విజ్ఞాన్స్‌లో ముగిసిన ఇంటర్‌ యూనివర్సిటీ గేమ్స్‌ మీట్‌



టాలెంట్ ఎక్స్ ప్రెస్:
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్‌ యూనివర్సిటీ గేమ్స్‌ మీట్‌ మంగళవారం ఘనంగా ముగిసింది. ఇంటర్‌ యూనివర్సిటీ గేమ్స్‌ మీట్‌లో భాగంగా వాలీబాల్, ఖోఖో పోటీలను నిర్వహించారు. ఈ మీట్‌లో కేఎల్‌ యూనివర్సిటీ (గుంటూరు, హైదరాబాద్‌) , విట్‌–ఏపీ, ఎస్‌ఆర్‌ఎమ్‌–ఏపీ, తిరుపతి విద్యానికేతన్, నరసరావుపేట జేఎన్‌టీయూ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, హైదరాబాద్‌లోని మల్లారెడ్డి కాలేజీ, గుంటూరు విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలు తలపడ్డాయి. ఇంటర్‌ యూనివర్సిటీ గేమ్స్‌ మీట్‌ వాలీబాల్‌ పురుషుల విభాగంలో తిరుపతిలోని విద్యానికేతన్‌ విజేతగాను, గుంటూరు విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ రన్నరప్‌గాను, హైదరాబాద్‌లోని మల్లారెడ్డి కాలేజీ మూడో స్థానంలో నిలిచాయి. వాలీబాల్‌ మహిళల విభాగంలో హైదరాబాద్‌ కేఎల్‌ యూనివర్సిటీ విజేతగాను, గుంటూరు విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ రన్నరప్‌గాను, విట్‌–ఏపీ మూడో స్థానంలో నిలిచాయి. ఇంటర్‌ యూనివర్సిటీ గేమ్స్‌ మీట్‌ ఖోఖో మహిళల విభాగంలో గుంటూరు కేఎల్‌ యూనివర్సిటీ విజేతగాను, గుంటూరు విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ రన్నరప్‌గాను, నరసరావుపేట జేఎన్‌టీయూ మూడో స్థానంలోను నిలిచాయి. గేమ్స్‌ మీట్‌ ఖోఖో పురుషుల విభాగంలో గుంటూరు విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజేతగాను, గుంటూరు కేఎల్‌ యూనివర్సిటీ రన్నరప్‌గాను, నరసరావుపేట జేఎన్‌టీయూ మూడో స్థానంలోను నిలిచాయి. విజేతలుగా నిలిచిన జట్లకు ట్రోఫీలతో పాటు నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేసారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మాట్లాడుతూ విద్యార్థులందరూ ఆటల్లో పాల్గొనాలనే ఉద్దేశంతో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో మూడు సెమిస్టర్‌లలో స్పోర్ట్స్‌కు సంబంధించిన అంశాలకు మార్కులు కూడా కేటాయించామన్నారు.  కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ డైరక్టర్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.