బస్వరాజ్ కు ' విశ్వగురు వరల్డ్ రికార్డ్స్'లో చోటు

బస్వరాజ్ కు ' విశ్వగురు వరల్డ్ రికార్డ్స్'లో చోటు
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:  పర్యావరణ హిత కళాఖండాల సృష్టికర్త కాప్రాకు చెందిన  బస్వరాజ్ విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ పురస్కారం అందుకున్నారు. మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ పూర్తి చేసిన బస్వరాజ్ పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్నారు . తాను రూపొందించిన కళాఖండాలు , విగ్రహాలతో ఆయన ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు . చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆయన 51 కిలోల పసుపుతో అయిదున్నర అడుగుల హరిద్రా వినాయక విగ్రహాన్ని రూపొందించారు . విశ్వగురు సంస్థ ప్రతినిధులు  బుధవారం మండపానికి విచ్చేసి హోతి బస్వరాజ్ కు విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ధ్రువపత్రం అందజేశారు .