క్యూఎస్‌ ఐ–గేజ్‌ ర్యాంకింగ్స్‌లో విజ్ఞాన్‌కు డైమండ్‌ రేటింగ్‌ అక్రిడిటేషన్‌

క్యూఎస్‌ ఐ–గేజ్‌ ర్యాంకింగ్స్‌లో విజ్ఞాన్‌కు డైమండ్‌ రేటింగ్‌ అక్రిడిటేషన్‌
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
లండన్‌లోని క్యూఎస్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ ప్రతిష్టాత్మకంగా ప్రకటించే క్యూఎస్‌ ఐ–గేజ్‌ ర్యాంకింగ్స్‌లో గుంటూరు జిల్లాలోని చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు డైమండ్‌ రేటింగ్‌ అక్రిడిటేషన్‌ లభించిందని యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్, ఐఐఐటీ అలహాబాద్‌ మాజీ డైరక్టర్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీకు క్యూఎస్‌ ఐ–గేజ్‌ ర్యాంకింగ్స్‌ను ఇవ్వాలంటే ప్రధానంగా 9 అంశాలను పరిగణలోనికి తీసుకుంటారని పేర్కొన్నారు. వాటిలో టీచింగ్‌ అండ్‌ లెర్నింగ్, ఫ్యాకల్టీ క్వాలిటీ, ఎంప్లాయబిలిటీ, డైవర్సిటీ అండ్‌ యాక్సిసిబిలిటీ, ఫెసిలిటీస్, సోషల్‌ రెస్పాన్సిబిలిటీ, గవర్నెన్స్‌ అండ్‌ స్ట్రక్చర్, రీసెర్చ్, అకడమిక్‌ డెవలప్‌మెంట్‌ ప్రధానంగా ఉంటాయన్నారు. ఈ 9 విభాగాల్లోని అంశాల్లో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు 6 విభాగాల్లో ప్లాటినమ్‌ రేటింగ్, 2 విభాగాల్లో గోల్డ్‌ రేటింగ్, 1 విభాగంలో డైమండ్‌ రేటింగ్‌ సాధించి 90 శాతం స్కోరుతో డైమండ్‌ రేటింగ్‌ అక్రిడిటేషన్‌ సాధించిందన్నారు. విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు క్యూఎస్‌ ఐ–గేజ్‌ డైమండ్‌ రేటింగ్‌ అక్రిడిటేషన్‌ రెండేళ్ల పాటు లభించిందని తెలియజేసారు. అకడమిక్‌ రెపుటేషన్, ఎంప్లాయర్‌ రెపుటేషన్, విద్యార్థుల నిష్పత్తికి తగ్గట్లుగా అధ్యాపకులు, స్కూపస్‌ జర్నల్స్‌లో పరిశోధన పేపర్లు ప్రచురించడంతో పాటు అధ్యాపకుల సైటేషన్స్‌ ఎక్కువగా ఉండటం, ఇంటర్నేషనల్‌ విద్యార్థులు కూడా సరైన నిష్పత్తిలో ఉండటం, ఎక్కువ మంది విద్యార్థులను వివిధ దేశాలకు చెందిన యూనివర్సిటీలతో అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుని స్టూడెంట్‌ ఎక్స్‌చేంజ్‌ ప్రోగ్రామ్స్‌ను నిర్వహించడం వలనే తమ యూనివర్సిటీకు ఉత్తమ రేటింగ్‌ అక్రిడిటేషన్‌ లభించిదని వెల్లడించారు. క్యూఎస్‌ ఐ–గేజ్‌ డైమండ్‌ రేటింగ్‌ అక్రిడిటేషన్‌ సాధించడానికి కృషి చేసిన యూనివర్సిటీలోని ఐక్యూఏసీ బృందాన్ని విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు అభినందించారు.