విజ్ఞాన్స్‌ వర్సిటీకు రూ.21 లక్షల సీఎస్‌ఐఆర్‌ ప్రాజెక్ట్‌ మంజూరు

విజ్ఞాన్స్‌ వర్సిటీకు రూ.21 లక్షల సీఎస్‌ఐఆర్‌ ప్రాజెక్ట్‌ మంజూరు


చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని అప్లైడ్‌ సైన్స్‌ అండ్‌ హ్యుమానిటీస్‌ విభాగంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కెమిస్ట్రీ విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ దేవునూరి నాగరాజుకి  న్యూఢిల్లీలో గల సీఎస్‌ఐఆర్‌ (కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌) నుంచి రూ.21 లక్షల విలువ గల ప్రాజెక్టు మంజూరైందని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ సిక్స్‌– ఫోల్డ్‌ ఎఫికసీ ఆఫ్‌ ప్రోలైన్‌ యాంకర్డ్‌ మెల్లిటిక్‌ యాసిడ్‌ ఆర్గనోక్యాటలిస్ట్స్‌: ఏ యూనిక్‌ అప్రోచ్‌ ఫర్‌ సస్టేనబుల్‌ అసిమెట్రిక్‌ క్యాటాలిసిస్‌ ’’ అనే అంశంపై పరిశోధనకు గాను రాబోయే 3 సంవత్సరాలకు ప్రాజెక్ట్‌ గ్రాంటు మంజూరైందన్నారు. సీఎస్‌ఐఆర్‌ ప్రాజెక్ట్‌ గ్రాంట్‌ సాధించిన ప్రొఫెసర్‌ దేవునూరి నాగరాజును విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు, వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు అభినందించారు.