Skip to main content

అక్కినేనినాగేశ్వరరావు గారి జయంతి సందర్భంగా

అక్కినేనినాగేశ్వరరావు గారి జయంతి సందర్భంగా
*_పాత్రకు ప్రాణం పోస్తే_*
*_అది అక్కినేని..!_*
+++++++++++++++++
చిత్రకారుడు: ఎం. వెంకట్

*_ఎప్పటి సీతారామజననం_*
*_ఎక్కడ మనం.._*
ఈ రెంటి మధ్యనే 
*తెలుగు సినిమా గమనం..*
మూకీలు ముగిసి టాకీలు మొదలైన టాలీవుడ్ లో
*అక్కినేని ప్రవేశం*
*ఓ చారిత్రక సన్నివేశం..!*

తొలినాళ్ళలో ఆయనకు పరిశ్రమ చిరునామా
తర్వాత ఆయనే అయ్యారు
*పరి"శ్రమ"కు చిరునామా..*
కళాఖండాలకు వీలునామా..!
ఆరడుగుల ఎన్టీఆర్ కు 
పోటీ అయ్యాడు 
ఈ నటనలో మేటి
ఇద్దరూ ఎవరికి వారే సాటి..
నందమూరి పౌరాణికుడైతే
అక్కినేని నటనకు
*_ప్రామాణికుడయ్యాడు.._*
ఆయన రాముని మించిన 
రాముడనిపించుకుంటే
ఈయన రాముడు 
కాదు కృష్ణుడు..
తాండవకృష్ణుడు..!

రెండు సినిమాల్లో 
రామారావు కృష్ణుడై 
ఒకేలాంటి నటనను ప్రదర్శిస్తే
*మాయాబజార్లో* అభిమన్యుడిగా
*కృష్ణార్జునయుద్ధం* లో కిరీటిగా
విభిన్న ప్రదర్శన అక్కినేనిది..
పాత్ర ఏదైనా ఆయన
*_అభినయం తిరుగులేనిది!_*

తొలితరం *రొమాంటిక్ హీరో*
*నవలానాయకుడు..*
*_భగ్నప్రేమికుడు.._*
భక్తి లేకపోయినా 
తెరపై మహాభక్తుడు..
మందుకొట్టని 
తాగుబోతు నటుడు..
*ఆ లోతు కళ్ళు*
*వేయి భావాల ఆనవాళ్లు*
నిషాకు నకళ్లు
భక్తి వాకిళ్ళు
రోషం ప్రదర్శిస్తే నిప్పురాళ్లు..
కోపం వర్షించే 
తుపాకీ గుళ్ళు..
భాగ్యనగరిలో తెలుగు సినిమాకి పునాదిరాళ్ళు..!

పారూ..నాతో రాత్రికి రాత్రే
లేచి వచ్చేస్తావా
అన్న *_దేవదాసు.._* 
నాగేశ్వర రావు
నటవిశ్వరూపానికి
పూర్తి డోసు..
*లతా ఎందుకు చేసావీ పని..*
అన్న ఒక్క డైలాగ్ 
సురేష్ ప్రొడక్షన్స్ కు 
కలెక్షన్ల గని..
బెంగాలీ *దేవదాసు*
మొఘలాయి *సలీం*
గ్లాసు పడితే దేవదాసు
కలం పట్టితే *కాళిదాసు*
లేని మైకం నటిస్తూ
శ్రీదేవికి,జయసుధకు కలిపి చేశాడు *_ప్రేమాభిషేకం.._*
సావిత్రితో నాగ్గాడు జతకడితే
నిర్మాతలకు కనకాభిషేకం..

*జగపతి* సంస్థకు 
జేబు నిండుగా
*సురేష్ ప్రొడక్షన్స్* 
తన జేబు సంస్థగా
*ఇల్లాలు* అన్నపూర్ణ కి
ఆమె పేరిట పెట్టిన *అన్నపూర్ణా* సంస్థకు _*వెలుగునీడ*_ గా..
విరాజిల్లిన *_చక్రధారి.._*
ఎన్నో సంచలన 
విజయాల సూత్రధారి..!
ఆయన నటించిన 
ప్రతి శోక సన్నివేశం
మన కళ్లు వర్షించి
ఇచ్చే *_మేఘసందేశం.._*
స్టెప్పైనా..సిప్పైనా..
క్లోజప్పైనా..ఏ గెటప్పైనా..
అక్కినేని ఒక్కడికే నప్పేనా..
దిలీప్ కుమార్ అంతటివాడైనా
తన కంటే ఏయెన్నారే 
గొప్పని ఒప్పుకోక తప్పేనా..
ఆయన మహానటుడని
జగమంతా పలికే..
అందుకే ఆయనయ్యాడు
*దాదా సాహెబ్ ఫాల్కే..!*

🌸🌸🌸🌸🌸🌸🌸

అక్కినేని నాగేశ్వరరావు 
శతజయంతి(20.09.1923) 
సందర్భంగా ప్రణామాలు 
*********************     
*_సురేష్ కుమార్ ఎలిశెట్టి_*
      *విజయనగరం*
        9948546286
.....................................


అక్కినేనినాగేశ్వరరావు గారి జయంతి సందర్భంగా.. 

శీర్షిక:నటనానిఘంటువు

నాటకరంగంలో ప్రవేశించిన యువకుడు
నటనలో ఓనమాలు నేర్చుకొన్న ఘనుడు
నవరసాలు తన నటనలో పండిస్తూ
సినిమా రంగంలో అడుగు పెట్టిన కష్టజీవి..!!
తిరుగులేని కథానాయకుడు వెలుగొందే
కళారంగంలో ధ్రువతారగా నిలిచే
అద్భుత నటనా కౌశలంతో ఉర్రూతలూగించి
నాస్తికుడైనా భక్తితో నటనకు ప్రాణం పోసే..!!
నటనా చాతుర్యముతో హృదయాలను గెలిచి
దేశం గర్వించదగ్గ మహానటుడిగా ఎదిగే
జానపద చిత్రాల తో మొదలుపెట్టి
అన్ని రకాల పాత్రలకు సజీవ సాక్ష్యంగా నిలిగే..
ఆహార్యం అభినయం తో అలరించి
చలనచిత్ర రంగంలో ఘనపాటి గా నిలిచే 
అన్నగారితో పోటీపడి నటిస్తూ
సినిమా రెండు కళ్ళలో ఒక కన్నుగా విరాజిల్లే..
అన్నపూర్ణ స్టూడియో స్థాపించి
సినిమా నటులను తెలుగు నేలకు రప్పించే
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును సాధించి
తెలుగు సినిమా వినీలాకాశంలో వికసించే..
జానపద ,పౌరాణిక పాత్రలకు జీవం తెచ్చే
చారిత్రక ,సాంఘిక సినిమాలలో చరిత్ర సృష్టించే
నట సామ్రాట్ గా  సుస్థిర స్థానం సాధించి
అవార్డులకు రివార్డులకు చిరునామాగా ప్రసిద్ధిపొందే..
నటనకు అతను ఒక నిఘంటువు
భారత సినీ పరిశ్రమకు దొరికిన కోహినూరు
పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేస్తూ
సినిమాను ఉన్నత స్థాయిలో పెట్టిన మహోన్నతుడు..
సినిమా చరిత్ర ఉన్నన్నాళ్ళు "అక్కినేని" సుస్థిరం
కళామతల్లి ఒడిలో పెరిగిన ముద్దుల తనయుడు
సినీ జపత్తులో పెరిగిన మహా వృక్షానికి
నా అక్షర నీరాజనం సమర్పయామి..

 కొప్పుల ప్రసాద్
నంద్యాల
9885066235

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...