విజ్ఞాన్స్‌ వర్సిటీకు కేంబ్రిడ్జి సౌత్‌ ఆసియా బెస్ట్‌ స్టూడెంట్‌ సపోర్ట్‌ సెంటర్‌ అవార్డ్‌

విజ్ఞాన్స్‌ వర్సిటీకు కేంబ్రిడ్జి సౌత్‌ ఆసియా బెస్ట్‌ స్టూడెంట్‌ సపోర్ట్‌ సెంటర్‌ అవార్డ్‌


చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు ఇంగ్లాండ్‌లోని ప్రతిష్టాత్మక కేంబ్రిడ్జి యూనివర్సిటీ ఇంగ్లీష్‌ అసెస్‌మెంట్‌ విభాగం నుంచి సౌత్‌ ఆసియా బెస్ట్‌ స్టూడెంట్‌ సపోర్ట్‌ సెంటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు లభించిందని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల శ్రీలంక దేశంలోని కొలొంబోలో జరిగిన ‘‘ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఫర్‌ సెంటర్‌ లీడర్స్‌ ఆఫ్‌ సౌత్‌ ఆసియా’’ అనే కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ వర్సిటీకు సౌత్‌ ఆసియా బెస్ట్‌ స్టూడెంట్‌ సెంటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డును అందజేసినట్లు వెల్లడించారు. అంతేకాకుండా 2023 సంవత్సరంలో కేంబ్రిడ్జి సౌత్‌ ఆసియా బెస్ట్‌ ప్రాక్టీసెస్‌ అండ్‌ సపోర్ట్‌ ఫర్‌ టీచర్స్‌ అండ్‌ స్టూడెంట్స్‌ అవార్డ్‌ లభించిందని తెలియజేసారు. ఇంగ్లండ్‌లోని ప్రఖ్యాత యూనివర్సిటీ కేంబ్రిడ్జితో  విజ్ఞాన్‌ యూనివర్సిటీకి ఉన్న అవగాహన ఒప్పందం మేరకు కొన్ని సంవత్సరాలుగా విద్యార్థులకు ప్రత్యేక కోర్సులు అమలు చేస్తున్నామని తెలిపారు. మల్టిఫుల్‌ టీచర్‌ సపోర్ట్‌ వర్క్‌షాప్స్, ఇంగ్లీష్‌ అధ్యాపకులకు ప్రత్యేకమైన సెల్టా ట్రైనింగ్,  పెట్‌(ప్రిలిమినరి ఇంగ్లీష్‌ టెస్ట్‌), బెక్‌( బిజినెస్‌ ఇంగ్లీష్‌ సర్టిఫికెట్‌) సర్టిఫికెషన్‌ కోర్సుల ద్వారా విద్యార్థులు అంతర్జాతీయ స్థాయి ఆంగ్లభాషా ప్రావీణ్యాన్ని సంపాదిస్తున్నారని చెప్పారు. కొన్నేళ్లుగా కేంబ్రడ్జి యూనివర్సిటీ నిర్వహిస్తున్న సర్టిఫికేషన్‌ కోర్సులకు తమ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారుని, దాదాపు వంద శాతం మంది ఉత్తీర్ణులవుతున్నారని వెల్లడించారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీ విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న ప్రత్యేక కోర్సుల ఫలితంగా ఇక్కడ విద్యార్థులు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆంగ్ల భాషను నేర్చుకో గలుగుతున్నారు. అంతేకాకుండా వారికి  ఉద్యోగ అవకాశాలు కూడా పుష్కలంగా అందిస్తున్నట్లు తెలిపారు. ఈ అంశాలన్నింటిని పరిగణలోనికి తీసుకుని కేంబ్రిడ్జి యూనివర్సిటీ ఇంగ్లీష్‌ అసెస్‌మెంట్‌ విభాగం నుంచి సౌత్‌ ఆసియా బెస్ట్‌ సపోర్ట్‌ సెంటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డుతో పాటు ఆథరైజ్డ్‌ సెంటర్‌గా నిలిచిందన్నారు.