దశాబ్ది ఉత్సవాలలో సన్మానం పొందిన తొలి మహిళను కావడం అదృష్టం

దశాబ్ది ఉత్సవాలలో సన్మానం పొందిన తొలి మహిళను కావడం అదృష్టం
 - నాటక, టీవీ, సినీ నటి డా.శ్రీజ సాదినేని 

కళారంగంలో కొనసాగడం పూర్వజన్మ సుకృతం అందుకే అంతమంది ప్రముఖుల ఆశీర్వాదం అందుకునే అదృష్టం దక్కింది అన్నారు డా. శ్రీజ సాదినేని.

రవీంద్ర భారతి మెయిన్ హాల్ లో బుధవారం జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో ప్రముఖ రంగస్థల,సినీ,టీవీ నటి, రచయిత్రి, దర్శకురాలు  డా.శ్రీజ సాదినేనిని యఫ్ డి సి చైర్మన్ శ్రీ అనిల్ కూర్మాచలం గారు, యం.డి. శ్రీ అశోక్ రెడ్డి గారు సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో ముచ్చటించారు. 
రవీంద్రభారతిలో ఒక్కసారైనా తమ ప్రతిభను ప్రదర్శించాలని ప్రతి కళాకారులూ కోరుకుంటారు. తాను కూడా అలాంటి స్థితిలోనే కళారంగంలో ప్రయాణం ప్రారంభించి ఇదే రవీంద్ర భారతిలో ఎన్నోసార్లు ప్రదర్శనలు ఇవ్వడమే కాక ఎన్నోసార్లు ఇదే వేదికపై అవార్డులు, సన్మానాలు, సత్కారాలతో పాటు తమ యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ కూడా ఇదే రవీంద్ర భారతిలో అందుకోవడం, అలాగే ఈరోజు ఇంత ఘనమైన సన్మానం అందుకోవడం తన అదృష్టం అని శ్రీజ సంతోషాన్ని వ్యక్తం చేశారు. 

తెలంగాణా రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో తొలిసారిగా ఏర్పాటు చేసిన ఈ సాంస్కృతిక సన్మాన కార్యక్రమంలో సన్మానం స్వీకరించిన తొలి మహిళ తానే కావడం నటరాజ స్వామి అనుగ్రహం అని, తాను ఈ స్థాయికి చేరుకోవడానికి తన కృషి, కష్టంతో పాటు గురువుల ఆశీస్సులు, మంచి మనసున్న మిత్రుల సహకారం కూడా కారణమని శ్రీజ తెలిపారు.

ఎఫ్.డి.సి. నిర్వహించిన 
నంది నాటకోత్సవాలలో  2003 లో ఇదుగో దేవుడు చేసిన బొమ్మ నాటకంలో అన్వేష పాత్రలో నటిగా మొదలై రచయిత్రిగా, దర్శకురాలిగా, మేకప్ ఆర్టిస్టుగా, నాటక నిర్వాహకురాలుగా నాటక రంగానికి సేవలు అందించిన తాను ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఎఫ్.డి.సి. వారు అందించిన ఈ ఘనమైన గౌరవాన్ని పొందిన ఆనందం మాటల్లో చెప్పలేను అంటూ తన సంతోషాన్ని పంచుకున్నారు.ఈ సమయంలో యఫ్.డి.సి.కి శ్రీజ ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు డా శ్రీజ సాదినేనికి అభినందనలు తెలియజేశారు.