Skip to main content

జర్నలిజం మౌలిక సూత్రాలకు అనుగుణంగా మీడియా పని చేయాలి



జర్నలిజం మౌలిక సూత్రాలకు అనుగుణంగా మీడియా పని చేయాలి 
- సి.ఆర్.మీడియా అకాడమీ చైర్మన్ శ్రీ కొమ్మినేని శ్రీనివాస రావు
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
జర్నలిజం మౌలిక సూత్రాలకు విరుద్ధంగా, ఇష్టారీతిగా ప్రస్తుతం కొన్ని  మీడియా వర్గాలు  వార్తలు ప్రచురించడం శోచనీయమని, సి.ఆర్.మీడియా అకాడమీ చైర్మన్ శ్రీ కొమ్మినేని శ్రీనివాస రావు అన్నారు. స్థానిక టాగోర్ లైబ్రరీ లో బుధ వారం జరిగిన ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ సమావేశం లో ఆయన మాట్లాడుతూ,ప్రస్తుతం జర్నలిజం  "క్రాస్ రోడ్స్" వద్ద  దిక్కు తోచని స్థితిలో వుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ధోరణి ని పాత్రికేయులే సరిదిద్దాలని ఆయన పేర్కొన్నారు. జర్నలిజం మౌలిక సూత్రాల ప్రకారం తమకు నష్టం కలిగినా, వాస్తవాన్ని మాత్రమే వార్తగా ప్రచురించాల్సి వుందన్నారు. ఆరోపణలకు గురైనవారి కథనం లేకుండా వార్త ప్రచురించడం ఈ సూత్రాలకు పూర్తి విరుద్ధం అని జ్ఞప్తికి తెచ్చుకోవాలన్నారు. రాజకీయ పరంగా వారి వారి సంబంధాలు ఎలా వున్నా, జరుగుతున్న సంఘటనల్ని వక్రీకరించడం సరైన పద్దతి కాదన్నారు. అదేవిధంగా, ఒకే అంశం పై ప్రాంతాలవారీగా విభిన్న సూత్రీకరణలు, వార్తా కథనాలు వెలువడుతుండడం యిటీవలి కాలం లో పెరిగిపోయిందన్నారు. ఇదంతా జర్నలిజం లో నైతిక సూత్రాలను పాటించక పోవడం వల్లనే జరుగుతోందన్న విషయం అందరూ గుర్తుంచుకోవాలని ఆయన కోరారు. 

పాత్రికేయులందరూ తమ తమ సంఘాల పరిధి లో పనిచేస్తూనే, ఉమ్మడి సమస్యల పట్ల ఐక్యం గా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సి.ఆర్. మీడియా అకాడమీ అన్ని జర్నలిస్టుల యూనియన్లతో స్నేహ పూర్వక వాతావరణం కలిగి వుంటుందని ఆయన పేర్కొన్నారు. జర్నలిస్టులు అందరితో కలిసి పనిచేయాలని కోరుకుంటుందని ఆయన అన్నారు.  అటువంటి స్నేహ పూర్వక వాతావరణం యేర్పడేందుకు అందరూ కలిసి రావాలని ఆయన పిలుపు నిచ్చారు. 

 సి.ఆర్. మీడియా అకాడమీ ఇటీవల ప్రవేశ పెట్టిన జర్నలిజంలో డిప్లమా కోర్సు లో 310 మంది చేరి ప్రతిరోజూ ఉదయం 8గంటల నుంచి 10 గంటల వరకు ఆన్ లైన్ తరగతులకు హాజరవుతున్నారని ఆయన వివరించారు. డిప్లమో కోర్సు లోని సిలబస్ తో పాటు ప్రతి శనివారం   సామాజిక, ఆర్ధిక, పరిపాలన వంటి అంశాల మీద ప్రముఖులతో ఆన్ లైన్ విధానంలో అవగాహన తరగతులు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.  ఈ అవగాహనా తరగతులలో పాల్గొని పలు అంశాల పై విజ్ఞానం పెంచుకోవాలని జర్నలిస్టులకు ఆయన సూచించారు. త్వరలోనే, రాష్ట్ర స్థాయి అధికారులు, మంత్రులు ఈ అవగాహన తరగతుల్లో పాల్గొని, ప్రధాన అంశాల పై అవగాహన కల్పించనున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనే "లింక్" ను అన్నిజర్నలిస్టుల యూనియన్లకు పంపుతామని ఆయన తెలిపారు.  రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనల్లో  అక్కడి జర్నలిస్టులకు కూడా అవగాహన తరగతులు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. కాకినాడ జిల్లాలో "మడ అడవుల"సంరక్షణ పై అవగాహన కల్పించామన్నారు. శ్రీకాకుళం జిల్లాలో "గుడ్ గవర్నెన్స్" పై అవగాహన కల్పించామన్నారు. 

కార్యక్రమంలో చీఫ్ ఇన్ఫర్మేషన్ కమీషనర్ శ్రీ ఆర్. ఎం. భాషా, అధికార భాష కమిటీ అధ్యక్షులు శ్రీ విజయ బాబు,సి.ఆర్. మీడియా  అకాడమీ సెక్రటరీ శ్రీ మామిడిపల్లి బాల గంగాధర తిలక్, ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ అధ్యక్షులు శ్రీ ఎస్. వెంకట రావు, ప్రధాన కార్యదర్శి శ్రీ జి. ఆంజనేయులు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన జర్నలిస్టులు పాల్గొన్నారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...