విజ్ఞాన్‌ ప్రవేశపరీక్ష వీశాట్‌–2023 ఫేజ్‌–1 ఫలితాలు విడుదల

విజ్ఞాన్‌ ప్రవేశపరీక్ష వీశాట్‌–2023 ఫేజ్‌–1 ఫలితాలు విడుదల
  విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌

  మే 3 నుంచి కౌన్సిలింగ్‌ ప్రారంభం

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో బీటెక్, బీఫార్మసీ, బీఎస్సీ అగ్రికల్చరల్‌  ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన వీశాట్‌–2023 ఫేజ్‌–1 (విజ్ఞాన్‌ స్కోలాస్టిక్‌ యాప్టిట్యూడ్‌ టెస్ట్‌)కు ఈ ఏడాది అనూహ్య స్పందన లభించిందని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్, ఐఐఐటీ అలహాబాద్‌ మాజీ డైరక్టర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ తెలిపారు. వీశాట్‌–2023 ఫేజ్‌–1 ప్రవేశ పరీక్ష ఫలితాలను సోమవారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా వైస్‌ చాన్స్‌లర్‌ మాట్లాడుతూ వీశాట్‌–2023 ఫేజ్‌–1 ప్రవేశ పరీక్షను ఈ సంవత్సరం ఆన్‌లైన్‌ మరియు ఆఫ్‌లైన్‌ ద్వారానే నిర్వహించామన్నారు. ఏపీ, తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి విద్యార్థులు వీశాట్‌కు హాజరైనట్లు చెప్పారు. 90 శాతానికిపైగా విద్యార్థులకు ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు కల్పించడం, పరిశోధనల్లో సత్తా చాటుతుండటంలాంటì అరుదైన విజయాంశాల వల్లనే విద్యార్థులు, తల్లిదండ్రులకు తమ యూనివర్సిటీపై ఆదరణ మరింత పెరిగిందని సంతోషం వ్యక్తంచేశారు. వీశాట్‌–2023 ర్యాంకులతో పాటు జేఈఈ మెయిన్స్‌ ఫలితాలు, ఎంసెట్‌ ర్యాంకులు, ఇంటర్మీడియట్‌ మార్కులను కూడా పరిగణలోనికి తీసుకుంటామని పేర్కొన్నారు. వీశాట్‌లో 1 నుంచి 50 లోపు ర్యాంకులు సాధించిన వారికి 75% స్కాలర్‌షిప్, 51 నుంచి 100లోపు ర్యాంకులు సాధించిన వారికి 50% స్కాలర్‌షిప్, 101 నుంచి 400లోపు ర్యాంకులు సాధించిన వారికి 25% స్కాలర్‌షిప్, 401 నుంచి 2000లోపు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు 10% స్కాలర్‌షిప్‌ను నాలుగు సంవత్సరాల పాటు అందజేస్తామని వెల్లడించారు.

ఇంటర్‌లో 970కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు 50% స్కాలర్‌షిప్, 950 నుంచి 969 మార్కులు సాధించిన విద్యార్థులకు 25% స్కాలర్‌షిప్స్, 920 నుంచి 949 మార్కులు సాధించిన విద్యార్థులకు 10% స్కాలర్‌షిప్‌ అందజేస్తామని తెలియజేసారు.

జేఈఈ మెయిన్స్‌లో 95కి పైగా పర్సంటైల్‌ సాధించిన విద్యార్థులకు 75% స్కాలర్‌షిప్, 89 నుంచి 94.9 పర్సంటైల్‌ సాధించిన విద్యార్థులకు 50% స్కాలర్‌షిప్, 81 నుంచి 88.9% పర్సంటైల్‌ సాధించిన విద్యార్థులకు 25% స్కాలర్‌షిప్, 75 నుంచి 80.9 పర్సంటైల్‌ సాధించిన విద్యార్థులకు 10% స్కాలర్‌షిప్‌ అందజేస్తామన్నారు.

ఈ నెల 3వ తారీఖు నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో బీటెక్, బీఫార్మసీ, బీఎస్సీ అగ్రికల్చర్‌ సైన్స్‌ ప్రవేశాల కౌన్సిలింగ్‌ను ప్రారంభిస్తున్నామని తెలియజేసారు. వీశాట్‌ ఫేజ్‌–2 ప్రవేశ పరీక్షలను మే 5 నుంచి 31వ తారీఖు వరకు నిర్వహించనున్నామని వెల్లడించారు. 

తొలి పది ర్యాంకులు వీరికే...

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ డీన్‌ అడ్మిషన్స్‌ డాక్టర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌ మాట్లాడుతూ వీశాట్‌లో తొలి పది ర్యాంకులు సాధించిన విద్యార్థుల వివరాలను వెల్లడించారు. వీశాట్‌–2023 ప్రవేశ పరీక్ష ఫలితాలు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ https://www.vignan.ac.in/vsatresult/   కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అలాగే విద్యార్థుల సెల్‌ఫోన్లకు ర్యాంకులు వివరాలను పంపిస్తామని తెలియజేసారు. వివరాలకు 79819 89595 లో సంప్రదించవచ్చునని వివరించారు. 

1.యల్లంపల్లి వేణిశ్రీ  ( క్రిష్ణా జిల్లా)
2. కోమట్ల తేజశ్రీ సాయి (క్రిష్ణా జిల్లా)
3. అనపర్తి వెంకట సుబ్రహ్మణ్య మనోజ్‌ (తూర్పు గోదావరి)
4. టీవీఎస్‌ సాయి గౌతమ్‌ (తూర్పు గోదావరి )
5. గరుగు వీర వెంకట సంజన  ( బీదర్‌ , కర్ణాటక)
6. పగడాల ఎన్‌వీఎస్‌ భావన ( గుంటూరు )
7. బిజ్జం లక్ష్మి కాంత్‌ రెడ్డి (నంద్యాల )
8. భీమిరెడ్డి శివ శరణ్య ( తూర్పు గోదావరి)
9. లంక రాకేష్‌ వెంకటసాయి ( పశ్చిమ గోదావరి )
10. పొన్నమంద మనోజ్‌ కుమార్‌ ( పశ్చిమ గోదావరి)

ప్రపంచస్థాయి వసతులు
విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ డీన్‌ ప్రమోషన్స్, కొలాబరేషన్స్, ఫ్యాకల్టీ అఫైర్స్‌ డాక్టర్‌ డీ.విజయరాము మాట్లాడుతూ తమ యూనివర్సిటీ విద్యార్థులను ప్రపంచస్థాయి నిపుణులుగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. ప్రఖ్యాత సాఫ్ట్‌వేర్‌ సంస్థలైన మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, టీసీఎస్‌లతో తమకు అంశాల వారీగా  ప్రత్యేక అవగాహన ఒప్పందాలు ఉన్నాయన్నారు. అంతర్జాతీయ యూనివర్సిటీలతో పరస్పర ఒప్పందాలు ఉండటం వల్ల తమ విద్యార్థులను అంతర్జాతీయ పోటీకి ధీటుగా తయారుచేస్తున్నామని తెలిపారు.  అందుకే తమ విద్యార్థులు అంతర్జాతీయ కంపెనీల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు సాధిస్తున్నారని వెల్లడించారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు పాల్గొన్నారు.

ఫోటోరైటప్‌ : వీశాట్‌–2023 ప్రవేశ పరీక్ష ఫలితాలను విడుదల చేస్తున్న అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ (మీడియా) ఏ.గౌరీశంకర్‌రావు, విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్, ఐఐఐటీ అలహాబాద్‌ మాజీ డైరక్టర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, డీన్‌ అడ్మిషన్స్‌ డాక్టర్‌ కేవీ క్రిష్ణకిషోర్, డీన్‌ ప్రమోషన్స్, కొలాబరేషన్స్, ఫ్యాకల్టీ అఫైర్స్‌ డాక్టర్‌ డీ.విజయరాము ( ఎడమ నుంచి కుడి వైపుకు)