జగనన్న ఆరోగ్యసురక్షకు విశేష స్పందన

 

జగనన్న  ఆరోగ్యసురక్షకు విశేష స్పందన

టాలెంట్ ఎక్స్ప్రెస్ న్యూస్ ,చుండూరు:జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా  దీర్ఘకాలిక వ్యాధులు కలిగినప్రతి ఒక్కరికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు పంపిణీ చేయడం జరుగుతుందని మండల స్పెషల్ ఆఫీసర్ పి  జన్నమ్మ అన్నారు మండల పరిధిలోని ఆలపాడు గ్రామంలో శనివారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది  ఆమెమాట్లాడుతూ500 మందికి ఓపి నిర్వహించడం జరిగిందని వారిలో200  మందికి కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ఉచిత పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు అందరికీ  ఉచిత మందులు పంపిణీ చేయడం జరిగింది అన్నారు ఈ కార్యక్రమంలో ఎండిఓ  టి  సుగుణమ్మ చుండూరు  పి హెచ్ సి డాక్టర్లు  ఎస్ సింధూరి ఇందిరా ప్రియదర్శిని ఆయుర్వేద డాక్టర్ వివిధ స్పెషల్ డాక్టర్లు పార్టీ నాయకులు  గాదే శివరామ కృష్ణారెడ్డి  తదితరులు పాల్గొన్నారు