విజ్ఞాన్స్‌ వర్సిటీకు క్యూఎస్‌ ఐ–గేజ్‌ డైమండ్‌ రేటింగ్‌

విజ్ఞాన్స్‌ వర్సిటీకు క్యూఎస్‌ ఐ–గేజ్‌ డైమండ్‌ రేటింగ్‌
– ఇంటర్నేషనల్‌ అక్రిడిటేషన్‌
లండన్‌లోని క్యూఎస్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ ప్రతిష్టాత్మకంగా ప్రకటించే క్యూఎస్‌ ఐ–గేజ్‌ ఇంటర్నేషనల్‌ అక్రిడిటేషన్‌లో గుంటూరు జిల్లాలోని చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు డైమండ్‌ రేటింగ్‌ – ఇంటర్నేషనల్‌ అక్రిడిటేషన్‌ లభించింది. ఇందుకు సంబంధించిన అధికారిక ధృవపత్రాన్ని చెన్నైలోని ట్రిడెంట్‌ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో డైమండ్‌ రేటింగ్‌ – ఇంటర్నేషనల్‌ అక్రిడిటేషన్‌ సర్టిఫికెట్‌ను తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ చేతుల మీదుగా  విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ మంగళవారం అందుకున్నారు. ఈ సందర్భంగా వర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌  మాట్లాడుతూ యూనివర్సిటీకు క్యూఎస్‌ ఐ–గేజ్‌ ఇంటర్నేషనల్‌ అక్రిడిటేషన్‌ను  ఇవ్వాలంటే ప్రధానంగా 9 అంశాలను పరిగణలోనికి తీసుకుంటారన్నారు. వాటిలో టీచింగ్‌ అండ్‌ లెర్నింగ్, ఫ్యాకల్టీ క్వాలిటీ, ఎంప్లాయబిలిటీ, డైవర్సిటీ అండ్‌ యాక్సిసిబిలిటీ, ఫెసిలిటీస్, సోషల్‌ రెస్పాన్సిబిలిటీ, గవర్నెన్స్‌ అండ్‌ స్ట్రక్చర్, రీసెర్చ్, అకడమిక్‌ డెవలప్‌మెంట్‌ ప్రధానంగా ఉంటాయన్నారు. ఈ 9 విభాగాల్లోని అంశాల్లో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు 6 విభాగాల్లో ప్లాటినమ్‌ రేటింగ్, 2 విభాగాల్లో గోల్డ్‌ రేటింగ్, 1 విభాగంలో డైమండ్‌ రేటింగ్‌ సాధించి 90 శాతం స్కోరుతో డైమండ్‌ రేటింగ్‌ అక్రిడిటేషన్‌ సాధించిందన్నారు. విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు క్యూఎస్‌ ఐ–గేజ్‌ డైమండ్‌ రేటింగ్‌ అక్రిడిటేషన్‌ రెండేళ్ల పాటు లభించిందని తెలియజేసారు. అకడమిక్‌ రెపుటేషన్, ఎంప్లాయర్‌ రెపుటేషన్, విద్యార్థుల నిష్పత్తికి తగ్గట్లుగా అధ్యాపకులు, స్కూపస్‌ జర్నల్స్‌లో పరిశోధన పేపర్లు ప్రచురించడంతో పాటు అధ్యాపకుల సైటేషన్స్‌ ఎక్కువగా ఉండటం, ఇంటర్నేషనల్‌ విద్యార్థులు కూడా సరైన నిష్పత్తిలో ఉండటం, ఎక్కువ మంది విద్యార్థులను వివిధ దేశాలకు చెందిన యూనివర్సిటీలతో అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుని స్టూడెంట్‌ ఎక్స్‌చేంజ్‌ ప్రోగ్రామ్స్‌ను నిర్వహించడం వలనే తమ యూనివర్సిటీకు ఉత్తమ రేటింగ్‌ అక్రిడిటేషన్‌ లభించిదని వెల్లడించారు. క్యూఎస్‌ ఐ–గేజ్‌  ఇంటర్నేషనల్‌ అక్రిడిటేషన్‌లో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు డైమండ్‌ రేటింగ్‌ రావటంతో విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, ఐక్యూఏసీ బృందం, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు ఆనందం వ్యక్తం చేశారు.