విజ్ఞాన్స్‌ లారా ఎన్‌సీసీ క్యాడెట్స్‌కు ‘‘బీ’’ సర్టిఫికెట్స్‌ ప్రధానం

విజ్ఞాన్స్‌ లారా ఎన్‌సీసీ క్యాడెట్స్‌కు ‘‘బీ’’ సర్టిఫికెట్స్‌ ప్రధానం
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన 30 మంది ఎన్‌సీసీ విద్యార్థులకు గుంటూరులోని 10 ఆంధ్ర గర్ల్స్‌ బెటాలియన్‌కు చెందిన హవల్దార్‌ తేజేంద్రకుమార్, సుబేదార్‌ గురువిందర్‌ సింగ్‌లు సోమవారం ‘‘ బీ ’’ సర్టిఫికెట్స్‌ను అందజేసారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కే.ఫణీంద్రకుమార్‌ మాట్లాడుతూ రాతపరీక్ష, ప్రాక్టికల్‌ పరీక్షలకు హాజరైన 30 మంది విద్యార్థులు 100% ఉత్తీర్ణతతో సర్టిఫికెట్స్‌ సాధించారని పేర్కొన్నారు. వీరిలో సీఎస్‌ఈ 16, ఈసీఈ 8, ఈఈఈ 3, ఐటీ విభాగం నుంచి ఒక విద్యార్థి ఉన్నారని వెల్లడించారు. అనంతరం విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలలోని 10 ఆంధ్ర గర్ల్స్‌ బెటాలియన్‌కు చెందిన ఎన్‌సీసీ విద్యార్థులు వడ్లమూడి గ్రామములో ‘‘ టేక్‌ ఏ స్టాండ్‌– బీ డ్రగ్‌ ఫ్రీ’’ అనే నినాదంతో మత్తు పదార్థాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. యువత మత్తును ఆస్వాదించేందుకు బానిసలు కాకూడదన్నారు. వాటి వాడకం వలన మెదడుపై మానసిక ఒత్తిడి, శరీరంలోని అంతర్గత అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. డ్రగ్స్‌ సేవించడం మొదలుపెడితే దాని నుంచి బయటపడటం అంత సులువు కాదన్నారు. ఎన్‌సీసీ ‘‘బీ’’ సర్టిఫికెట్స్‌ను సాధించిన విద్యార్థులను విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కే.ఫణీంద్రకుమార్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది అభినందించారు.