విజ్ఞాన్స్‌ అధ్యాపకుడికి పీహెచ్‌డీ

విజ్ఞాన్స్‌ అధ్యాపకుడికి పీహెచ్‌డీ
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ అప్లైడ్‌ సైన్స్‌ అండ్‌ హ్యుమానిటీస్‌ విభాగంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కెమిస్ట్రీ విభాగానికి చెందిన  కర్రి మరియదాసు అనే అధ్యాపకుడికి విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగంలో పీహెచ్‌డీ పట్టా అందజేసిందని యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పల్నాడు జిల్లాలోని భూగర్భ జలాల అంచనా – ప్రభావాలు, తాగునీరు, నీటిపారుదల నాణ్యత’’ అనే అంశంపై ఆయన పరిశోధన చేశారని తెలియజేసారు. ఈయనకు ఆంధ్ర యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కెమిస్ట్రీ విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ టీ.శివరావు గైడ్‌గా వ్యవహరించారని వెల్లడించారు. పీహెచ్‌డీ పట్టా పొందిన కర్రి మరియదాసును విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపకులు అభినందించారు.