Skip to main content

Posts

Showing posts from August, 2023

నేడు చేబ్రోలులో బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ

నేడు బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ  టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:  చేబ్రోలు పాత పోలీస్ స్టేషన్ మసీదు సెంటర్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఆదివారం  సాయంత్రం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ నిర్వహిస్తున్నట్లు హైదరాబాదు  జ్ఞాని ప్రొజెక్స్ డైరెక్టర్ , సుజాత ఆర్ట్ పిక్చర్స్ అధినేత గల్లా జ్ఞాన శేఖర్ తెలిపారు. విగ్రహ దాత చేబ్రోలు ఎడ్లపాటి నగర్ గ్రామ వాస్తవ్యులు గల్లా కోటయ్య కుమారుడు గల్లా జ్ఞాన ప్రకాశరావు జ్ఞాపకార్థం ఏర్పాటు చేస్తున్నామన్నారు. విగ్రహావిష్కరణ ఎస్సీ కమిషన్  ఛైర్మన్ మారుపూడి విక్టర్ ప్రసాద్ చేతులమీదిగా జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, శాసనమండలి సభ్యులు లేళ్ల అప్పిరెడ్డి , స్థానిక శాసనసభ్యులు కిలారి వెంకట రోశయ్య , బుద్దిష్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఏపీ యల్లిచర్ల హరిబాబు తదితరులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు . చేబ్రోలు మండల పరిసర ప్రాంతాల ప్రజలు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలను కోరారు.

శుభాకాంక్షలు

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విద్యార్థినికి పీహెచ్‌డీ

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విద్యార్థినికి పీహెచ్‌డీ చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ కన్వెన్షనల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన వెన్నం స్వాతి అనే విద్యార్థినికి తమ యూనివర్సటీ పీహెచ్‌డీ పట్టా అందించిందని వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘యాన్‌ ఎక్సిపెరిమెంటల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆన్‌ పెర్ఫార్మెన్స్‌ ఆప్‌ హై–వాల్యూమ్‌ ఫ్లై యాష్‌ విత్‌ హైబ్రిడ్‌ ఫైబర్‌ బేస్డ్‌ కాంక్రీట్‌’’ అనే అంశంపై ఆమె పరిశోధన చేసిందని తెలియజేశారు. ఈమెకు విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలోని ప్రొఫెసర్‌ ఏ.శివశంకర్‌ గైడ్‌గా  వ్యవహరించారని పేర్కొన్నారు. ఈమె తన పరిశోధనలో భాగంగా మొత్తం 4 స్కూపస్‌ పేపర్లు పబ్లిష్‌ చేశారని తెలియజేసారు. డాక్టరేట్‌ పొందిన వెన్నం స్వాతిని ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది అభినందించారు.

ఐవోటీతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్‌

ఐవోటీతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్‌   పర్పుల్‌ టెక్నాలజీస్‌ సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ రామక్రిష్ణ ఐవోటీ ( ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌)లో పట్టుసాధించిన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని పర్పుల్‌ టెక్నాలజీస్‌ సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ రామక్రిష్ణ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలలోని ఈసీఈ డిపార్ట్‌మెంట్, పర్పుల్‌ టెక్నాలజీస్‌ల సంయుక్త ఆధ్వర్యంలో మూడో సంవత్సరం మొదటి సెమిస్టర్‌ విద్యార్థులకు ‘‘ఆర్డినో అండ్‌ ఐవోటీ’’లపై రెండు రోజుల పాటు నిర్వహించనున్న వర్క్‌షాప్‌ను మంగళవారం ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పర్పుల్‌ టెక్నాలజీస్‌ సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ రామక్రిష్ణ మాట్లాడుతూ స్మార్ట్‌ హోమ్‌ ఆటోమేషన్, ఆరోగ్య సేవలు, ఇండస్ట్రియల్‌ ఐవోటీ, అగ్రికల్చర్, స్మార్ట్‌ సిటీస్‌ వంటి రంగాలకు ఈ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఆర్డినో, ఐవోటీ టెక్నాలజీల గురించి చాలా తక్కువ మందికి తెలుసునని, భవిష్యత్‌లో ఈ టెక్నాలజీలు మానవ జీవితంలో ముఖ్య భాగం కానున్నాయని తెలియజేసారు. వ్యవసాయ రంగంలో ఈ టెక్నాలజీ ద్వారా రైతులు ఇంటి ...

సీనియర్ జర్నలిస్ట్ కృష్ణారావు మృతి పట్ల సంతాపం ప్రకటించిన జర్నలిస్ట్ సంఘాల నేతలు

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:  సుదీర్ఘకాలం మీడియాలో పనిచేసిన సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకుడు సిహెచ్ వి ఎం కృష్ణారావు  కన్నుమూశారు.  ఆయన మృతి పట్ల నేషనల్ అలయన్స్ ఆఫ్ జర్నలిస్ట్, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఆంధ్ర ప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్లు సంయుక్తంగా  సంతాపం వ్యక్తం చేస్తున్నాయి.  ఆయనతోపాటు పనిచేసే జర్నలిస్టు మిత్రులందరికీ పెద్ద బాబాయిగా   పీలిపించుకున్న కృష్ణారావు సుదీర్ఘకాలం మీడియాలో వివిధ సంస్థలలో పనిచేశారు.  ఏలూరులో జర్నలిస్టుగా జీవితం ప్రారంభించిన కృష్ణారావు అనంతర కాలంలో ఆంధ్రప్రభ, న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్, ఆంధ్రభూమి, దక్కన్ క్రానికల్ దినపత్రికలలో పనిచేశారు.  బ్యూరో ఇన్చార్జిగా పనిచేసినప్పటికీ మిగిలిన జర్నలిస్టుల మిత్రులతో కలిసి కలిసిమెలిసి వ్యవహరించే వారు.   ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసిన అనేకమంది ముఖ్యమంత్రులు ఐఏఎస్ అధికారులతో ఆయనకు ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన మృతి జర్నలిస్టు లోకానికి తీరని లోటు.  ఎన్ఏజే ఏపీడబ్ల్యూజేఎఫ్ ఏపీ బీజే ఏ లు ఆయన మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ...

ఎలక్ట్రికల్‌ సేఫ్టీ ప్రమాణాలు తప్పక పాటించాలి

ఎలక్ట్రికల్‌ సేఫ్టీ ప్రమాణాలు తప్పక పాటించాలి   ఏపీ ఎలక్ట్రికల్‌ సేఫ్టీ డైరక్టరేట్, సీఈఐజీ జీ.విజయలక్ష్మి వినియోగదారులందరూ ఎలక్ట్రికల్‌ సేఫ్టీ ప్రమాణాలు తప్పక పాటించాలని ఏపీ ఎలక్ట్రికల్‌ సేఫ్టీ డైరక్టరేట్, సీఈఐజీ జీ.విజయలక్ష్మి అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ ఈఈఈ డిపార్ట్‌మెంట్‌ విభాగంలోని ఎలక్ట్రికల్‌ మెయింటనెన్స్‌  ఆధ్వర్యంలో ‘‘ ఎలక్ట్రికల్‌ సేఫ్టీ’’ అనే అంశంపై శుక్రవారం ప్రత్యేక అతిథి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ ఎలక్ట్రికల్‌ సేఫ్టీ డైరక్టరేట్, సీఈఐజీ జీ.విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రయాణించే వాహనాలపై ప్రమాదవశాత్తు విద్యుత్‌ తీగలు జారిపడినా లేదా వాటికి మనం ప్రయాణించే వాహనం తగిలినట్లైతే వాహనంలో నుంచి బయటపడేందుకు హాపింగ్‌ (గెంతడం లేదా దూకటం) విధానాన్ని అనుసరించాలన్నారు. వ్యవసాయ పంపు సెట్లకు సంబంధించి మోటారు స్టార్టర్లు స్విచ్చులు ఉన్న ఇనుప బోర్డులను విధిగా ఎర్తింగ్‌ చేయాలని పేర్కొన్నారు. మోటార్లు తిరగని ఎడల విద్యుత్‌ స్తంభాలను, ట్రాన్స్‌ఫార్మర్లను మరమ్మత్తు నిమిత్తమై రైతులు ఎక్కరాదన్నారు. పొలాల్ల...

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విద్యార్థినికి పీహెచ్‌డీ

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విద్యార్థినికి పీహెచ్‌డీ చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ కన్వెన్షనల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన ముక్కాల ప్రియాంక అనే విద్యార్థినికి తమ యూనివర్సటీ   పీహెచ్‌డీ పట్టా అందించిందని వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మంగళవారం  తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ఎక్సిపెరిమెంటల్‌ ఇన్విస్టిగేషన్‌ ఆన్‌ స్ట్రెంగ్త్, డూరబిలిటీ అండ్‌ మైక్రోస్ట్రక్చరల్‌ కారక్టరిస్టిక్స్‌ ఆఫ్‌ జియోపాలిమర్‌ అగ్రిగేట్‌ బేస్డ్‌ కాంక్రీట్‌’’ అనే అంశంపై ఆమె పరిశోధన చేసిందని తెలియజేశారు. ఈమెకు విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగాధిపతి డాక్టర్‌ కార్తికేయన్‌ మునిరాజు గైడ్‌గా  వ్యవహరించారని పేర్కొన్నారు. ఈమె తన పరిశోధనలో భాగంగా మొత్తం 4 స్కూపస్‌ పేపర్లు పబ్లిష్‌ చేశారని తెలియజేసారు. డాక్టరేట్‌ పొందిన ముక్కాల ప్రియాంకను ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది అభినందించారు.

ప్రతి న్యాయవిద్యార్థి సోషల్‌ ఇంజినీరే!

ప్రతి న్యాయవిద్యార్థి సోషల్‌ ఇంజినీరే!   _ ఆలిండియా లాయర్స్‌ యూనియన్‌ ఆంధ్రప్రదేశ్‌ జనరల్‌ సెక్రటరీ, ఏపీ హైకోర్ట్‌ అడ్వకేట్‌ ఎన్‌.శ్రీనివాస్‌ రావ్‌ న్యాయ విద్యను అభ్యసించే ప్రతి విద్యార్థి సోషల్‌ ఇంజినీరేనని ఆలిండియా లాయర్స్‌ యూనియన్‌ ఆంధ్రప్రదేశ్‌ జనరల్‌ సెక్రటరీ, ఏపీ హైకోర్ట్‌ అడ్వకేట్‌ ఎన్‌.శ్రీనివాస్‌ రావ్‌ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని లా డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో ‘‘ న్యాయవిద్య – కొత్త మార్గాలు ’’ అనే అంశంపై ప్రత్యేక అతిథి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆలిండియా లాయర్స్‌ యూనియన్‌ ఆంధ్రప్రదేశ్‌ జనరల్‌ సెక్రటరీ, ఏపీ హైకోర్ట్‌ అడ్వకేట్‌ ఎన్‌.శ్రీనివాస్‌ రావ్‌ మాట్లాడుతూ సమాజంలోని ప్రతి సమస్యను పరిష్కరించేది లాయరేనని పేర్కొన్నారు. న్యాయ విద్యను అభ్యసించే విద్యార్థులు ప్రతిరోజు సమాజంలో ఎటువంటి సంఘటనలు, పరిణామాలు సంభవిస్తున్నాయో గమనిస్తూ ఉండాలన్నారు. న్యాయవాది వృత్తి సవాళ్లతో కూడుకున్నదని, ఇందులో రాణించాలనుకునే విద్యార్థులు పుస్తకాలు, జర్నల్స్‌ బాగా చదవాలన్నార...