విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అధ్యాపకుడికి పీహెచ్‌డీ

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అధ్యాపకుడికి పీహెచ్‌డీ
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ సైన్స్‌ విభాగానికి చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డీ. యాకోబుకు తమ యూనివర్సటీ సీఎస్‌ఈ విభాగంలో బుధవారం పీహెచ్‌డీ పట్టా అందించిందని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘యాన్‌ ఎఫిసియంట్‌ క్రిప్టో–స్కీమ్‌ ఫర్‌ ప్రైవసీ ప్రిసర్వేషన్‌ ఆఫ్‌ అన్‌స్ట్రక్చర్డ్‌ టెక్ట్స్‌ అండ్‌ స్ట్రక్చర్డ్‌ డేటా ఇన్‌ పబ్లిక్‌ క్లౌడ్‌’’ అనే అంశంపై పరిశోధన చేశారని తెలియజేశారు. ఈయనకు విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని అడ్వాన్డ్స్‌ సీఎస్‌ఈ విభాగాధిపతి ప్రొఫెసర్‌ దొండేటి వెంకటేషులు గైడ్‌గా వ్యవహరించారని పేర్కొన్నారు. ఈయన తన పరిశోధనలో భాగంగా మొత్తం 3 స్కూపస్‌ ఇండెక్డ్స్‌ జర్నల్స్, 3 ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పేపర్లు పబ్లిష్‌ చేశారని తెలియజేసారు. పీహెచ్‌డీ పట్టా పొందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డీ.యాకోబును వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది అభినందించారు.