జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా ఫెడరేషన్

జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా ఫెడరేషన్ జర్నలిస్టులకు ప్రమాద బీమా కార్డులు. అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు. నర్సీపట్నం ప్రెస్ క్లబ్ కు నూతన కార్యవర్గం. నర్సీపట్నం.. అక్టోబర్ 8
జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ పనిచేస్తుందని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు అన్నారు. ఆదివారం ఇక్కడ అర్ డి వో కార్యాలయ సమీప ప్రాంగణము లో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టు అసోసియేషన్ లు ఆధ్వర్యంలో ఫెడరేషన్ నర్సీపట్నం ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనుబాబు మాట్లాడుతూ. జర్నలిస్టులకు ఒకొక్కరికి 5 లక్షలు విలువ చేసే ప్రమాద బీమా కార్డులు అందజేయడం. అభినందనీయమన్నారు. దీనివల్ల జర్నలిస్టుల కుటుంబాలకు కొంతవరకు భరోసా కలుగుతుందన్నారు. యూనియన్లకు అతీతంగా ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించుకోవాలని శ్రీను బాబు సూచించారు. జర్నలిస్టులు దసరా సంబరాలు , ఫెడరేషన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. విశాఖ అర్బన్ అధ్యక్షులు పి నారాయణ మాట్లాడుతూ. సభ్యుల సంక్షేమానికి నర్సీపట్నం ప్రెస్ క్లబ్ చేస్తున్న సేవలను కొనియాడారు. రాష్ట్రంలోనే అతి పెద్ద యూనియన్ గా ఫెడరేషన్ ఆవిర్భవించిందని అన్నారు. అనకాపల్లి జిల్లాలో అత్యధిక శాతం సభ్యులు ఉండడం, నిరంతరం సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం ఇతర యూనియన్లకు ఆదర్శనీయమన్నారు. అనకాపల్లి జిల్లా అధ్యక్షులు బి. వెంకటేష్, ప్రధాన కార్యదర్శి బి ఈశ్వరరావు లు సభ్యుల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమ వివరాలను తెలియజేశారు. అనంతరం జర్నలిస్టులకు ప్రమాద బీమా పాలసీ కార్డులు అందజేశారు. వీటితోపాటు. వాహనాలకు సంబందించిన స్టీక్కర్లు అంద చేసారు. అలాగే సీనియర్ జర్నలిస్టులను సన్మానించారు. ఈ కార్యక్రమం లో జాతీయ కార్యవర్గ సభ్యులు జి శ్రీనివాస్, ఏపీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ వైజాగ్ అధ్యక్షులు ఇరోతి ఈశ్వరరావు, యూనియన్ నాయకులు రమేష్, బాషా, పైలా రామారావు, నటరాజ్, కె. గణేష్ తదితరులు పాల్గొన్నారు. నర్సీపట్నం ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం అధ్యక్షులుగా బి.ప్రసాద్ (నర్సీపట్నం ), ప్రధాన కార్యదర్శిగా ఎమ్.రాజు (కోటవురట్ల, ఆంధ్రజ్యోతి), ఉపాధ్యక్షులుగా ఎమ్.శ్రీరాముర్తి (ప్రజాశక్తి ), ఆర్.శివ (మనం), కోశాధికారిగా జి.సత్య నారాయణ (విశాఖ టుడే), కార్యవర్గ సభ్యులు గా టీ.మాణిక్యం, పి.సత్య నారాయణ, ఆర్.ఈశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.