విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విద్యార్థికి పీహెచ్‌డీ

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విద్యార్థికి పీహెచ్‌డీ
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ బయోటెక్, ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌ విభాగంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీకు చెందిన విద్యార్థి కాకి సతీష్‌బాబుకు తమ యూనివర్సిటీ మరణానంతర పీహెచ్‌డీ పట్టాను వారి కుటంబ సభ్యులకు అందజేసిందని వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ ప్రొడక్షన్, ఫ్యూరిఫికేషన్‌ అండ్‌ క్యారక్టరైజేషన్‌ ఆఫ్‌ రీకాంబినెంట్‌ హ్యూమన్‌ ఇన్సులిన్‌ అండ్‌ గ్లార్జిన్‌ ఇన్సులిన్‌ యూజింగ్‌ ఎస్‌రేచియా కోలి బీఎల్‌–21’’ అనే అంశంపై విద్యార్థి పరిశోధన చేశారని తెలియజేశారు.  ఈయనకు విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని బయోటెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎన్‌.ఎస్‌.సంపత్‌ కుమార్‌ గైడ్‌గా వ్యవహరించారని పేర్కొన్నారు. విద్యార్థి తన పరిశోధనలో భాగంగా 1 ఎస్‌సీఈ, 1 స్కూపస్‌ పేపర్లు ప్రచురించారని వెల్లడించారు. కాకి సతీష్‌బాబు డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ అకాల మరణం చెందాడని తెలియజేసారు. అప్పటికే పీహెచ్‌డీ పూర్తవడానికి కావలసిన ధృవపత్రాలను సమర్పించినందువలన వారి కుటంబ సభ్యులకు పీహెచ్‌డీ పట్టాను అందజేసామని పేర్కొన్నారు.