మూగజీవాల దాహం తీర్చే పనిలో ఆదిత్య ఎన్.ఎస్. ఎస్., రెడ్ క్రాస్ వాలంటీర్లు సేవలు

మూగజీవాల దాహం తీర్చే  పనిలో ఆదిత్య ఎన్.ఎస్. ఎస్., రెడ్ క్రాస్ వాలంటీర్లు సేవలు
************************
రాజమహేంద్రవరం లో స్థానిక పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ మరియు నామన  ధనరాజు అండ్ సన్స్ ప్రతి ఏటా నిర్వహిస్తున్న నీటికుండీల పంపిణీ కార్య క్రమంలో పంతం కొండలరావు గారు మరియు ఫ్రెండ్స్ సర్కిల్ అసోసియేషన్ సభ్యులు కలిసి ఆదిత్య డిగ్రీ కాలేజీ మరియు మహిళా డిగ్రీ కాలేజీ ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు రెడ్ క్రాస్ వాలంటీర్ లతో సిసి ఛానల్ అధినేత శ్రీ పంతం కొండల రావు & సన్స్ , యానిమల్ హస్బెండ్ రీ జాయింట్ డైరెక్టర్  డాక్టర్ సత్య గోవింద్ ,యానిమల్ బోర్డ్ ఆఫ్ ఇండియా SPCA,, వి .గోపీనాథ్, నామన వాసు,పంతం కొండల రావు, ఇంకా అనేక మంది జంతు ప్రే మికులు లలితా నగర్ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు, ఈ కార్య క్రమంలో పాల్గొని ,లలితనగర్ దుర్గమ్మ గుడి వద్ద నీళ్ళ కుండీలు పంచి చుట్టూ ఉన్నవారిని జంతువులకు నీరు అందించవలసిందిగా వాలంటీర్లు నిర్వాహకులు వారిని  అర్థించారు.. ఆదిత్య డిగ్రీ మరియు మహిళా డిగ్రీ కళాశాలలఎన్.ఎస్.ఎస్.మరియు, యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు,  34 మంది మండు టెండను కూడా లెక్కజేయ కుండా మూగజీవాలను కాపాడండి! వాటి దాహార్తినీ తీర్చండి అంటూ నినాదాలతో  ర్యాలీ లో పాల్గొనడం విశేషం. ఎన్..ఎస్.ఎస్.ప్రోగ్రామ్ ఆఫీసర్ డా.జి.వి.ఎస్.నాగేశ్వర రావు ఆధ్వర్యంలో వాలంటీర్లు చురుకుగా పాల్గొన్నారు. దీనికి మరో ప్రోగ్రామ్ ఆఫీసర్ డా.బిహెచ్.వి.రమాదేవి సహకరించారు.పలువురు తాము జంతువులకు. నీరు అందించ గలమని పలువురు పెద్దలు చెప్పి దీనిలో  పాల్గొన్నారు.  ఈ కార్య క్రమంలో పాల్గొన్న  వాలంటీర్లను,ఆదిత్య విద్యా సంస్థలరాజమహేంద్రవరం డైరెక్టర్ ఎస్.పి.గంగిరెడ్డి  ప్రిన్సిపాల్ సి.హెచ్.ఫణికుమార్,ఎస్. కె.ఎన్.రెహ్మాన్ , ఆదిత్య సంస్థల ఛైర్మన్  డా.నల్లమిల్లి 
శేషా రెడ్డి,ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్ ,
డా. సుగుణారెడ్డి అభినందించారు.  అక్కడ ప్రతివారు ఇంత మండు టెండలను లెక్కచేయకుండా ఆదిత్య చిన్నారులు  పాల్గొన్నందుకు ప్రశంసించారు.