Skip to main content

సీనియర్ జర్నలిస్ట్ కృష్ణారావు మృతి పట్ల సంతాపం ప్రకటించిన జర్నలిస్ట్ సంఘాల నేతలు

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
 సుదీర్ఘకాలం మీడియాలో పనిచేసిన సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకుడు సిహెచ్ వి ఎం కృష్ణారావు  కన్నుమూశారు.  ఆయన మృతి పట్ల నేషనల్ అలయన్స్ ఆఫ్ జర్నలిస్ట్, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఆంధ్ర ప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్లు సంయుక్తంగా  సంతాపం వ్యక్తం చేస్తున్నాయి.  ఆయనతోపాటు పనిచేసే జర్నలిస్టు మిత్రులందరికీ పెద్ద బాబాయిగా   పీలిపించుకున్న కృష్ణారావు సుదీర్ఘకాలం మీడియాలో వివిధ సంస్థలలో పనిచేశారు.  ఏలూరులో జర్నలిస్టుగా జీవితం ప్రారంభించిన కృష్ణారావు అనంతర కాలంలో ఆంధ్రప్రభ, న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్, ఆంధ్రభూమి, దక్కన్ క్రానికల్ దినపత్రికలలో పనిచేశారు.  బ్యూరో ఇన్చార్జిగా పనిచేసినప్పటికీ మిగిలిన జర్నలిస్టుల మిత్రులతో కలిసి కలిసిమెలిసి వ్యవహరించే వారు.   ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసిన అనేకమంది ముఖ్యమంత్రులు ఐఏఎస్ అధికారులతో ఆయనకు ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన మృతి జర్నలిస్టు లోకానికి తీరని లోటు.  ఎన్ఏజే ఏపీడబ్ల్యూజేఎఫ్ ఏపీ బీజే ఏ లు ఆయన మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాయి.

 ఎన్ కొండయ్య ఏ అమరయ్య
నేషనల్ అలయన్స్ ఆఫ్ జర్నలిస్ట్ 
ఎస్ వెంకట్రావు జి ఆంజనేయులు 
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ 
 వి శ్రీనివాసరావు కే మునిరాజు 
ఏపీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ప్రచురణార్థం ప్రసార నిమిత్తం 
  సుదీర్ఘకాలం మీడియాలో పనిచేసిన సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకుడు సిహెచ్ వి ఎం కృష్ణారావు  కన్నుమూశారు.  ఆయన మృతి పట్ల నేషనల్ అలయన్స్ ఆఫ్ జర్నలిస్ట్, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఆంధ్ర ప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్లు సంయుక్తంగా  సంతాపం వ్యక్తం చేస్తున్నాయి.  ఆయనతోపాటు పనిచేసే జర్నలిస్టు మిత్రులందరికీ పెద్ద బాబాయిగా   పీలిపించుకున్న కృష్ణారావు సుదీర్ఘకాలం మీడియాలో వివిధ సంస్థలలో పనిచేశారు.  ఏలూరులో జర్నలిస్టుగా జీవితం ప్రారంభించిన కృష్ణారావు అనంతర కాలంలో ఆంధ్రప్రభ, న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్, ఆంధ్రభూమి, దక్కన్ క్రానికల్ దినపత్రికలలో పనిచేశారు.  బ్యూరో ఇన్చార్జిగా పనిచేసినప్పటికీ మిగిలిన జర్నలిస్టుల మిత్రులతో కలిసి కలిసిమెలిసి వ్యవహరించే వారు.   ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసిన అనేకమంది ముఖ్యమంత్రులు ఐఏఎస్ అధికారులతో ఆయనకు ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన మృతి జర్నలిస్టు లోకానికి తీరని లోటు.  ఎన్ఏజే ఏపీడబ్ల్యూజేఎఫ్ ఏపీ బీజే ఏ లు ఆయన మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాయి.
సంతాపం ప్రకటించిన వారిలో ఎన్ కొండయ్య ఏ అమరయ్య, నేషనల్ అలయన్స్ ఆఫ్ జర్నలిస్ట్ 
ఎస్ వెంకట్రావు జి ఆంజనేయులు 
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్.విశ్రీనివాసరావు కే మునిరాజు 
ఏపీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ తదితరులు ఉన్నారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...