నేడు చేబ్రోలులో బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ

నేడు బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ 

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: 

చేబ్రోలు పాత పోలీస్ స్టేషన్ మసీదు సెంటర్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఆదివారం 
సాయంత్రం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ నిర్వహిస్తున్నట్లు హైదరాబాదు
 జ్ఞాని ప్రొజెక్స్ డైరెక్టర్ , సుజాత ఆర్ట్ పిక్చర్స్ అధినేత గల్లా జ్ఞాన శేఖర్ తెలిపారు. విగ్రహ దాత చేబ్రోలు ఎడ్లపాటి నగర్ గ్రామ వాస్తవ్యులు గల్లా కోటయ్య కుమారుడు గల్లా జ్ఞాన ప్రకాశరావు జ్ఞాపకార్థం ఏర్పాటు చేస్తున్నామన్నారు.
విగ్రహావిష్కరణ ఎస్సీ కమిషన్ ఛైర్మన్ మారుపూడి విక్టర్ ప్రసాద్ చేతులమీదిగా జరుగుతుందన్నారు. కార్యక్రమంలో
ముఖ్య అతిథులుగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, శాసనమండలి సభ్యులు లేళ్ల అప్పిరెడ్డి , స్థానిక శాసనసభ్యులు కిలారి వెంకట రోశయ్య , బుద్దిష్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఏపీ యల్లిచర్ల హరిబాబు తదితరులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు . చేబ్రోలు మండల పరిసర ప్రాంతాల ప్రజలు కార్యక్రమాన్ని విజయవంతం
చేయాలని ప్రజలను కోరారు.