తెనాలిలో సామాజిక సాధికార యాత్ర పేరుతో గర్జించిన వైఎస్సార్ సీపీ శ్రేణులు

తెనాలిలో సామాజిక సాధికార యాత్ర పేరుతో గర్జించిన వైఎస్సార్ సీపీ శ్రేణులు
*తొలి రోజు తెనాలిలో ప్రారంభమైన యాత్రకు బ్రహ్మరథం పట్టిన ప్రజలు* 



టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ధీశాలి, దమ్మున్న వ్యక్తి సీఎం జగన్‌ 
- మంత్రి జోగి రమేష్‌, సురేష్‌, నాయకులు
బడుగు, బలహీన వర్గాల గురించి నిత్యం ఆలోచించే ఏకైక నాయకుడు సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అని మంత్రి జోగి రమేష్‌ తెలిపారు. వైఎస్సార్‌సీపీ అంటే పేద వర్గాల పార్టీగా  గుర్తింపు తెచ్చుకుందన్నారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఇవాళ జగనన్న రథాలు దూసుకెళ్తున్నాయి. ఈ బస్సుల్లో బడుగు బలహీన వర్గాలకు చోటు కల్పించి, అనేక పదవులు కల్పించిన ఏకైన నాయకుడు సీఎం జగన్‌ అని మంత్రి జోగి పేర్కొన్నారు. నారా భువనేశ్వరి నిజం గెలవాలి అని కాకుండా చంద్రబాబు గురించి నిజం చెబుతాను అనే యాత్ర చేసి ఎన్టీఆర్‌కు చేసిన మోసం, వెన్నుపోటు గురించి చెప్పాలని మంత్రి జోగి రమేష్‌ డిమాండ్‌ చేశారు. ఎంతమంది యాత్రలు చేసినా, పొత్తులు పెట్టుకున్నా సీఎం జగన్‌కు అండగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు అండగా ఉంటాయని మంత్రి పేర్కొన్నారు. సామాజిక సాధికార యాత్ర బహిరంగ సభలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి, మంత్రులు ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యేలు అన్నాబత్తుని శివకుమార్, ముస్తఫా, కిలారు రోశయ్య, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి,గుంటూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కత్తెర హెనీక్రిస్టినా, పలు కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు పాల్గొన్నారు. అధికారంలో ఉన్న నాలుగున్నరేళ్లు చేసిన పనుల్ని చెబుతూ ప్రజల్లోకి వెళ్లేందుకు ఎంతో ధైర్యం ఉండాలని, జగనన్న సారధ్యంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి ఆ దమ్ముందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. గురువారం సాయంత్రం తెనాలి మార్కెట్ సెంటర్‌లోని అన్నాబత్తుని పురవేదికకు వద్ద అశేష జనవాహిని మధ్య సామాజిక సాధికార యాత్ర బహిరంగ సభలో వైఎస్సార్‌సీపీకి చెందిన అన్ని వర్గాల నేతలు ప్రసంగించారు. నాలుగున్నరేళ్లలో చేసింది చెప్పేందుకు సామాజిక సాధికారయాత్ర చేస్తున్న దమ్మున్న నేత జగన్ మోహన్ రెడ్డి అని మంత్రి జోగి రమేష్‌ తెలిపారు. అన్ని వర్గాల పార్టీ వైఎస్సార్సీపీ అని, మూడు ప్రాంతాల్లో బిసి,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలకు బస్సుయాత్రలో పాల్గొనే అవకాశం కల్పించారన్నారు. 25 మంది మంత్రుల్లో 17 మంది బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలకే ఇచ్చారని, 2లక్షల 31వేల కోట్లు బటన్ నొక్కి పేదలకు పంచిన మనసున్న వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని ఆయన కొనియాడారు. అమ్మా భువనేశ్వరమ్మా...నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు బొక్కలోకి వెళ్లాడమ్మా. మీనాన్నకు వెన్నుపోటు పొడిచింది నీకే కదమ్మా తెలుసు. బస్సుయాత్రలోనైనా నిజం చెప్పమ్మా!. అంటూ నారా భువనేశ్వరికి కౌంటర్‌ ఇచ్చారు. రాజకీయాల్లో కామెడీ ఆర్టిస్టులు, చంద్రబాబు,దత్తపుత్రుడు, ఉత్తపుత్రుడు కలిసి వచ్చినా జగనన్నను ఏం చేయలేరన్నారు. వచ్చే ఎన్నికల్లో 175 కి 175 గెలవబోతున్నాం రాసిపెట్టుకోండని ధీమా వ్యక్తం చేశారు. తెనాలిలో అన్నాబత్తుని శివకుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని అక్కడి ప్రజల్ని కోరారు. 

ఓటు బ్యాంకుగా బలహీన వర్గాలను చూసేవారు
 - మంత్రి సురేష్‌*

గతంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే పరిగణించేవారు. జన్మభూమి కమిటీల పేరుతో పెత్తందారులు ఏవిధంగా వారి అహంకారాన్ని ప్రదర్శించేవారో ప్రత్యక్షంగా చూశారు. కానీ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం, సాధికారత కల్పించారని మంత్రి ఆదిమూలకు సురేష్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో 70 శాతం ఉన్న బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ప్రగతి కోసం ఆలోచన చేసే సీఎం జగన్‌కు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని మంత్రి సురేష్‌ తెలిపారు. ఇవాళ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్‌ ఛైర్మన్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీపీలు ఇలా అనేక పదవులు ఆయా వర్గాల తామాషా ప్రకారం పంచి ఇచ్చిన నాయకుడు సీఎం జగన్‌ అని ఆయన కొనియాడారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. ప్రభుత్వ బడులు మారిన తీరు, గ్రామాల్లో జరిగిన అభివృద్ది పనులు చూస్తే సీఎం జగన్‌ పరిపాలన ఎవరికైనా అర్థం అవుతుందన్నారు. 

పేదలంతా జగన్‌ వెంట ఉన్నారు. - 
 కొలుసు పార్థసారధి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే

75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ప్రతీ పార్టీలు ఎన్నికల్లో తీపికబుర్లు చెప్పడం తర్వాత మోసం చేయడం చూశాం. గతంలో బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలకు ఎంతో అన్యాయం జరిగింది. టీడీపీ సమయంలో జన్మభూమి కమిటీలను తృప్తి పరిస్తేనే పథకాలు అందేవి. ఎవరైనా చనిపోతేనే పెన్షన్ ఇచ్చేవారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అర్హత ఉంటే చాలు. చంద్రబాబు వందల ఎకరాలను వారికి కావాల్సిన వారికి కట్టబెట్టేవారు. ఆశ్రమాలు కట్టుకునే వారికి కేటాయించేవారు. పట్టుమని పేదలకు పది ఎకరాలు కొని ఇచ్చిన చరిత్ర చంద్రబాబుకు లేదు. కానీ బీసీలకు పెద్దపీట వేసిన ఒకే ఒక్క ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం. సమాజంలో ఉన్న అన్ని వనరులను సమానంగా పంచడమే సామాజిక సాధికారిత. 32 లక్షల మందికి సొంతింటి కల నెరవేర్చిన మగాడు జగన్ మోహన్ రెడ్డి. కరోనా టైంలో వాలంటీర్ల ద్వారా ప్రతీ ఒక్కరికీ పథకాలను అందించిన గొప్ప నాయకుడు జగన్. రాయపాటి సాంబశివరావుకో...కోట్లు ఖర్చు చేసిన వారికో చంద్రబాబు రాజ్యసభ టిక్కెట్లు ఇచ్చేవారు. కానీ బీసీలను రాజ్యసభకు పంపించిన ఘనత జగన్ మోహన్ రెడ్డికే దక్కింది. జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో పేదలయాత్ర జరుగుతోంది. ఈయాత్ర ద్వారా రాష్ట్రంలోని పేదలంతా ఏకమవుతున్నారు. జగన్ మోహన్ రెడ్డిని మనమంతా మళ్లీ గెలిపించుకోవాలని ఎమ్మెల్యే కొలుసు పార్థ సారధి అన్నారు. 

తెనాలిలో సామాజిక సాధికారత సాధించాం
 - ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌

తెనాలి నియోజకవర్గంలో 26 వేల మందికి ఇళ్ల స్థలాలు, దాదాపు పది కోట్ల రూపాయలు పింఛన్లు ఇస్తున్నందుకు గర్వంగా ఉందని తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రతి సంక్షేమ పథకంలో మంచి చేకూర్చామన్నారు. ఆయా వర్గాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చామన్నారు. ఇదంతా సామాజిక న్యాయమేనన్నారు. ఉన్నత వర్గాలకు కూడా ఈ నియోజకవర్గంలో ఎలాంటి అన్యాయం జరగలేదన్నారు. కేవలం పేదరికం మాత్రమే ప్రామాణికంగా తీసుకున్నారు. 

మహిళా సాధికారతకు కృషి చేసిన సీఎం జగన్‌
 - బుట్టా రేణుక, మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ సునీత 
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు గుర్తింపు రావాలని ఏ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. కానీ వైఎస్సార్‌సీపీ మాత్రం బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చిందని మాజీ ఎంపీ బుట్టా రేణుక తెలిపారు. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం, పదవులు, రాజ్యాధికారం ఇవ్వడం కేవలం సీఎం జగన్‌కు మాత్రమే సాధ్యమైంది. మహిళలకు కూడా గౌరవం ఇచ్చి, సంక్షేమ పథకాల రూపంలో వారి సాధికారతకు కృషి చేసిన సీఎం జగన్‌ అని బుట్టా రేణుక అన్నారు. మహిళలకు న్యాయం చేసిన నాయకుడు సీఎం జగన్‌ అని ఎమ్మెల్సీ పోతుల సునీత తెలిపారు. 
దళిత వర్గాలకు అండగా ఉండి వారికి సుపరిపాలన అందించిన నాయకులు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు డొక్కా మాణిక్యవరప్రసాద్‌ తెలిపారు. పేదలకు డీబీటీ ద్వారా సంక్షేమ పథకాలు అందిస్తూ, ఇచ్చిన హామీలను 99 శాతం నెరవేర్చి ప్రజలకు ఇంకా ఏమైనా కావాలా అని అడుగుతున్న నాయకుడు జగన్‌ అని కొనియాడారు.