22న జర్నలిస్టుల దసరా సంబరాలు

*22న జర్నలిస్టుల దసరా సంబరాలు*
*ఇళ్ల స్థలాలు కేటాయించాలని ముఖ్యమంత్రికి నివేధిక*
*నవంబర్ 5 న ఫెడరేషన్ అవిర్భావదినోత్సవం* 
విశాఖపట్నం, అక్టోబర్ 3
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ , ఏపి బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ ల సారధ్యంలో ఈనెల 22న జర్నలిస్టుల దరసరా సంబరాలను అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, అర్బన్ అద్యక్షులు పి.నారాయణ్ లు తెలిపారు. మంగళవారం ఇక్కడ  డైమండ్ పార్క్ సమీపంలోని ఒక ప్రయివేటు హోటల్ లో అర్బన్ కార్యవర్గ సమావేశం  నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను సభ్యులు ప్రస్తావించారు. అలాగే భవిష్యత్ కార్యచరణకు సంబంధించి రాష్ర్ట , జాతీయ నాయకత్వాల దృష్టికి పలు అంశాలను తీసుకువెళ్లాలని నిర్ణయించారు. సమావేశం అనంతరం జాతీయ కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, అర్బన్ అధ్యక్షులు పి.నారాయణ్ లు మాట్లాడుతూ ప్రతీ ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా నగరములో దసరా సంబరాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తామన్నారు. 22 ఉదయం నుంచి అల్పాహారంతో ఈ సంబరాలు ప్రారంభమవుతాయని పలు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. మధ్యాహ్నం విందుబోజనంతో పాటు లక్కీడిప్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. కావున జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు ఆయా సంబరాల్లో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు, ఇతర అంశాలకు సంబధించి తమ రాష్ర్ట కార్యవర్గం ముఖ్యమంత్రికి ఇప్పటికే పలు మార్లు నివేదించడం జరిగిందన్నారు. త్వరలోనే మరోసారి కలసి సమస్యలు తెలియ చేస్తా మన్నారు. నవంబర్ 5న ఫెడరేషన్ ఆవిర్భావదినోత్సవము ఘనముగా నిర్వహించాలని నిర్ణయించామన్నారు..జర్నలిస్ట్స్ 
. సభ్యుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. అందుకే తమ రెండు సంఘాలకు గతములో నే ప్రభుత్వ గుర్తింపు లభించదన్నా రు.. ఈ సమావేశంలో డి..రవికుమార్, ఇరోతి ఈశ్వరరావు,జి. శ్రీనివాస్,కే. మురళీకృష్ణ, ఉదయ్,ఎన్. రామకృష్ణ,శివప్రసాద్, రంగధామం మధు,కృష్ణమూర్తి, ప్రకాష్, చింతా ప్రభాకరరావు, శేషు,గొడబ రాంబాబు, నగేష్, కామన్న తదితరులు పాల్గొన్నారు.