అక్కినేని చిరస్మరణీయులు

 అక్కినేని  చిరస్మరణీయులు
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్, తెనాలి:

సినీరంగంలో ఎవర్గ్రీన్ హీరో అక్కినేని నాగేశ్వరరావు చిరస్మం గణీయులని శారదా నికేతన్ నిర్వాహకులు శారదా చలపతి అన్నారు . స్థానిక గాంధీనగర్ లోని బొల్లిముంత ఫౌడేషన్ హాల్లో అభ్యుదయ కళాసమితి , తెనాలి కల్చరల్ ఫిల్మ్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం అక్కనేని నాగేశ్వరరావు శతజయంతి నిర్వహించారు . ఈ సందర్భంగా తొలుత అక్కినేని చిత్రపటానికి నివాళులర్పించారు . శారత చలపతి మాట్లాడుతూ 93 ఏళ్ళ వయసు వరకూ అక్కినేని సినిమాల్లో నటన ప్రశంసనీయమన్నారు . ఇస్కస్ జిల్లా నాయకులు శ్రీదేవి మాట్లాడుతూ అక్కినేని నాటక రంగం నుంచి సినీరంగంలోకి అడుగు పెట్టారని , తన తననతో ఎంతో మంది అభిమానాన్ని చూరగొన్నారని కొనియాడారు . కార్యక్రమంలో బొల్లిముంత కృష్ణ , టి . జగన్మోహనరావు , పలువురు కళాకారులు , సాహితీ ప్రియులు పాల్గొన్నారు .

స్వరలయ ఆధ్వర్యంలో అక్కినేనికి నివాళి

చలనచిత్ర రంగంలో డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు చెరగని ముద్ర వేశారని స్వరలయ వేదిక అధ్యక్షులు లక్కరాజు సాయి అన్నారు . స్థానిక మారిసు పేటలోని స్వరలయ వేదిక కార్యాలయంలో అక్కినేని శతజయంత్యోత్సవం నిర్వహించారు . సాయి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తొలుత అక్కినేని చిత్రపటానికి నివాళులర్పించారు . ఈ సందర్భంగా కావూరు సత్యనారాయణ ను అక్కినేని పురస్కారంతో సంస్థ బృందం సత్కరించింది . కార్యక్రమంలో పినపాటి సురేష్ బాబు , కె విమల్ కుమార్ , శ్రీధర్ , వెంగళరావు , హేమంత్ , మల్లేశ్వరరావు వెంకీ , ప్రశాంత్ , శ్రీనివాస్ , రమణయ్య పాల్గొన్నారు .