న్యాయవ్యవస్థపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి. - సీనియర్ ఏపిపి సుకుమార్

న్యాయవ్యవస్థపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి
- సీనియర్ ఏపిపి సుకుమార్

తెనాలి: న్యాయవ్యవస్థపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని సీనియర్ ఏపిపి సుకుమార్ అన్నారు. స్థానిక టాలెంట్ ఎక్స్ ప్రెస్ కార్యాలయం లో శుక్రవారం ఫోర్త్ ఎఎంఎం, జూవినిలి జస్టిస్ బోర్డ్  కోర్ట్  గుంటూరు సీనియర్ ఎపిపి గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సుకుమార్ అభినందన సభ జర్నలిస్ట్ నేత కనపర్తి రత్నాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సభలో సుకుమార్ మాట్లాడుతూ సత్వర న్యాయం జరగాలంటే సాంకేతిక పరిజ్ఞానం అవసరమన్నారు. వృత్తి పరంగా కేసుల
సత్వరపరిస్కారానికి తనవంతు కృషి చేస్తానన్నారు. తొలుత సుకుమార్ ను రత్నాకర్, జర్నలిస్టులు జి. ప్రభాకరరావు, ఎం. సుబ్బారావు, పి. పున్నయ్య, సి. హెచ్. చంద్ర శేఖర్, న్యాయవాది మధుకర్, పి. రమేష్, సంజయ్ తదితరులు ఘనం గా సత్కరించారు.