Skip to main content

Posts

Showing posts from October, 2023

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అధ్యాపకుడికి పీహెచ్‌డీ

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అధ్యాపకుడికి పీహెచ్‌డీ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ సైన్స్‌ విభాగానికి చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ దేవ కుమార్‌ సల్లూరి కు తమ యూనివర్సటీ సీఎస్‌ఈ విభాగంలో సోమవారం పీహెచ్‌డీ పట్టా అందించిందని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ ఏ నోవెల్‌ ఫ్రేమ్‌వర్క్‌ ఫర్‌ సివియారిటీ ప్రెడిక్షన్‌ ఆఫ్‌ డయాబెటిక్‌ రెటినోపతీ’’ అనే అంశంపై పరిశోధన చేశారని తెలియజేశారు. ఈయనకు విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని  సీఎస్‌ఈ విభాగాధిపతి ప్రొఫెసర్‌ కేవీ క్రిష్ణ కిషోర్‌ గైడ్‌గా వ్యవహరించారని పేర్కొన్నారు. ఈయన తన పరిశోధనలో భాగంగా మొత్తం 1 ఎస్‌సీఐ, 2 స్కూపస్‌ ఇండెక్డ్స్‌ జర్నల్స్, 2 ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పేపర్లు పబ్లిష్‌ చేశారని తెలియజేసారు. పీహెచ్‌డీ పట్టా పొందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ దేవ కుమార్‌ సల్లూరి ను వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అ...

5జీ ల్యాబ్‌ స్థాపనకు విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ ఎంపిక

5జీ ల్యాబ్‌ స్థాపనకు విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ ఎంపిక చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీను భారత ప్రభుత్వంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌ మినిస్ట్రీ విభాగం వారు నూతన ఆవిష్కరణలు, పరిశోధనలను మరింత విస్తృతం చేసేందుకు 5జీ ల్యాబ్‌ స్థాపనకు ఎంపిక చేసిందని భారత ప్రధాని నరేంద్ర మోది శుక్రవారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మాట్లాడుతూ ఢిల్లీలో జరుగుతున్న ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌–2023 గ్లోబల్‌ డిజిటల్‌ ఇన్నోవేషన్‌ కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోది విజ్ఞాన్స్‌ యూనివర్సిటీతో పాటు దేశంలోని 100 యూనివర్సిటీల్లో 5జీ ల్యాబ్స్‌ స్థాపనకు కృషి చేస్తున్నట్లు ప్రకటించారని వెల్లడించారు. ఆన్‌లైన్‌ మోడ్‌లో జరిగన ఈ కార్యక్రమాన్ని  విద్యార్థులు విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ ఆడిటోరియంలో వీక్షించారు. ఈ కార్యక్రమాన్ని విజయవాడలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్‌ రూరల్‌ అండ్‌ టెక్నాలజీ డైరక్టర్‌ రామక్రిష్ణ మాజేటి పర్యవేక్షించారు. ఇన్నోవేషన్‌లో భాగంగా విద్యార్థుల స్టార్టప్‌...

తెనాలిలో సామాజిక సాధికార యాత్ర పేరుతో గర్జించిన వైఎస్సార్ సీపీ శ్రేణులు

తెనాలిలో సామాజిక సాధికార యాత్ర పేరుతో గర్జించిన వైఎస్సార్ సీపీ శ్రేణులు *తొలి రోజు తెనాలిలో ప్రారంభమైన యాత్రకు బ్రహ్మరథం పట్టిన ప్రజలు*  టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ధీశాలి, దమ్మున్న వ్యక్తి సీఎం జగన్‌  - మంత్రి జోగి రమేష్‌, సురేష్‌, నాయకులు బడుగు, బలహీన వర్గాల గురించి నిత్యం ఆలోచించే ఏకైక నాయకుడు సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అని మంత్రి జోగి రమేష్‌ తెలిపారు. వైఎస్సార్‌సీపీ అంటే పేద వర్గాల పార్టీగా  గుర్తింపు తెచ్చుకుందన్నారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఇవాళ జగనన్న రథాలు దూసుకెళ్తున్నాయి. ఈ బస్సుల్లో బడుగు బలహీన వర్గాలకు చోటు కల్పించి, అనేక పదవులు కల్పించిన ఏకైన నాయకుడు సీఎం జగన్‌ అని మంత్రి జోగి పేర్కొన్నారు. నారా భువనేశ్వరి నిజం గెలవాలి అని కాకుండా చంద్రబాబు గురించి నిజం చెబుతాను అనే యాత్ర చేసి ఎన్టీఆర్‌కు చేసిన మోసం, వెన్నుపోటు గురించి చెప్పాలని మంత్రి జోగి రమేష్‌ డిమాండ్‌ చేశారు. ఎంతమంది యాత్రలు చేసినా, పొత్తులు పెట్టుకున్నా సీఎం జగన్‌కు అండగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు అండగా ఉంటాయని మంత...

అవకాశాలన్నీ మన దేశంలోనే..

అవకాశాలన్నీ మన దేశంలోనే !   కేంద్ర ఆర్థిక, కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ వేడుకగా విజ్ఞాన్స్‌ వర్సిటీ 11వ స్నాతకోత్సవం 1820 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం 51 మంది విద్యార్థులకు బంగారు పతకాలు  ముగ్గురు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్‌లు   హైదరాబాద్‌లోని అనంత్‌ టెక్నాలజీస్‌ ఫౌండర్‌ డాక్టర్‌ సుబ్బారావ్‌ పావులూరి, హైదరాబాద్‌లోని విమ్టా ల్యాబ్స్‌ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఎస్‌పీ వాసిరెడ్డి, ఇండియన్‌ చెస్‌ ప్లేయర్, పద్మశ్రీ, అర్జున అవార్డు గ్రహీత కోనేరు హంపిలకు గౌరవ డాక్టరేట్‌లు. అవకాశాలు అపారం... అందిపుచ్చుకోండి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక, ప్లానింగ్, కమర్షియల్‌ టాక్స్‌ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ప్రణాళిక ఎంతో కీలకం : హైదరాబాద్‌లోని అనంత్‌ టెక్నాలజీస్‌ ఫౌండర్‌ డాక్టర్‌ సుబ్బారావ్‌ పావులూరి  వినూత్న పరిష్కారాలు వెతకండి :  హైదరాబాద్‌లోని విమ్టా ల్యాబ్స్‌ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఎస్‌పీ వాసిరెడ్డి సమ ప్రాధాన్యం ఇస్తే మేలు : ఇండియన్‌ చెస్‌ ప్లేయర్, పద్మశ్రీ, అర్జున అ...

విజ్ఞాన్స్‌లో ఘనంగా దాండియా ఉత్సవాలు

విజ్ఞాన్స్‌లో ఘనంగా దాండియా ఉత్సవాలు చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో దసరా పండుగను పురస్కరించుకుని విద్యార్థులు దాండియా, బతుకమ్మ సంబరాలను శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవరాత్రి అంటే కేవలం తొమ్మిది రోజులు చేసుకునే ఉత్సవం కాదని... స్త్రీ తత్వం తాలూకు మూడు పరిమాణాలైన దుర్గ, లక్ష్మి, సరస్వతిగా కొలిచే ఉత్సవమన్నారు. అమ్మవారిని పూజిస్తే సిరి సంపదలు సిద్ధించడంతో పాటు సుఖసంతోషాలు కలుగుతాయని చెప్పారు. అమ్మవారిలోని ధైర్యసాహసాలను మహిళాలోకం ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. నలుగురిలో కలవలేకపోతున్నామకునే విద్యార్థులకు నవరాత్రుల్లో చేసే దాండియా నృత్యాలు కొత్త ఉత్సాహాన్ని అందిస్తాయన్నారు. స్నేహితులు, బంధువులతో కలిసి నృత్యం చేయడం, సంతోషంగా గడపడం వంటివన్నీ మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయని విద్యార్థులకు తెలియజేసారు. మీరు ఎంచుకున్న నృత్యం ఏ రూపంలో ఉన్నా... అందరితో కలిసి ఆడుతూ, పాడుతూ ఉంటే మీలోనూ బృందస్ఫూర్తి పెరుగుతుందన్నారు. ఈ విధంగా నృత్యాలు...

Graduation Ceremony for Vignan’s University students on October 23

Graduation Ceremony for Vignan’s University students on October 23 Central Finance and Corporate Affairs Minister Nirmala Sitharaman as Chief Guest Degrees for over 1800 students The eminent guests included Dr. Subbarao Pavuluri, Founder of Ananth Technologies in Hyderabad; Dr. SP Vasireddy, Executive Chairman of Vimta Labs Limited in Hyderabad; and Indian chess player and recipient of the Padma Shri and Arjuna Awards, Koneru Hampi. Vignan's University is gearing up for its 11th graduation ceremony on Monday, October 23. The prestigious event will be graced by Central Finance and Corporate Affairs Minister Nirmala Sitharaman as the chief guest. Distinguished guests of honor include Dr. Subbarao Pavuluri, Founder of Ananth Technologies, Hyderabad, and Dr. SP Vasireddy, Executive Chairman of Vimta Labs Limited, Hyderabad, alongside the esteemed Indian chess player and Padma Shri awardee, Koneru Hampi. Degrees to be Conferred Upon Over 1800 Students University Vice Chancel...

తెనాలిలో వీణా అవార్డ్స్- 2023 పరిషత్ నాటక - నాటిక పోటీలు

తెనాలిలో వీణా అవార్డ్స్- 2023 పరిషత్ నాటక - నాటిక పోటీలు టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: తెనాలి : 19-10-2023 : కళలకాణాచి - తెనాలి , వేదగంగోత్రి ఫోండేషన్ - విజయవాడ వారి సంయుక్త నిర్వహణలో అక్టోబర్ 20 వ తేదీ శుక్రవారం నుండి 24 వ తేదీ మంగళవారం వరకు తృతీయ జాతీయస్థాయి వీణా అవార్డ్స్ -2023 పద్యనాటక , సాంఘిక నాటిక పోటీలు జరుపుతున్నట్లు కళల కాణాచి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు , సినీ మాటల రచయిత డాక్టర్ సాయిమాధవ్ బుర్రా తెలియజేశారు . స్థానిక గాంధీనగర్లోని సి.పి.ఐ. కార్యాలయంలో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం ఆయన మాట్లాడుతూ తెనాలిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ పరిషత్ పోటీలకు అనూహ్యమైన స్పందన వచ్చిందన్నారు . ఎంట్రీలో 35 పద్య నాటకాలు , 40 సాంఘిక నాటికలు రాగా ఒక్కో విభాగానికి ఏడు చొప్పున పోటీ ప్రదర్శనకు ఎంపికచేశాము . మరో నాలుగు సాంఘిక నాటకాలను పోటీతో సంబంధం లేకుండా ప్రదర్శించడానికి అనుమతిచ్చాము . గతంలో ఏప్రిల్లో పద్య నాటకాలు , అక్టోబర్లో సాంఘిక నాటికల పోటీలు జరిపాము . అయితే కళాకారులు అభ్యర్థనమేరకు దసరా సందర్భంగా రెండు విభాగాల నాటక , నాటికలను కన్నులపండుగగా ఒకే వేదికపై నిర్వహి...

జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:  చుండూరు: జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పిలుపునిచ్చారు. బుధవారం మండల పరిధిలోని తొట్టెంపూడి గ్రామంలో జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన  అన్నారు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో నిపుణులైన వైద్యులు ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ప్రజలకు అవసరమైన అన్ని రకాల వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి ముందులు ఇవ్వడం జరుగుతుందన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష   క్యాంపుల  ద్వారా ఏ ప్రాంతంలో ప్రజలు ఎలాంటి వ్యాధులకు తరుచూ గురైతున్నారనే విషయాన్ని గమనించాలన్నారు. తద్వారా ఆ ప్రాంతాల్లో వైద్య పరీక్షలు నిర్వహించి ప్రజలకు అవసరమైన ముందులుఇవ్వడం జరుగుతుందన్నారు. జగనన్న  ఆరోగ్య సురక్ష క్యాంపులో ఓ.పి ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. వైద్య పరీక...

సవాళ్లను అధిగమించి అభివృద్ధి వైపు పయనించాలి

సవాళ్లను అధిగమించి అభివృద్ధి వైపు పయనించాలి   పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ బీఎమ్‌. పట్నాయక్‌ విజ్ఞాన్స్‌లో ఘనంగా అమ్రిత్‌ కాల్‌ విమర్ష్‌ – వికాస్‌ భారత్‌–2047 ఉపన్యాస కార్యక్రమం మన దేశ పురోగతికి ఆటంకం కలిగించే సవాళ్లను అధిగమించి అభివృద్ధి వైపు పయనించాలని పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ బీఎమ్‌. పట్నాయక్‌ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఏఐసీటీఈ ఏర్పాటు చేసిన ‘‘ ద రోల్‌ ఆఫ్‌ కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ – ద జర్నీ అండ్‌ ఫ్యూచర్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌ ఫర్‌ వికాసిత్‌ భారత్‌– 2047 / డెవలప్డ్‌ భారత్‌ –2047’’ అనే అంశంపై ప్రత్యేక అతిథి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ బీఎమ్‌. పట్నాయక్‌ మాట్లాడుతూ 2047 నాటికి భారతదేశం ఆర్థిక వృద్ధి, సామాజిక, సాంకేతిక పురోగతి, స్థిరమైన అభివృద్ధి కోసం స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించడం ద్వారా యువత చురుకుగా పాల్గొనడానికి రోడ్‌మ్యాప్‌ను...

"జ్ఞానపీఠ" అందుకున్న ప్రసిద్ధడు రావూరి భరద్వాజ స్మృతి దినం

గొప్ప భావుకుడైన తెలుగు కవి, రచయిత, 37 కథా సంపుటాలు, 17 నవలలు, 6 బాలల మినీ నవలలు, 5 బాలల కథా సంపుటాలు, 3 వ్యాస, ఆత్మకథా సంపుటాలు, 8 నాటికలు, ఐదు రేడియో కథానికలు రచించారు.తెలుగు రచనా ప్రపంచంలో వినూత్న సాహితీ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన సాహితీవేత్త, వారి ఉతృష్ట రచనగా పరిగణింపబడే "పాకుడురాళ్ళు" నవలకు భారత దేశ అత్త్యుత్తమ సాహితీ పురస్కారం "జ్ఞానపీఠ"  అందుకున్న  ప్రసిద్ధడు రావూరి భరద్వాజ గారి స్మృతి దినం ! రావూరి భరద్వాజ (జూలై 5,1927-అక్టోబరు 18, 2013) తెలుగు లఘు కథా రచయిత, నవలా రచయిత, రేడియోలో రచయితగా పేరుతెచ్చుకున్నాడు. ఈయన బాలసాహిత్యంలో కూడా విశేషకృషి సలిపాడు.  సినీ పరిశ్రమలో తెరవెనుక జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చిత్రీకరించిన పాకుడు రాళ్ళు నవల భరద్వాజ యొక్క ఉతృష్ట రచనగా పరిగణింపబడుతుంది. ఈయన రచనలలో "జీవన సమరం" మరో ప్రముఖ రచన. ..... తెలుగు రచనా ప్రపంచంలో వినూత్న సాహితీ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ఘనుడితడు. ఆడంబరాలులేని సాధారణ జీవితం ఆయనది. భరద్వాజకు దిగువ మధ్యతరగతి, పేదప్రజల భాషపై గట్టిపట్టు ఉంది. ఒక బీదకుటుంబంలో జన్మించిన భరద్వాజ కేవలం ఉన్నత పాఠశ...

తెనాలిలో షాపింగ్ కాంప్లెక్స్ అద్దెకు లభించును

తెనాలి  పాత రత్నా టాకీస్ వద్ద రైతు బజార్ ఎదురు 1600 స్క్వేర్ ఫీట్ గల "జయ వెంకట్ కాంప్లెక్స్" నందు2,3,4 ఫ్లోర్లు ఆఫీసులకు, బ్యాంకులకు, షాపులకు అద్దెకి ఇవ్వబడును. లిఫ్ట్ సౌకర్యం కలదు. ph:81218 55396,93939 46462 .

23న విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ 11వ స్నాతకోత్సవం

23న విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ 11వ స్నాతకోత్సవం  _ ముఖ్య అతిథిగా సెంట్రల్‌ ఫైనాన్స్, కార్పొరేట్‌ అఫైర్స్‌ మినిస్టర్‌ నిర్మలా సీతారామన్‌   _ గౌరవ అతిథులుగా హైదరాబాద్‌లోని అనంత్‌ టెక్నాలజీస్‌ ఫౌండర్‌ డాక్టర్‌ సుబ్బారావ్‌ పావులూరి, హైదరాబాద్‌లోని విమ్‌టా ల్యాబ్స్‌ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఎస్‌పీ వాసిరెడ్డి, ఇండియన్‌ చెస్‌ ప్లేయర్, పద్మశ్రీ, అర్జున అవార్డు గ్రహీత కోనేరు హంపి _ముగ్గురికి గౌరవ డాక్టరేట్లు ప్రధానం  _1800 మందికి పైగా విద్యార్థులకు డిగ్రీలు టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: అక్టోబర్‌ 23వ తేదీ సోమవారం విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ 11వ స్నాతకోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైస్‌ చాన్స్‌లర్‌ మాట్లాడుతూ 23న  జరిగే 11వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా సెంట్రల్‌ ఫైనాన్స్, కార్పొరేట్‌ అఫైర్స్‌ మినిస్టర్‌ నిర్మలా సీతారామన్, గౌరవ అతిథులుగా హైదరాబాద్‌లోని అనంత్‌ టెక్నాలజీస్‌ ఫౌండర్‌ డాక్టర్‌ సుబ్బారావ్‌ పావులూరి,...

పరిశోధకులు వినూత్న కార్యక్రమాల్లో నిమగ్నమవ్వాలి

పరిశోధకులు వినూత్న కార్యక్రమాల్లో నిమగ్నమవ్వాలి హైదరాబాద్‌లోని ఐఐసీటీ చీఫ్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ కే.భానుప్రకాష్‌   విజ్ఞాన్స్‌లో ఘనంగా ముగిసిన జాతీయస్థాయి వర్క్‌షాప్‌ దేశ సమగ్ర ప్రగతికి దోహదపడే వినూత్న కార్యక్రమాలలో పరిశోధకులు నిమగ్నమవ్వాలని హైదరాబాద్‌లోని ఐఐసీటీ చీఫ్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ కే.భానుప్రకాష్‌ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ అప్లైడ్‌ సైన్స్‌ అండ్‌ హ్యుమానిటీస్‌ ఆధ్వర్యంలోని కెమిస్ట్రీ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో ‘‘ హ్యాండ్స్‌ ఆన్‌ ట్రైనింగ్‌ యూజింగ్‌ ఇన్‌–సిలికో టూల్స్‌ ఫర్‌ కెమికల్‌/ బయోలాజికల్‌ అప్లికేషన్స్‌’’ అనే అంశంపై మూడు రోజుల పాటు నిర్వహించిన జాతీయస్థాయి వర్క్‌షాప్‌ ఘనంగా ముగిసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్‌లోని ఐఐసీటీ చీఫ్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ కే.భానుప్రకాష్‌ వివిధ రకాల రసాయన మూలకాలు, వాటి స్వరూపాలు, ప్రయోజనాలు, సొసైటీ ప్రగతికి దోహదపడ్డ అంశాలను విద్యార్థులతో పంచుకున్నారు. ‘కంప్యూటింగ్‌ విధానాలు మరియు పరమాణు అంచనాలు‘ అనే అంశంపై మాట్లాడుతూ అణువుల లక్షణాలను అంచనా వేయడానికి గణన పద్ధతులను ఉపయో...

విజ్ఞాన్స్‌లో న్యూ క్రిమినల్‌ లా బిల్స్‌పై వర్క్‌షాప్‌

విజ్ఞాన్స్‌లో న్యూ క్రిమినల్‌ లా బిల్స్‌పై వర్క్‌షాప్‌ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని విజ్ఞాన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ లా డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో ‘‘ అస్సెసింగ్‌ ద న్యూ క్రిమినల్‌ లా బిల్స్‌: ఏ క్రిటికల్‌ అప్రోచ్‌ టు క్రిమినల్‌ లా రిఫార్మ్‌’’ అనే అంశంపై జాతీయ స్థాయి వర్క్‌షాప్‌ను  నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఢిల్లీలోని నేషనల్‌ లా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ అనూప్‌ సురేంద్రనాథ్‌ విద్యార్థులకు భారతీయ న్యాయ సంహిత, 2023 (కొత్త శిక్షా బిల్లు), భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత, 2023 (న్యూ ప్రొసీజర్‌ బిల్లు) మరియు భారతీయ సాక్ష్యా బిల్లు, 2023 (న్యూ ఎవిడెన్స్‌ బిల్లు) ప్రాముఖ్యత గురించి వివరించారు. ప్రభుత్వం ఈ బిల్లులను విప్లవాత్మకమైనదిగా ప్రోత్సహిస్తున్నప్పటికీ, నిశితంగా పరిశీలిస్తే చాలా తక్కువ మార్పులు మరియు విస్తరణలు మాత్రమే వెల్లడవుతాయని పేర్కొన్నారు. క్రిమినల్‌ చట్టాలను సంస్కరించడానికి అనేక ఇతర రంగాలను కూడా చేర్చాలని కోరారు. సమాజాన్ని రూపుమాపడంలో చట్టం కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, అది అన్ని సామాజిక సమస్యలను పర...

రేపు రెయిన్బో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎక్స్పో -2023

రేపు రెయిన్బో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎక్స్పో -2023 టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: తెనాలి : పట్టణానికి చెందిన రెయినో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎక్స్పో -2023 ను ఈనెల 15 న స్థానిక ఎన్జీఓ కళ్యాణమండపంలో నిర్వహించనున్నట్టు ట్రస్ట్ వ్యవస్థాపకురాలు డాక్టర్ డి . జీవ నలత తెలిపారు . మహిళా సాధికారతను ప్రోత్సహించే మార్గంలో కొత్త మహిళా ఎంటర్ ప్రెన్యూర్స్న ప్రోత్సహించే లక్ష్యంగా ఎక్స్ పో -2023 ను నిర్వహించనున్నట్లు విలేకరుల సమావేశంలో వివరించారు . ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఎక్స్పోలో మహిళలు తయారుచేసిన వివిధ రకాల ఉత్పత్తులను ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు . వీరితో పాటు వరలక్ష్మి , కల్యాణి , గాయత్రి , సృజన , జ్యోతి లు ఉన్నారు .

నెహ్రూనికేతన్‌లో అంబరాన్ని అంటిన దసరా సంబరాలు

నెహ్రూనికేతన్‌లో అంబరాన్ని అంటిన దసరా సంబరాలు    తెనాలి : స్థానిక బోస్‌రోడ్డులోని నెహ్రూనికేతన్‌ పాఠశాలలో శుక్రవారం ఉదయం ముందస్తు దసరా వేడుకలను ఘనంగా జరిపారు.  పాఠశాల మేనేజింగ్‌ డైరెక్టర్‌ మురళీకాంత్‌ వి దాసరి, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డి. గీతాకాంత్‌  పర్యవేక్షణలో జరిగిన ఈ సంబరాలలో దుర్గామాతను  చక్కగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ నేపథ్యంలో మురళీకాంత్‌ మాట్లాడుతూ తెలుగువారి పండుగలలో దసరా పండుగ చాలా విశిష్ఠమైందని, విజయానికి చిహ్నంగా జరుపుకునే ఈ దసరా పండుగ అందరికీ విజయాన్ని చేకూర్చాలని  ఆకాంక్షించారు. గీతాకాంత్‌ మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ అందరూ భక్తి శ్రద్ధలతో నడుచుకోవాలని సూచించారు.  చిన్నారులతో పాటు ఉపాధ్యాయులు సైతం ఆధ్యాత్మిక పాటలకు కోలాటం వంటి సంప్రదాయ నృత్యాలు చేస్తూ వేడుకలకు మరింత వన్నె తెచ్చారు. కొందరు చిన్నారులు కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించగా మరి కొందరు కోలాటం నృత్యాన్ని ప్రదర్శించారు.  ఈ కార్యక్రమంలో బాలబాలికలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

వరల్డ్‌ టాప్‌ 2% సైంటిస్ట్‌లలో విజ్ఞాన్స్‌ అధ్యాపకులకు చోటు

వరల్డ్‌ టాప్‌ 2% సైంటిస్ట్‌లలో విజ్ఞాన్స్‌ అధ్యాపకులకు చోటు చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన 7 అధ్యాపకులు వరల్డ్‌ టాప్‌ 2% సైంటిస్ట్‌లలో చోటు సాధించారని విజ్ఞాన్స్‌ వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ తెలిపారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అమెరికాలోని కాలిఫోర్నియా ప్రాంతంలోని స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ నిర్వహించిన సర్వేలో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీకు చెందిన ప్రొఫెసర్‌ అంబటి రంగారావు, డాక్టర్‌ కే.చంద్రశేఖర్, డాక్టర్‌ పీలే కే.అబ్రహం, మెకానికల్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ప్రొఫెసర్‌ కే.వెంకట రావ్, డాక్టర్‌ కే.బాలమురుగన్, ఫార్మసీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన డాక్టర్‌ రుద్రపాల్‌ మిథున్, కెమికల్‌ విభానికి చెందిన ప్రొఫెసర్‌ టీ.సుబ్బయ్యలు వరల్డ్‌ టాప్‌ 2% సైంటిస్ట్‌లలో నిలిచారని తెలియజేసింది. స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ వారు 2022 సంవత్సరం వరకు ఉన్న ఉత్తమ సైంటిస్ట్‌ల డేటాను తీసుకోవడంతో పాటు స్టాండర్డ్‌ సైన్స్‌ మేట్రిక్స్‌ క్లాసిఫికేషన్‌లో గల 22 సైంటిఫిక్‌ ఫీల్డ్స్, 174 సబ్‌ ఫీల్డ్స్‌ను పర...

విజ్ఞాన్స్‌ను సందర్శించిన అబెట్‌ అక్రిడిటేషన్‌ ప్రాసెస్‌ తనిఖీ బృందం

విజ్ఞాన్స్‌ను సందర్శించిన అబెట్‌ అక్రిడిటేషన్‌ ప్రాసెస్‌ తనిఖీ బృందం చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీను అబెట్‌( అక్రిడిటేషన్‌ బోర్డ్‌ ఫర్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ) అక్రిడిటేషన్‌ ప్రాసెస్‌ కమిటీ బృందం తనిఖీ నిర్వహించింది. అమెరికా నుంచి వచ్చిన 11 మంది సభ్యులతో కూడిన తనిఖీ బృందం యూనివర్సిటీలో మూడు రోజుల పాటు తనిఖీ నిర్వహించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మాట్లడుతూ రెండు తెలుగు రాష్ట్ర్రాలలో అబెట్‌ అక్రిడిటేషన్‌కు దరఖాస్తు చేసుకుని తనిఖీ పూర్తి చేసుకున్న మొట్ట మొదటి యూనివర్సిటీ విజ్ఞాన్‌ అని తెలియజేసారు. తనిఖీ విజయవంతమై అబెట్‌ అక్రిడిటేషన్‌ సాధించినట్లైతే విదేశాలలో ఉన్నత విద్యతో పాటు ఉపాధి అవకాశాలు బాగా మెరుగవుతాయని తెలియజేసారు. వీటితో పాటు విదేశాలలో ఉన్న యూనివర్సిటీలతో విద్యార్థులకు ట్రైనింగ్‌ ప్రోగ్రామ్స్, ఎక్స్‌చేంజ్‌ ప్రోగ్రామ్స్, అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నారు. అబెట్‌ అక్రిడిటేషన్‌ ఉన్న యూనివర్సిటీలకు ఎప్పటికప్పడు సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌తో పాటు కంటిన్యూస్‌ ఇంప్...

అంబేద్కర్ జీవిత చరిత్ర పై జన కథ

అంబేద్కర్ జీవిత చరిత్ర పై జన కథ తెనాలి, అక్టోబరు 8: బాబాసాహెబ్  డాక్టర్ ‌బి.ఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర ను జన కథ కళారూపాలలో గ్రామ గ్రామానికి తీసుకువెళ్లాలని, తద్వారా అంబేద్కర్ జీవిత విశేషాలు ప్రతి ఒక్కరికి తెలుస్తాయని,డాక్టర్ కనపర్తి అబ్రహం లింకన్ అన్నారు.ఆదివారం అయితా నగర్  శ్రీ పొట్టిశ్రీరాములు కళ్యాణ మంటపం లో మేకతోటి ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో " జన కథ" సభా కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి కనపర్తి బెనహర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అబ్రహం లింకన్ మాట్లాడుతూ భారతదేశ సమ తుల్యమైన సమతభావంతో ముందుకు వెళ్లాలంటే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంద్వారానే సాధ్యమవుతుందన్నారు. ఆయన చేసిన త్యాగనిరతి చాలామందికి తెలియదని, ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన అవశ్యకత ఏర్పడిందన్నారు. సమతావాదులు మానవతావాదులు, అంబేద్కర్ రిస్టులు అందరూ సమిష్టిగా ముందుకు కదలాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో, తెనాలి మున్సిపల్ వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి, దళిత మహాసభ నాయకులు నూకతోటి బాబురావు, డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు, మేకతోటి ప్రభాకర్ రావు, హార్మోనియం శ్రీనివాసరావు, న్...

జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా ఫెడరేషన్

జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా ఫెడరేషన్ జర్నలిస్టులకు ప్రమాద బీమా కార్డులు. అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు. నర్సీపట్నం ప్రెస్ క్లబ్ కు నూతన కార్యవర్గం. నర్సీపట్నం.. అక్టోబర్ 8 జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ పనిచేస్తుందని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు అన్నారు. ఆదివారం ఇక్కడ అర్ డి వో కార్యాలయ సమీప ప్రాంగణము లో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టు అసోసియేషన్ లు ఆధ్వర్యంలో ఫెడరేషన్ నర్సీపట్నం ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనుబాబు మాట్లాడుతూ. జర్నలిస్టులకు ఒకొక్కరికి 5 లక్షలు విలువ చేసే ప్రమాద బీమా కార్డులు అందజేయడం. అభినందనీయమన్నారు. దీనివల్ల జర్నలిస్టుల కుటుంబాలకు కొంతవరకు భరోసా కలుగుతుందన్నారు. యూనియన్లకు అతీతంగా ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించుకోవాలని శ్రీను బాబు సూచించారు. జర్నలిస్టులు దసరా సంబరాలు , ఫెడరేషన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. విశాఖ అర్బన్ అధ్యక్షులు పి నారాయణ మాట్లా...

చిన్ననాటి స్నేహితుల్ని మర్చిపోలేను

చిన్ననాటి స్నేహితుల్ని మర్చిపోలేను   -  సినీ దర్శకుడు మారుతి  టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: మచిలీపట్నం జార్జికారనేషన్ హైస్కూల్కు చెందిన మారుతి బాల్య స్నేహితులు అక్టోబర్ 1 వ తేదీ గెటు గెదర్ కార్యక్రమంతో పాటు , స్వయంకృషితో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ సువర్ణాధ్యాయాన్ని లిఖించుకున్న తమ చిన్ననాటి స్నేహితుడు మారుతిని ప్రేమగా సత్కరించుకునే కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు . ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్గా క్షణం తీరిక లేకుండా ఉన్న ఆయన ఈ కార్యక్రమానికి విచ్చేసి దాదాపు 4 గంటల పాటు చిన్ననాటి స్నేహితులను పేరు పేరునా పలకరించి , వారితో గడపడం విశేషం . తన చిన్ననాటి సంఘటనలను , తాను కష్టపడి ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఎదిగిన విధానాన్ని వివరించడంతో పాటు , తన స్నేహితులు ఎవరెవరు ఏఏ రంగాల్లో ఉన్నారు . వారు కూడా జీవితంలో ఎదగటానికి ఎంత కష్టపడ్డారు అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు . అనంతరం ఆయన్ను శాలువాతో సత్కరించి , సన్మానపత్రం కూడా అందజేశారు . " బాల్యం నుంచి ప్రతి దశలోనూ మన జీవితంలో ఎంతోమంది పరిచయం అవుతూ ఉంటారు . కాలక్రమంలో అందులో కొంద...

జగనన్న ఆరోగ్యసురక్షకు విశేష స్పందన

టాలెంట్ ఎక్స్ప్రెస్ న్యూస్ ,చుండూరు: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకుజగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా  దీర్ఘకాలిక వ్యాధులు కలిగినప్రతి ఒక్కరికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు పంపిణీ చేయడం జరుగుతుందని  జడ్పిటిసి సభ్యురాలు దాట్ల సౌజన్య మోహన్ రెడ్డిఅన్నారు మండల పరిధిలోని వలివేరు గ్రామంలో  శుక్రవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది  ఆమెమాట్లాడుతూ826మందికి ఓపి నిర్వహించడం జరిగిందని వారిలో253 మందికి కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ఉచిత పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు అందరికీ  ఉచిత మందులు పంపిణీ చేయడం జరిగింది అన్నారు ఈ కార్యక్రమంలో ఎండిఓ  టి  సుగుణమ్మ  యడ్లపల్లి పి హెచ్ సి  డాక్టర్   ప్రేమ్   చందు పార్టీ నాయకులుగాదే శివరామ కృష్ణారెడ్డి  గ్రామ సర్పంచ్ పందిపాటి ఏసు ఉప సర్పంచ్ విప్పర్ల వెంకటరామిరెడ్డి ఎంపీటీసీ అమర్తులూరి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు

జగనన్న ఆరోగ్యసురక్షకు విశేష స్పందన

  జగనన్న  ఆరోగ్యసురక్షకు విశేష స్పందన టాలెంట్ ఎక్స్ప్రెస్ న్యూస్ ,చుండూరు:జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా  దీర్ఘకాలిక వ్యాధులు కలిగినప్రతి ఒక్కరికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు పంపిణీ చేయడం జరుగుతుందని మండల స్పెషల్ ఆఫీసర్ పి  జన్నమ్మ అన్నారు మండల పరిధిలోని ఆలపాడు గ్రామంలో శనివారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది  ఆమెమాట్లాడుతూ500 మందికి ఓపి నిర్వహించడం జరిగిందని వారిలో200  మందికి కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ఉచిత పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు అందరికీ  ఉచిత మందులు పంపిణీ చేయడం జరిగింది అన్నారు ఈ కార్యక్రమంలో ఎండిఓ  టి  సుగుణమ్మ చుండూరు  పి హెచ్ సి డాక్టర్లు  ఎస్ సింధూరి ఇందిరా ప్రియదర్శిని ఆయుర్వేద డాక్టర్ వివిధ స్పెషల్ డాక్టర్లు పార్టీ నాయకులు  గాదే శివరామ కృష్ణారెడ్డి  తదితరులు పాల్గొన్నారు

విజ్ఞాన్స్‌ వర్సిటీకు కేంబ్రిడ్జి సౌత్‌ ఆసియా బెస్ట్‌ స్టూడెంట్‌ సపోర్ట్‌ సెంటర్‌ అవార్డ్‌

విజ్ఞాన్స్‌ వర్సిటీకు కేంబ్రిడ్జి సౌత్‌ ఆసియా బెస్ట్‌ స్టూడెంట్‌ సపోర్ట్‌ సెంటర్‌ అవార్డ్‌ చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు ఇంగ్లాండ్‌లోని ప్రతిష్టాత్మక కేంబ్రిడ్జి యూనివర్సిటీ ఇంగ్లీష్‌ అసెస్‌మెంట్‌ విభాగం నుంచి సౌత్‌ ఆసియా బెస్ట్‌ స్టూడెంట్‌ సపోర్ట్‌ సెంటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు లభించిందని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల శ్రీలంక దేశంలోని కొలొంబోలో జరిగిన ‘‘ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఫర్‌ సెంటర్‌ లీడర్స్‌ ఆఫ్‌ సౌత్‌ ఆసియా’’ అనే కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ వర్సిటీకు సౌత్‌ ఆసియా బెస్ట్‌ స్టూడెంట్‌ సెంటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డును అందజేసినట్లు వెల్లడించారు. అంతేకాకుండా 2023 సంవత్సరంలో కేంబ్రిడ్జి సౌత్‌ ఆసియా బెస్ట్‌ ప్రాక్టీసెస్‌ అండ్‌ సపోర్ట్‌ ఫర్‌ టీచర్స్‌ అండ్‌ స్టూడెంట్స్‌ అవార్డ్‌ లభించిందని తెలియజేసారు. ఇంగ్లండ్‌లోని ప్రఖ్యాత యూనివర్సిటీ కేంబ్రిడ్జితో  విజ్ఞాన్‌ యూనివర్సిటీకి ఉన్న అవగాహన ఒప్పందం మేరకు కొన్ని సంవత్సరాలుగా విద్యార్థులకు ప్రత్యేక కోర్సులు అమలు చే...

పత్రికా స్వేచ్ఛను కాపాడాలని

పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, దేశ రాజధాని ఢిల్లీలో మీడియాపై దాడి జరగటం హేయమైన చర్యలని ఆంద్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తెనాలి డివిజన్ అధ్యక్షులు మంచికలపూడి రవికుమార్ అన్నారు. ఫెడరేషన్ రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు ఢిల్లీలో న్యూస్ క్లిక్ ఎడిటర్ అరెస్టు, మరికొంతమంది మీడియా ప్రతినిధులపై అమానుష చర్యలను ఖండిస్తూ తెనాలి డివిజన్ ఆధ్వర్యంలో  నిరసన  వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రువారం సబ్ కలెక్టర్ కార్యాలయం పరిపాలన అధికారి బి. వెంకటస్వామి కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షులు రవికుమార్ మాట్లాడుతూ న్యూస్ క్లిక్ ఎడిటర్ ను అమానుషంగా అరెస్టు చేయటం బాధాకరమన్నారు. చట్టపరమైన నిబంధనలు పాటించకుండా మీడియా స్వేచ్చ కు సంకెళ్ళు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు.  ఫెడరేషన్  రాష్ట్ర నాయకులు కనపర్తి రత్నాకర్ మాట్లాడుతూ పత్రిక స్వేచ్ఛలో దేశంయొక్క స్తానం 161 కి పడిపోవడం దేశ పత్రికల దుస్థితిని తెలియజేస్తుందని అన్నారు. నియోజకవర్గ అధ్యక్షుడు అంబటి శ్యామ్ సాగర్ మాట్లాడుతూ ఢిల్లీ లో 30 ప్రాంతాల్లో న్యూస్ పోర్టల్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించడం దారుణమన్నారు. జర్నలిస్టుల ఇళ్ళపై ...

విజ్ఞాన్స్‌ వర్సిటీకు కేంబ్రిడ్జి సౌత్‌ ఆసియా బెస్ట్‌ స్టూడెంట్‌ సపోర్ట్‌ సెంటర్‌ అవార్డ్‌

విజ్ఞాన్స్‌ వర్సిటీకు కేంబ్రిడ్జి సౌత్‌ ఆసియా బెస్ట్‌ స్టూడెంట్‌ సపోర్ట్‌ సెంటర్‌ అవార్డ్‌ చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు ఇంగ్లాండ్‌లోని ప్రతిష్టాత్మక కేంబ్రిడ్జి యూనివర్సిటీ ఇంగ్లీష్‌ అసెస్‌మెంట్‌ విభాగం నుంచి సౌత్‌ ఆసియా బెస్ట్‌ స్టూడెంట్‌ సపోర్ట్‌ సెంటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు లభించిందని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల శ్రీలంక దేశంలోని కొలొంబోలో జరిగిన ‘‘ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఫర్‌ సెంటర్‌ లీడర్స్‌ ఆఫ్‌ సౌత్‌ ఆసియా’’ అనే కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ వర్సిటీకు సౌత్‌ ఆసియా బెస్ట్‌ స్టూడెంట్‌ సెంటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డును అందజేసినట్లు వెల్లడించారు. అంతేకాకుండా 2023 సంవత్సరంలో కేంబ్రిడ్జి సౌత్‌ ఆసియా బెస్ట్‌ ప్రాక్టీసెస్‌ అండ్‌ సపోర్ట్‌ ఫర్‌ టీచర్స్‌ అండ్‌ స్టూడెంట్స్‌ అవార్డ్‌ లభించిందని తెలియజేసారు. ఇంగ్లండ్‌లోని ప్రఖ్యాత యూనివర్సిటీ కేంబ్రిడ్జితో  విజ్ఞాన్‌ యూనివర్సిటీకి ఉన్న అవగాహన ఒప్పందం మేరకు కొన్ని సంవత్సరాలుగా విద్యార్థులకు ప్రత్యేక కోర్సులు అమలు చే...

ఆంధ్రప్రదేశ్ కి జగనేఎందుకు కావాలంటే

ఆంధ్రప్రదేశ్ కి జగనేఎందుకు కా వాలంటే .. టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్, చుండూరు: జగన్మోహన్ రెడ్డి మళ్లీ మళ్లీ సీఎం కావాలి అని మంత్రి నాగార్జున అన్నారు మండల పరిధిలోని వలివేరు గ్రామం కళ్యాణ మండపంలో బుధవారం ఏర్పాటుచేసిన ఆంధ్ర ప్రదేశ కి జగనే ఎందుకు  కవాలంటే అనే కార్యక్రమానికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగు నాగార్జున ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ అభివృద్ధిలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చి ప్రతి ఇంటికి లబ్ధి చేకూరే విధంగా విద్య వైద్య రంగాల్లోనూ ఇంటి స్థలాలు విషయంలోనూ ఇల్లు కట్టించే విషయంలోనూ విద్యార్థులకు వృద్ధులకు వికలాంగులకు వ్యవసాయ రంగంలోనూ రైతులకు లబ్ధి చేకూరే విధంగా ఎక్కడ కూడాను అవినీతి అక్రమాలకు తావు లేకుండా లబ్ధిదారుల ఖాతాలోనే  నేరుగాజమ అయ్యేవిధంగా చేస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు గత ప్రభుత్వాలు ప్రజలకు ఏమిచ్చాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమిస్తుంది అని బేరి చేసుకుని ఓటు వేయాలన్నారు  చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడమే గాక మేనిఫెస్టోను కూడా కనబడకుండా చేశ...

విజ్ఞాన్స్‌లో ముగిసిన ఇంటర్‌ యూనివర్సిటీ గేమ్స్‌ మీట్‌

టాలెంట్ ఎక్స్ ప్రెస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్‌ యూనివర్సిటీ గేమ్స్‌ మీట్‌ మంగళవారం ఘనంగా ముగిసింది. ఇంటర్‌ యూనివర్సిటీ గేమ్స్‌ మీట్‌లో భాగంగా వాలీబాల్, ఖోఖో పోటీలను నిర్వహించారు. ఈ మీట్‌లో కేఎల్‌ యూనివర్సిటీ (గుంటూరు, హైదరాబాద్‌) , విట్‌–ఏపీ, ఎస్‌ఆర్‌ఎమ్‌–ఏపీ, తిరుపతి విద్యానికేతన్, నరసరావుపేట జేఎన్‌టీయూ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, హైదరాబాద్‌లోని మల్లారెడ్డి కాలేజీ, గుంటూరు విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలు తలపడ్డాయి. ఇంటర్‌ యూనివర్సిటీ గేమ్స్‌ మీట్‌ వాలీబాల్‌ పురుషుల విభాగంలో తిరుపతిలోని విద్యానికేతన్‌ విజేతగాను, గుంటూరు విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ రన్నరప్‌గాను, హైదరాబాద్‌లోని మల్లారెడ్డి కాలేజీ మూడో స్థానంలో నిలిచాయి. వాలీబాల్‌ మహిళల విభాగంలో హైదరాబాద్‌ కేఎల్‌ యూనివర్సిటీ విజేతగాను, గుంటూరు విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ రన్నరప్‌గాను, విట్‌–ఏపీ మూడో స్థానంలో నిలిచాయి. ఇంటర్‌ యూనివర్సిటీ గేమ్స్‌ మీట్‌ ఖోఖో మహిళల విభాగంలో గుంటూరు కేఎల్‌ యూనివర్సిటీ విజేతగాను, గుంటూరు విజ్ఞాన...

22న జర్నలిస్టుల దసరా సంబరాలు

* 22న జర్నలిస్టుల దసరా సంబరాలు * *ఇళ్ల స్థలాలు కేటాయించాలని ముఖ్యమంత్రికి నివేధిక* *నవంబర్ 5 న ఫెడరేషన్ అవిర్భావదినోత్సవం*  విశాఖపట్నం, అక్టోబర్ 3 ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ , ఏపి బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ ల సారధ్యంలో ఈనెల 22న జర్నలిస్టుల దరసరా సంబరాలను అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, అర్బన్ అద్యక్షులు పి.నారాయణ్ లు తెలిపారు. మంగళవారం ఇక్కడ  డైమండ్ పార్క్ సమీపంలోని ఒక ప్రయివేటు హోటల్ లో అర్బన్ కార్యవర్గ సమావేశం  నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను సభ్యులు ప్రస్తావించారు. అలాగే భవిష్యత్ కార్యచరణకు సంబంధించి రాష్ర్ట , జాతీయ నాయకత్వాల దృష్టికి పలు అంశాలను తీసుకువెళ్లాలని నిర్ణయించారు. సమావేశం అనంతరం జాతీయ కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, అర్బన్ అధ్యక్షులు పి.నారాయణ్ లు మాట్లాడుతూ ప్రతీ ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా నగరములో దసరా సంబరాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తామన్నారు. 22 ఉదయం నుంచి అల్పాహారంతో ఈ సంబరాలు ప్రారంభమవుతాయని పలు ప్రత్యేక సాంస్కృతి...

మహాత్ముని మార్గం సర్వదా ఆచరణీయం

  మహాత్ముని మార్గం సర్వదా ఆచరణీయం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య విజ్ఞాన్స్‌లో ఘనంగా గాంధీ జయంతి ఉత్సవం మహాత్ముని మార్గం సర్వదా ఆచరణీయమని విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్‌ యూనివర్సిటీలో దేశ జాతిపిత మహాత్మా గాంధీ 154వ జయంతి, స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ ప్రధాని భారతరత్న లాల్‌ బహుదూర్‌ శాస్త్రి జయంతి ఉత్సవాలను  సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుందనే విషయాన్ని ఆనాడే చెప్పిన ఘనుడని తెలియజేసారు.  గాంధీ చూపిన మార్గం వలనే నేడు మనం స్వేచ్ఛా వాయువులను పీల్చుకోగలుగుతున్నామని పేర్కొన్నారు. పూజ్య బాపూజీ కలలు కన్న ఆశయాలను నెరవేర్చవలసిన బాధ్యత మన అందరిపైన ఉందన్నారు. మహనీయుడు మహాత్మాగాంధీ చూపిన మార్గంలో  విద్యార్థులందరూ పయనించాలని పిలుపునిచ్చారు. విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ మహాత్మా గాంధీ మార్గాన్ని అనుసరించి చూపితే... అదే మనం ఆయనకు ఇచ్...