జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి

జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి

- ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ డిమాండ్


తెనాలి: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల పలు సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ఫెడరేషన్ రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు సోమవారం తెనాలిలో ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కనపర్తి రత్నాకర్ నాయకత్వంలో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద జర్నలిస్టులు నిరసన కార్యక్రమం, కోర్కెల దినోత్సవం నిర్వహించారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో డిప్యూటీ కలెక్టర్ వాణికి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు రత్నాకర్ మాట్లాడుతూ అర్హతలు గల ప్రతి జర్నలిస్ట్ కు అక్రిడిటేషన్ కార్డులను ప్రభుత్వం మంజూరు చేయాలన్నారు. తెనాలి ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు శాసన సభ్యులు అన్నాబత్తుని శివకుమార్ చొరవతీసుకుని తెనాలి జర్నలిస్ట్ ల చిరకాల స్వప్నం ప్రెస్ క్లబ్ సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. ఫెడరేషన్ డివిజన్ అధ్యక్షుడు ఎం. రవి కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టులకు కార్మిక బీమా, హెల్త్ కార్డులు అందించాలన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. మీడియా హై పవర్ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. అక్రిడిటేషన్ కమిటీలో ఫెడరేషన్ కు స్థానం కల్పించాలన్నారు. కార్యక్రమం లో ఫెడరేషన్ డివిజన్ కార్యదర్శి డి. కోటేశ్వరరావు, నియోజకవర్గ అధ్యక్షుడు అంబటి శ్యామ్ సాగర్, కార్యదర్శి పుట్ల పున్నయ్య, నాయకులు జి. ప్రభాకరరావు, ఎస్. ఎస్. జహీర్, ప్రేమ్ కుమార్, సాంబశివరావు, సుబ్బారావు, ఎం. శ్రీకాంత్, సభ్యులు రవికిరన్, మల్లవరపు ప్రసాద్, ఉన్నం భూషణం, వెంకటేశ్వరరావు, బి. చంద్ర మోహన్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.