Skip to main content

Posts

Showing posts from July, 2023

విజ్ఞాన్స్‌లో ఘనంగా లావు రత్తయ్య పుట్టినరోజు వేడుకలు

విజ్ఞాన్స్‌లో ఘనంగా లావు రత్తయ్య పుట్టినరోజు వేడుకలు చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విజ్ఞాన్స్‌ విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ విద్యార్థులు మాత్రమే తారతమ్య భేధాలు లేకుండా శుభాకాంక్షలు తెలియజేస్తారని అన్నారు. విద్యార్థులందరూ జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహిస్తే తాను ఇంకా ఎక్కువ సంతోషిస్తామని తెలియజేశారు. విద్యార్థులతో తనకున్న అనుబంధం మాటల్లో వర్ణించలేనిదని, అందుకోసమే ప్రతి సంవత్సరం తన పుట్టినరోజును ఇలా విద్యార్థుల మధ్య జరుపుకోవడానికి ఇష్టపడతానని పేర్కొన్నారు. సాధారణ ఆలోచనలతో కాకుండా క్రియేటివ్‌గా ఆలోచిస్తేనే విజయం సాధించగలరని విద్యార్థులకు సూచించారు. స్వేచ్ఛాయుత వాతావరణంలోనే విద్యార్థులు సరైన దిశగా ఎదగలగరనే సిద్ధాంతాన్ని తాను మొదటి నుంచి నమ్ముతున్నానని చెప్పారు. అదే సూత్రాన్ని తాము ప్రతి పాఠశాల, కళాశాలల్లో అమలు చేస్తున్నామని తెలిపారు.  కాబట్టే తమ విద్యార్థులు ఎన్నో అద్భుతాలు చేయగలుగుతున్నారని ప...

భవిష్యత్‌ కాలమంతా కృతిమ మేథదే

భవిష్యత్‌ కాలమంతా కృతిమ మేథదే !   ఐఎస్‌ఐ కోలకత్తలోని కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ప్యాట్రన్‌ రికగ్నిషన్‌ యూనిట్‌ ప్రొఫెసర్‌ ఉమపాద పాల్‌   విజ్ఞాన్స్‌లో ఘనంగా ముగిసిన ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ రాబోయే భవిష్యత్‌ కాలమంతా కృతిమ మేథ మీదే ఆధారపడి ఉంటుందని ఐఎస్‌ఐ కోలకత్తలోని కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ప్యాట్రన్‌ రికగ్నిషన్‌ యూనిట్‌ ప్రొఫెసర్‌ ఉమపాద పాల్‌ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ కంప్యూటింగ్‌ అండ్‌ ఇన్ఫర్మాటిక్స్‌ విభాగం ఆధ్వర్యంలో ‘‘అప్లికేషన్స్‌ అండ్‌ అల్గారిథమ్స్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ విజన్‌ అండ్‌ ప్యాట్రన్‌ రికగ్నిషన్‌ ’’ అనే అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించిన ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ ఘనంగా ముగిసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐఎస్‌ఐ కోలకత్తలోని కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ప్యాట్రన్‌ రికగ్నిషన్‌ యూనిట్‌ ప్రొఫెసర్‌ ఉమపాద పాల్‌ మాట్లాడుతూ మెరుపు వేగంతో ముందుకొస్తున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలన్నారు. నేర్చుకునే యంత్రాలు, నాడీ అనుసంధాన వ్యవస్థలు, సహజ భాషల విభజన, జన్యు అల్గారిథమ్‌లు, కంప్యుటేషన్‌ సృజనాత్...

విజ్ఞాన్స్‌ వర్సిటీకు రూ.21 లక్షల సీఎస్‌ఐఆర్‌ ప్రాజెక్ట్‌ మంజూరు

విజ్ఞాన్స్‌ వర్సిటీకు రూ.21 లక్షల సీఎస్‌ఐఆర్‌ ప్రాజెక్ట్‌ మంజూరు చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని అప్లైడ్‌ సైన్స్‌ అండ్‌ హ్యుమానిటీస్‌ విభాగంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కెమిస్ట్రీ విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ దేవునూరి నాగరాజుకి  న్యూఢిల్లీలో గల సీఎస్‌ఐఆర్‌ (కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌) నుంచి రూ.21 లక్షల విలువ గల ప్రాజెక్టు మంజూరైందని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ సిక్స్‌– ఫోల్డ్‌ ఎఫికసీ ఆఫ్‌ ప్రోలైన్‌ యాంకర్డ్‌ మెల్లిటిక్‌ యాసిడ్‌ ఆర్గనోక్యాటలిస్ట్స్‌: ఏ యూనిక్‌ అప్రోచ్‌ ఫర్‌ సస్టేనబుల్‌ అసిమెట్రిక్‌ క్యాటాలిసిస్‌ ’’ అనే అంశంపై పరిశోధనకు గాను రాబోయే 3 సంవత్సరాలకు ప్రాజెక్ట్‌ గ్రాంటు మంజూరైందన్నారు. సీఎస్‌ఐఆర్‌ ప్రాజెక్ట్‌ గ్రాంట్‌ సాధించిన ప్రొఫెసర్‌ దేవునూరి నాగరాజును విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు, వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఆయా విభాగాల డీన్ల...