Skip to main content

Posts

Showing posts from June, 2023

దశాబ్ది ఉత్సవాలలో సన్మానం పొందిన తొలి మహిళను కావడం అదృష్టం

దశాబ్ది ఉత్సవాలలో సన్మానం పొందిన తొలి మహిళను కావడం అదృష్టం  - నాటక, టీవీ, సినీ నటి డా.శ్రీజ సాదినేని  కళారంగంలో కొనసాగడం పూర్వజన్మ సుకృతం అందుకే అంతమంది ప్రముఖుల ఆశీర్వాదం అందుకునే అదృష్టం దక్కింది అన్నారు డా. శ్రీజ సాదినేని. రవీంద్ర భారతి మెయిన్ హాల్ లో బుధవారం జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో ప్రముఖ రంగస్థల,సినీ,టీవీ నటి, రచయిత్రి, దర్శకురాలు  డా.శ్రీజ సాదినేనిని యఫ్ డి సి చైర్మన్ శ్రీ అనిల్ కూర్మాచలం గారు, యం.డి. శ్రీ అశోక్ రెడ్డి గారు సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో ముచ్చటించారు.  రవీంద్రభారతిలో ఒక్కసారైనా తమ ప్రతిభను ప్రదర్శించాలని ప్రతి కళాకారులూ కోరుకుంటారు. తాను కూడా అలాంటి స్థితిలోనే కళారంగంలో ప్రయాణం ప్రారంభించి ఇదే రవీంద్ర భారతిలో ఎన్నోసార్లు ప్రదర్శనలు ఇవ్వడమే కాక ఎన్నోసార్లు ఇదే వేదికపై అవార్డులు, సన్మానాలు, సత్కారాలతో పాటు తమ యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ కూడా ఇదే రవీంద్ర భారతిలో అందుకోవడం, అలాగే ఈరోజు ఇంత ఘనమైన సన్మానం అందుకోవడం తన అదృష్టం అని శ్రీజ సంతోషాన్ని వ్యక్తం చేశారు.  తెలంగాణా రాష్ట్ర దశాబ్ది ...

విజ్ఞాన్స్‌ లారా ఎన్‌సీసీ క్యాడెట్స్‌కు ‘‘బీ’’ సర్టిఫికెట్స్‌ ప్రధానం

విజ్ఞాన్స్‌ లారా ఎన్‌సీసీ క్యాడెట్స్‌కు ‘‘బీ’’ సర్టిఫికెట్స్‌ ప్రధానం చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన 30 మంది ఎన్‌సీసీ విద్యార్థులకు గుంటూరులోని 10 ఆంధ్ర గర్ల్స్‌ బెటాలియన్‌కు చెందిన హవల్దార్‌ తేజేంద్రకుమార్, సుబేదార్‌ గురువిందర్‌ సింగ్‌లు సోమవారం ‘‘ బీ ’’ సర్టిఫికెట్స్‌ను అందజేసారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కే.ఫణీంద్రకుమార్‌ మాట్లాడుతూ రాతపరీక్ష, ప్రాక్టికల్‌ పరీక్షలకు హాజరైన 30 మంది విద్యార్థులు 100% ఉత్తీర్ణతతో సర్టిఫికెట్స్‌ సాధించారని పేర్కొన్నారు. వీరిలో సీఎస్‌ఈ 16, ఈసీఈ 8, ఈఈఈ 3, ఐటీ విభాగం నుంచి ఒక విద్యార్థి ఉన్నారని వెల్లడించారు. అనంతరం విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలలోని 10 ఆంధ్ర గర్ల్స్‌ బెటాలియన్‌కు చెందిన ఎన్‌సీసీ విద్యార్థులు వడ్లమూడి గ్రామములో ‘‘ టేక్‌ ఏ స్టాండ్‌– బీ డ్రగ్‌ ఫ్రీ’’ అనే నినాదంతో మత్తు పదార్థాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. యువత మత్తును ఆస్వాదించేందుకు బానిసలు కాకూడదన్నారు. వాటి వాడకం వలన మెదడుపై మానసిక ఒత్తిడి, శరీరంలోని అంతర్గత ...

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఘనంగా ముగిసిన ఎన్‌సీసీ క్యాంపు

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఘనంగా ముగిసిన ఎన్‌సీసీ క్యాంపు   ఐదు రాష్ట్రాల నుంచి 600  మంది ఎన్‌సీసీ క్యాడెట్లు హాజరు చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఐదు రాష్ట్రాల నుంచి ఏక్‌ భారత్‌.. శ్రేష్ట భారత్‌ ఎన్‌సీసీ శిబిరం నిర్వహణలో భాగంగా 600 మంది ఎన్‌సీసీ క్యాడెట్‌ విద్యార్థులకు ఏర్పాటు చేసిన శిక్షిణా శిబిరం ఆదివారం ఘనంగా ముగిసింది. ఆంధ్రప్రదేశ్, పంజాబ్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, చత్తీస్‌ఘడ్‌ల నుంచి హాజరైన ఎన్‌సీసీ విద్యార్థులకు 12 రోజుల పాటు సాంస్కృతిక శిక్షణా శిబిరాన్ని నిర్వహించారు. గుంటూరు ఎన్‌సీసీ గ్రూప్, క్యాంపు కమాండర్‌ కల్నల్‌ ఎస్‌ఎమ్‌. చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ఏక్‌ భారత్‌.. శ్రేష్ట భారత్‌లో భాగంగా నిర్వహించిన శిక్షణా శిబిరంలో విద్యార్థులు వారి రాష్ట్రాలకు చెందిన సంస్కృతి, సంప్రదాయాలను ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు వివిధ ప్రదర్శనల ద్వారా తెలియజేయడమే ఈ క్యాంపు ముఖ్య ఉద్దేశ్యమన్నారు. 12 రోజుల క్యాంపులో భాగంగా విద్యార్థులతో కొండవీడు కోటకు వెల్లి ట్రెజర్‌ హంట్‌ కండక్ట్‌ చేశామన్నారు. విజయవాడ కనకదుర్గమ్మ గుడి, ఉండవల్లి గుహలు, అమరావతి బుద్ధ విగ్రహం, ...

వెన్నెల చీకటి

// వెన్నెల చీకటి/ /  చీకటెంత బావుందీ  వెన్నెల వీధుల్లో విహరిద్దామంది తాను ఓహ్.. చీకటంటే భయం అన్నా నేను ఎందుకేంటీ అని ప్రశ్నించింది ఆమె నాకు నేనే వినిపిస్తాననీ అంతు చిక్కని లోతుల్లో  పడిపోతాననీ  అంతరంగ మూలాల్లో   దేవులాడతానేమోననీ  నా సమాదానం  పక్కుమని నవ్విందామె అంత భయమయితే  ఎలా..!! నిత్యమూ చూడాలి అంతరంగంలో వెతకాలి అలికిడి చేయని  అద్భుతమైన జీవ నదీనదాల్ని  అక్కడే వెతకాలంది తాను అగాధశూన్యాలన్నీ లోలోనే కదా చీకటికి బయపడితే  వెలుగందమేం తెలుస్తుందీ  రా మరీ  అంటూ చేయి పట్టింది  తోడుగా నడుస్తూ.. మనసే మధుకలశం మనసే భయకంపితం చిమ్మచీకట్లోకి నడుస్తున్నా నాలోని నన్ను వెతుకుతూ  అసలు ఎత్తు పల్లాల్ని ధర్శిస్తూ.. విశ్వధర్శనమంతా ఇప్పుడు  నా లోపలే గోచరిస్తుంది ఏయ్ మనసా  సరిగా  పనిచేయ్ నన్ను  నాకు  విస్తృతం చేస్తూ సాగిపో.. నీ తోడుగా నేను  నా తోడుగా నువ్వు  వదలకెప్పుడూ  పట్టిన చేతిని అన్నా నేను సరే బాస్  పద పద  వెన్నెల వైపుగా సాగుదాం  అలా పున్నమి రేయి  వరకూ కృ...

న్యాయవ్యవస్థపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి. - సీనియర్ ఏపిపి సుకుమార్

న్యాయవ్యవస్థపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి - సీనియర్ ఏపిపి సుకుమార్ తెనాలి: న్యాయవ్యవస్థపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని సీనియర్ ఏపిపి సుకుమార్ అన్నారు. స్థానిక టాలెంట్ ఎక్స్ ప్రెస్ కార్యాలయం లో శుక్రవారం ఫోర్త్ ఎఎంఎం, జూవినిలి జస్టిస్ బోర్డ్  కోర్ట్  గుంటూరు సీనియర్ ఎపిపి గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సుకుమార్ అభినందన సభ జర్నలిస్ట్ నేత కనపర్తి రత్నాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సభలో సుకుమార్ మాట్లాడుతూ సత్వర న్యాయం జరగాలంటే సాంకేతిక పరిజ్ఞానం అవసరమన్నారు. వృత్తి పరంగా కేసుల సత్వరపరిస్కారానికి తనవంతు కృషి చేస్తానన్నారు. తొలుత సుకుమార్ ను రత్నాకర్, జర్నలిస్టులు జి. ప్రభాకరరావు, ఎం. సుబ్బారావు, పి. పున్నయ్య, సి. హెచ్. చంద్ర శేఖర్, న్యాయవాది మధుకర్, పి. రమేష్, సంజయ్ తదితరులు ఘనం గా సత్కరించారు.

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విద్యార్థికి పీహెచ్‌డీ

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విద్యార్థికి పీహెచ్‌డీ చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ బయోటెక్, ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌ విభాగంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీకు చెందిన విద్యార్థి కాకి సతీష్‌బాబుకు తమ యూనివర్సిటీ మరణానంతర పీహెచ్‌డీ పట్టాను వారి కుటంబ సభ్యులకు అందజేసిందని వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ ప్రొడక్షన్, ఫ్యూరిఫికేషన్‌ అండ్‌ క్యారక్టరైజేషన్‌ ఆఫ్‌ రీకాంబినెంట్‌ హ్యూమన్‌ ఇన్సులిన్‌ అండ్‌ గ్లార్జిన్‌ ఇన్సులిన్‌ యూజింగ్‌ ఎస్‌రేచియా కోలి బీఎల్‌–21’’ అనే అంశంపై విద్యార్థి పరిశోధన చేశారని తెలియజేశారు.  ఈయనకు విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని బయోటెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎన్‌.ఎస్‌.సంపత్‌ కుమార్‌ గైడ్‌గా వ్యవహరించారని పేర్కొన్నారు. విద్యార్థి తన పరిశోధనలో భాగంగా 1 ఎస్‌సీఈ, 1 స్కూపస్‌ పేపర్లు ప్రచురించారని వెల్లడించారు. కాకి సతీష్‌బాబు డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ అకాల మరణం చెందాడని తెలియజేసారు. అప్పటికే పీహెచ్‌డీ పూర్తవడానికి కావలసి...

14న విజ్ఞాన్స్‌ వర్సిటీలో అంతర్జాతీయ వర్క్‌షాప్‌

14న విజ్ఞాన్స్‌ వర్సిటీలో అంతర్జాతీయ వర్క్‌షాప్‌ చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఈ నెల 14న అంతర్జాతీయ స్థాయి వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్నట్లు వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్, ఐఐఐటీ అలహాబాద్‌ మాజీ డైరక్టర్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వర్క్‌షాప్‌కు సంబంధించిన గోడ పత్రికలను వైస్‌ చాన్స్‌లర్‌ విడుదల చేసారు. యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ విభాగంలోని ఈసీఈ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో ‘‘ వైర్‌లెస్‌ కమ్యూనికేషన్స్‌ అండ్‌ యాంటినా టెక్నాలజీస్‌ ఫర్‌ స్పేస్, ఏయిర్‌ అండ్‌ గ్రౌండ్‌ అప్లికేషన్స్‌’’ అనే అంశంపై అంతర్జాతీయ స్థాయి వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యూఎస్‌ఏలోని రావూస్‌ కన్సల్టంట్స్‌ ప్రెసిడెంట్, సీఈవో, ఐఈఈఈ లైఫ్‌ ఫెల్లో డాక్టర్‌ సుధాకర్‌రావ్, యూఎస్‌ఏలోని నాసా/ జేపీఎల్‌ సీనియర్‌ ఇంజినీర్‌ డాక్టర్‌ నాసెర్‌ చహత్, బెంగళూరులోని క్వాడ్‌జెన్‌ వైర్‌లెస్‌ ప్రెసిడెంట్, సీఈవో సీఎస్‌.రావ్, తైవాన్‌లోని ఫెంగ్‌ చియా యూనివర్సి...

ఎన్‌ఐఆర్‌ఎఫ్‌లో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు 75వ ర్యాంకు

ఎన్‌ఐఆర్‌ఎఫ్‌లో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు 75వ ర్యాంకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ( ఎంహెచ్‌ఆర్‌డీ) సోమవారం విడుదల చేసిన ఉన్నతస్థాయి విద్యాసంస్థల ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ (నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌) ర్యాంకులలో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు జాతీయస్థాయిలో 75వ ర్యాంకు లభించిందని యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్, ఐఐఐటీ అలహాబాద్‌ మాజీ డైరక్టర్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ  దేశ వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు 75వ ర్యాంకు లభించిందన్నారు. అదే విధంగా ఇంజినీరింగ్‌ విభాగంలో కూడా 85వ ర్యాంకు సాధించినట్లు తెలియజేసారు. టీచింగ్‌ లెర్నింగ్‌ రిసోర్సెస్, రీసెర్చ్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ ప్రాక్టీస్, గ్రాడ్యుయేషన్‌ ఔట్‌కమ్స్, ఔట్‌రీచ్‌ అండ్‌ ఇంక్లూజివిటీ, పీఆర్‌ పర్‌సెప్షన్‌ కేటగిరీల్లో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ పనితీరును కేంద్రం పరిశీలించి 100 పాయింట్ల స్కోర్‌ ప్రామాణికంగా ఈ ర్యాంకులను కేటాయించిందన్నారు. విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకు లభించడం వల్ల కేంద్ర, రాష్ట్ర ...