ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీకి ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులు

ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీకి ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులు
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
ఇండస్ట్రియల్ స్కిల్స్లో వర్చువల్ ఇంట స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజికి జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక అవార్డులు వరించాయి . ఏఐ సీటీఈ , ఎడ్యు స్కిల్స్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వ ర్యంలో ఈ నెల 17 , 18 , 19 తేదీల్లో గోవాలో నిర్వ హించిన స్కిల్ కనెక్ట్ యాన్యువల్ మీట్లో కాలేజి ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామచంద్ ఈ అవార్డు లను స్వీకరించారు . గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ , ఏఐసీటీఈ చైర్మన్ ప్రొఫెసర్ టీజీ సీతా రాం , ఎన్బీఏ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ కె.కె.అ గర్వాల్ ప్రారంభించిన ఈ సమావేశంలో దేశ వ్యాప్తంగా గల ప్రముఖ యూనివర్శిటీలు , ఇంజినీ రింగ్ కాలేజిలు , డిగ్రీ , పాలిటెక్నిక్ కాలేజిల ప్రతి నిధులు పాల్గొన్నారు . గూగుల్ , ఫోర్టినెట్ , పాలో ఆల్టో , ఎరిక్సన్ , టెక్ మహేంద్ర వంటి కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు . సైబర్ సెక్యూరిటీ , గూగుల్ డెవలపర్ , ఏఐ అండ్ ఎంఎల్ , ఆర్పీఏ , నెట్వర్క్ సెక్యూరిటీ వంటి ఇండస్ట్రీ స్కిల్స్ విభా గాల్లో ఆగస్టు 2021 నుంచి ఆగస్టు 2023 వరకు వర్చువల్ ఇంటర్న్షిప్ పూర్తిచేసిన వివిధ యూనివర్శిటీలు , కాలేజీకు అవార్డులు ప్రకటిం చారు . అన్ని ఇనిస్టిట్యూషన్స్ కేటగిరీలో దేశంలో
34 వ ర్యాంక్ , డిగ్రీ కాలేజిల్లో దేశంలోనే ఫస్ట్ ర్యాంక్ , సౌతిండియాలో బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ డిగ్రీ కాలేజి , పాలో ఆల్టో సైబర్ సర్టిఫికేషన్లో బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ డిగ్రీ కాలేజి వంటి ప్రతిష్టాత్మక అవా ర్డులను ఏఎస్ఎన్ కాలేజి సొంతం చేసుకున్నట్టు విద్యా సంస్థల చైర్మన్ , స్థానిక ఎమ్మెల్యే అన్నా బత్తుని శివకుమార్ మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు . ఇవికాకుండా ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్లోనూ కాలేజి నమో దైందని చెప్పారు . కాలేజి ప్రిన్సిపల్ డాక్టర్ రామ్ చంద్ను సత్కరించారు .