ఫార్మసీ విద్యార్థులు పరిశోధనలపై దృష్టి సారించాలి గుంటూరులోని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ దోనవల్లి లక్ష్మణ్ విజ్ఞాన్ ఫార్మసీలో ఘనంగా ప్రారంభమైన జాతీయస్థాయి కాన్ఫరెన్స్ ఫార్మసీ విద్యార్థులు పరిశోధనల వైపు ఆసక్తి పెంచుకోవాలని, అప్పుడే దేశానికి ఉపయోగపడే విధంగా కొత్త మందుల ఆవిష్కరణలకు నాంది పలకవచ్చని గుంటూరులోని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ దోనవల్లి లక్ష్మణ్ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ ఫార్మసీ కళాశాలలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫార్మసీ ప్రాక్టీస్, సూట్స్ కేర్ నెట్‌వర్క్‌ల సంయుక్త ఆధ్వర్యంలో ‘‘ప్రివెంటెవ్ అండ్ ఎమర్జెన్సీ మెడికల్ సైన్సెస్’’ అనే అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించనున్న జాతీయ స్థాయి కాన్ఫరెన్స్‌ను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కాన్ఫరెన్స్‌ను ‘‘ఏ పారాడిమ్ షిఫ్ట్ ఆఫ్ క్లినికల్ ప్రాక్టీస్ ఫ్రమ్ హాస్పిటల్ టు కమ్యూనిటీ ఎట్ లార్జ్’’ అనే ఇతివృత్తంతో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గుంటూరులోని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్...