అంబేద్కర్ జీవిత చరిత్ర పై జన కథ

అంబేద్కర్ జీవిత చరిత్ర పై జన కథ


తెనాలి, అక్టోబరు 8: బాబాసాహెబ్  డాక్టర్ ‌బి.ఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర ను జన కథ కళారూపాలలో గ్రామ గ్రామానికి తీసుకువెళ్లాలని, తద్వారా అంబేద్కర్ జీవిత విశేషాలు ప్రతి ఒక్కరికి తెలుస్తాయని,డాక్టర్ కనపర్తి అబ్రహం లింకన్ అన్నారు.ఆదివారం అయితా నగర్  శ్రీ పొట్టిశ్రీరాములు కళ్యాణ మంటపం లో మేకతోటి ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో " జన కథ" సభా కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి కనపర్తి బెనహర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అబ్రహం లింకన్ మాట్లాడుతూ భారతదేశ సమ తుల్యమైన సమతభావంతో ముందుకు వెళ్లాలంటే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంద్వారానే సాధ్యమవుతుందన్నారు. ఆయన చేసిన త్యాగనిరతి చాలామందికి తెలియదని, ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన అవశ్యకత ఏర్పడిందన్నారు. సమతావాదులు మానవతావాదులు, అంబేద్కర్ రిస్టులు అందరూ సమిష్టిగా ముందుకు కదలాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో, తెనాలి మున్సిపల్ వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి, దళిత మహాసభ నాయకులు నూకతోటి బాబురావు, డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు, మేకతోటి ప్రభాకర్ రావు, హార్మోనియం శ్రీనివాసరావు, న్యాయవాది పిల్లి విద్యాసాగర్, పల్నాటి శ్రీరాములు,దేవరపల్లి వీరయ్య, కంచర్ల శేషు, పల్నాడు శ్రీరాములు, జాషువా విజ్ఞాన సమితి కన్వీనర్ న్యూటన్, రంగస్థలం కళాకారుడు ఎ.వి.కోటేశ్వరరావు,దాసరి వెంకటేశ్వరరావు, గుమ్మడి ప్రకాష్ రావు, కనపర్తి డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.