విజ్ఞాన్స్‌ వర్సిటీకు రూ.9.15 కోట్ల ఎన్‌టీటీఎమ్‌ ప్రాజెక్ట్‌ ఫండ్‌

విజ్ఞాన్స్‌ వర్సిటీకు రూ.9.15 కోట్ల ఎన్‌టీటీఎమ్‌ ప్రాజెక్ట్‌ ఫండ్‌
ప్రాజెక్ట్‌ ఫండ్‌కు కృషి చేసిన అధ్యాపక సిబ్బందిని అభినందిస్తున్న వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:

చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ వర్సిటీకు భారత ప్రభుత్వంలోని మినిస్ట్రీ ఆఫ్‌ టెక్స్‌టైల్‌ నుంచి రూ.9.15 కోట్ల ఎన్‌టీటీఎమ్‌ (నేషనల్‌ టెక్నికల్‌ టెక్స్‌టైల్‌ మిషన్‌) ప్రాజెక్ట్‌ ఫండ్‌ లభించిందని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఎన్‌టీటీఎమ్‌ నుంచి ప్రాజెక్ట్‌ ఫండ్‌ పొందినది ఒక్క విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ మాత్రమేనని తెలియజేసారు. ఈ ప్రాజెక్ట్‌ ఫండ్‌ ద్వారా టెక్నికల్‌ టెక్స్‌టైల్స్‌లో ఔత్సాహిక ఇన్నోవేటర్స్‌ను, పరిశోధనలను, స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. అంతేకాకుండా ఆర్టిఫిసియల్‌ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, 3డీ–4డీ ప్రింటింగ్, రాపిడ్‌ ప్రోటోటైపింగ్‌ ఉపయోగించి స్మార్ట్‌ టెక్స్‌టైల్స్, స్వదేశీ యంత్రాలను కూడా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. దీనివలన టెక్నికల్‌ టెక్స్‌టైల్స్‌లో కొత్త డిగ్రీ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టడంతో పాటు సరికొత్త కోర్సులను అప్‌గ్రెడేషన్‌ చేసుకోవచ్చన్నారు. ఎన్‌టీటీఎమ్‌ నుంచి రూ.9.15 కోట్ల ప్రాజెక్ట్‌ ఫండ్‌కు కృషి చేసిన టెక్స్‌టైల్‌ డిపార్ట్‌మెంట్‌ కోఆర్డినేటర్‌ సీహెచ్‌ గోవర్ధన్‌ రావ్, ఇతర అధ్యాపక సిబ్బందిని విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు అభినందించారు.