మన్నవ బాబుకు న్యాయ శాస్త్ర విభాగంలో పీహెచ్.డి డిగ్రీ

స్థానిక తెనాలి పట్టణం సమీపంలోని నందివెలుగు గ్రామానికి చెందిన మన్నవ బాబు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి న్యాయ శాస్త్ర విభాగంలో పీహెచ్.డి డిగ్రీ పట్టాను పొందినట్లుగా ఒక ప్రకటనలో తెలియజేశారు.   వీరు నందివెలుగు గ్రామంలోని మన్నవ వెంకటేశ్వర్లు, జయమ్మ దంపతుల ఏడుగురు సంతానంలో మూడో వ్యక్తిగా ఉన్న మన్నవ బాబు 2008లో  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన న్యాయమూర్తుల (జడ్జిల) నియామకంలో జూనియర్ సివిల్ జడ్జిగా నియామకం అయ్యారు.
 కడు పేద కుటుంబం నుంచి వచ్చిన మన్నవ బాబు, విద్య పట్ల ఎంతో ఆసక్తి కలిగి, ఒక ప్రక్క సెలవు దినాలలో పనిపాటలు చేసుకుంటూ కూలీనాలీకి వెళ్తూ, పెయింటర్ గా వ్యవసాయ కూలీగా, రకరకాల పనుల్లో తాను ఆర్థికంగా కాస్త బలాన్ని సమకూర్చుకుంటూ, ఆ వచ్చిన డబ్బుల్ని కుటుంబ పోషణకి కొంత, మరికొంత  చదువులకు వినియోగించుకుంటూ ఎదిగినటువంటి వ్యక్తి మన్నవ బాబు. వీరు 2008కి పూర్వం తెనాలిలోని ప్రముఖ న్యాయవాది ఎస్ రామారావు గారి పర్యవేక్షణలో జూనియర్ న్యాయవాదిగా  కొనసాగుతూనే, న్యాయమూర్తిగా ఎంపికకోసంజరిపే పరీక్షలకు సన్నద్దుడౌతుండేవారు.  మొదటి సారి పరీక్షలో విజయం సాధించినప్పటికీ, ఇంటర్వ్యూ లో అవకాశం చేజారిపోయింది. అయినప్పటికీ  రెండోసారి  ప్రయత్నించటం, ఇప్పుడుకూడా చేజారిపోవటంతోనిరుత్సాహపడకుండా మరింతరెట్టించినఉత్సాహంతో, మూడో ప్రయత్నంలో తాను విజయం సాధించి జూనియర్ సివిల్ జడ్జిగా ఈనాటి తెలంగాణ రాష్ట్రానికి చెందిన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మణుగూరులో  ప్రాంతంలో పోస్టింగ్ న్యాయమూర్తిగా విధుల్లో చేరారు. కృష్ణాజిల్లా అవనిగడ్డలోను,  అక్కడి నుంచి కర్నూలులోనూ, ఆ తదనంతరం కందుకూరులోనూ న్యాయమూర్తిగా సేవల్ని అందించి,  ఇప్పుడు పదోన్నతి పైన  శ్రీకాకుళం జిల్లాలోని రాజాం లో సీనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్నారు.
అదే క్రమంలో ఒక పక్క తన ఉద్యోగ బాధ్యతల్ని న్యాయమూర్తిగా కొనసాగిస్తూనే తన చదువుని కూడా ఏమాత్రం విడిచి పెట్టకుండా భారతీయ శిక్షాస్మృతిలో నేరస్తులకు కూడా కొన్ని హక్కులుంటాయని, ఆ హక్కులు రాజ్యాంగం ప్రకారం ఇండియన్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో పొందుపరచబడి నట్లుగా వాటిని నేరస్తులకు పొందే హక్కు నేరస్తులకు ఎలా వుందో, వాటి మీద రకరకాల మార్గాల్లో తాను పరిశోధన చేశారు.  "ఎ రైట్ టు ఎ ఆక్యూజ్డ్ పర్సన్ ఇన్ ఇండియన్ క్రిమినల్ జస్టిస్-  క్రిటికల్ ఎనాలిసిస్" అనే అంశం పైన పరిశోధన చేసి సిద్ధాంత గ్రంధాన్ని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ లీగల్  స్టడీ డిపార్ట్మెంట్ కు సమర్పించడం, ఆ పరిశోధన నివేదికను వివిధ విశ్వ విద్యాలయాలకు  సంబంధించిన ఆచార్యులు పరిశీలించి దీనిని ఉత్తమ పరిశోధనగా భావించి విశ్వ విద్యాలయ అధికారులకి ఈ పరిశోధనకి  పిహెచ్.డి  డిగ్రీ ప్రధానం చేయ వలసిందిగా సిఫారసులు  చేయటంతో, బహిరంగ  మౌఖిక పరీక్షను నిర్వహించి పీహెచ్డీ డిగ్రీని ప్రధానం చేయడం జరిగింది. 
ఈ పరిశోధనలో తాను నేరస్తులకి కొన్ని హక్కులు ఉంటాయని ఆ హక్కుల్ని వారు పొందటానికి అర్హులని రాజ్యాంగం ప్రకారం భారతీయ శిక్షాస్మృతి చట్టం ప్రకారం రాజ్యాంగం కల్పించిన హక్కులు నేరస్తులకు కూడా కొన్ని హక్కులు ఉంటాయని ఆ హక్కుల్ని పరిరక్షించాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరికి ఉందని న్యాయమూర్తిగా మన్నవ బాబు పరిశోధన చేసి సమర్పించడం దాని ద్వారా తాను పిహెచ్.డి   ని పొందటం చాలా సంతోషంగావుందనితెలియజేశారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తి మన్నవ బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పట్టుదలతో కృషి చేస్తే, ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి యెదగొచ్చని, ఏమాత్రం అవరోధాలు ఎదురైనా లక్ష్యసిద్ధి ఉన్నప్పుడు లక్ష్యం తప్పకుండా చేరువవుతుందని తెలియజేశారు.
 ఈ సందర్భంగా న్యాయమూర్తి మన్నవ బాబుకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ఆర్ట్స్ కామర్స్ మరియు లా కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సిహెచ్ స్వరూప రాణి,  ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ రెక్టర్ ఆచార్య పి వరప్రసాద్ మూర్తి, డాక్టర్ పిల్లి వాసు, మరియు తెనాలి బార్ అసోసియేషన్ న్యాయవాదుల, పట్టణంలోని ప్రముఖులు వారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.