు విదేశాలలో ఉన్నత విద్యతో పాటు ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయన్నారు. ఇప్పటికే న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఎన్‌బీఏ నుంచి 5 అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులకు విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలకు ఎన్‌బీఏ అక్రిడిటేషన్‌ లభించడం గర్వకారణమన్నారు. అక్రిడిటేషన్‌ లభించిన కోర్సులలో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్, మెకానికల్‌ ఇంజినీరింగ్, ఐటీ కోర్సులు ఉన్నాయని పేర్కొన్నారు.

విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కే.ఫణీంద్రకుమార్‌ మాట్లాడుతూ  విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలలో విద్యార్థులకు అందించే విద్యా విధానం, సిలబస్‌ కంటెంట్, టీచింగ్‌ మెథడాలజీ, అకాడమిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ప్రాజెక్టులు, పబ్లికేషన్స్, ప్లేస్‌మెంట్స్, ఇంటర్న్‌షిప్స్, స్పోర్ట్స్, హాస్టల్‌ వసతి, విద్యార్థుల అచీవ్‌మెంట్స్, అత్యాధునిక ల్యాబ్‌ ఎక్విప్‌మెంట్‌లన్ని అందుబాటులో ఉన్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అత్యధిక స్థాయిలో గ్రాంట్లు, ప్రాజెక్టులు పొందటానికి ఎన్‌బీఏ అక్రిడిటేషన్‌ దోహదపడుతుందన్నారు. అక్రిడిటేషన్‌ ఉండటం వల్ల జాతీయ, అంతర్జాతీయ స్థాయి ర్యాంకింగ్స్‌లో విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలకు స్థానం లభిస్తుందన్నారు. విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలకు ఎన్‌బీఏ అక్రిడిటేషన్‌ మూడు సంవత్సరాలు పాటు, నాక్‌ ఏ + అక్రిడిటేషన్‌ 5 సంవత్సరాల పాటు లభించిందని తెలియజేసారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కే.ఫణీంద్రకుమార్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.