ఉద్యోగాలు, పరిశోధనలకు పెద్దపీట

ఉద్యోగాలు, పరిశోధనలకు పెద్దపీట

  విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌
 విశ్వవిద్యాలయంలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
అన్ని విజ్ఞాన్‌ కార్యాలయాలు, యూనివర్సిటీ వెబ్‌సైట్‌ నందు అందుబాటులో దరఖాస్తులు 
 మార్చి 1 నుంచి నుంచి ఏప్రిల్‌ 30  వరకు బీటెక్‌/బీఫార్మసీ ప్రవేశ పరీక్ష
వీశాట్‌–2024 దరఖాస్తుకు చివరి తేది ఫిబ్రవరి 25
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు  ప్రతిభావంతులకు స్కాలర్‌షిప్‌లు
 వీశాట్‌–2024 ప్రధాన అంశాలు ఇవే

యువతకు అత్యున్నత ఉద్యోగాలు కల్పించడం, వారిని గొప్ప పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా చేయడం, పరిశోధనలకు పెద్ద పీట వేయడంలాంటి సమున్నత లక్ష్యాలతో తాము ముందుకెళుతున్నామని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు.   విజ్ఞాన్‌ యూనివర్సిటీ 2024–25 సంవత్సరానికి సంబంధించి బీటెక్, బీఫార్మసీ, బీబీఏ, బీసీఏ, బీఎస్సీ, బీఏ ఎల్‌ఎల్‌బీ, బీబీఏ ఎల్‌ఎల్‌బీ, బీఎస్సీ (హానర్స్‌) అగ్రికల్చర్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, ఎంఏ ఇంగ్లీష్, పీహెచ్‌డీ అడ్మిషన్ల (వీశాట్‌ – 2024) నోటిఫికేషన్‌ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మాట్లాడుతూ తాము బీటెక్‌లో అగ్రికల్చర్, బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్, బయోమెడికల్, కెమికల్, సివిల్, సీఎస్‌ఈతో పాటు ఆర్టిఫిసియల్‌ ఇంటెలిజెన్స్, మెషిన్‌ లెర్నింగ్, సైబర్‌ సెక్యూరిటీ, బిజినెస్‌ సిస్టమ్స్, డేటాసైన్స్, ఐవోటీ, ఈసీఈ, ఈసీఈ–వీఎల్‌ఎస్‌ఐ, ఈఈఈ, ఫుడ్‌ టెక్నాలజీ, ఐటీ, మెకానికల్, టెక్స్‌టైల్‌ టెక్నాలజీ, బీఎస్సీ అగ్రికల్చర్, బీఏ (ఎల్‌ఎల్‌బీ), బీబీఏ (ఎల్‌ఎల్‌బీ), బీఎస్సీ (హానర్స్‌) అగ్రికల్చర్, బీఫార్మసీ కోర్సులను అందజేస్తున్నామని చెప్పారు. బీటెక్, బీఫార్మసీ కోర్సులలో ప్రవేశాలకు తాము దేశవ్యాప్తంగా చేపట్టనున్న వీశాట్‌ ప్రవేశ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా స్కాలర్‌షిప్‌లు పొందే అవకాశం కలదన్నారు. 

మార్చి 1 నుంచి నుంచి ఏప్రిల్‌ 30 వరకు ప్రవేశ పరీక్ష
విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ డీన్‌ అడ్మిషన్స్‌ డాక్టర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌ మాట్లాడుతూ వీశాట్‌ దరఖాస్తులు గుంటూరు, విజయవాడ, హైదరాబాదు, విశాఖపట్టణం, ఏలూరు, రాజమండ్రిలలోని  అన్ని విజ్ఞాన్‌ సంస్థలు, కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయని చెప్పారు. విద్యార్థులు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ www.vignan.ac.in ద్వారా ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.   మార్చి 1 నుంచి  ఏప్రిల్‌ 30 తేదీ వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాలోనూ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు. వీశాట్‌–2024 దరఖాస్తును ఫిబ్రవరి 25 తారీఖులోగా పూర్తిచేయాలన్నారు. వీశాట్‌లో తొలి 50లోపు ర్యాంకులు సాధించిన వారికి 50శాతం, 51–200లోపు ర్యాంకుల వారికి 25 శాతం, 201–2000లోపు ర్యాంకులు సాధించినవారికి 10 శాతం ఫీజు స్కాలర్‌షిప్‌ అందజేస్తున్నట్లు చెప్పారు. ఇంటర్‌ మార్కులు, జేఈఈ, మెయిన్స్, ఎంసెట్‌ ర్యాంకుల ఆధారంగానూ ఫీజు స్కాలర్‌షిప్‌కు అవకాశం కలదు. ప్రతిభావంతులైన బీఫార్మసీ, బీబీఏ, బీసీఏ,బీఏ ఎల్‌ఎల్‌బీ, బీబీఏ ఎల్‌ఎల్‌బీ, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు చదివే విద్యార్థులు సైతం ఫీజుల్లో స్కాలర్‌షిప్‌ పొందొచ్చని చెప్పారు. అన్ని విభాగాల్లో 25 శాతం సీట్లను స్కాలర్‌షిప్‌ కింద కేటాయించామన్నారు. వీటిని పూర్తిగా ప్రతిభ ఆధారంగా భర్తీ చేస్తామని తెలిపారు. వీశాట్‌ పరీక్ష రాసిన వారికి బీటెక్‌ సీట్ల కేటాయింపులో తొలి ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు.

పరిశ్రమలకు అనుగుణమైన సిలబస్‌
తమ యూనివర్సిటీ ఎప్పటికప్పుడు పాఠ్యాంశాలను మారుస్తూ.. పరిశ్రమ అవసరాలకు తగిన విధంగా సిలబస్‌ను కూర్చుతోందని వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ తెలిపారు. పాఠ్యాంశాలనన్నింటినీ ప్రయోగశాలలకు మరియు ప్రాజెక్టులకు అనుసంధానించడం, పరిశ్రమలకు తీసుకెళ్లి అవగాహన కల్పిస్తుండటం వల్ల విద్యార్థులకు బోధనను ఎంతో ఆసక్తిగా మార్చగలిగామని వెల్లడించారు. గత ఏడాది నుంచి ఆధునిక సాంకేతికాంశాలైన క్లౌడ్‌ కంప్యూటింగ్, ఇంటర్నెట్‌ ఆప్‌ థింగ్స్, స్క్రిప్ట్‌ంగ్‌ లాంగ్వేజ్, ఆర్టిఫిషియల్‌ నాలెడ్జి, రాపిడ్‌ ప్రొటోటైపింగ్, నానో టెక్నాలజీ, ఇమ్యునాలజీ, ఇమ్యునో ఇన్ఫర్మాటిక్స్‌ కోర్సులను బీటెక్‌తోపాటే విద్యార్థులకు అందిస్తున్నామని తెలిపారు. దీనివల్ల విద్యార్థులు అత్యున్నత ఉద్యోగాలను అందిపుచ్చుకోగలరని తెలిపారు.

ఉద్యోగాలు సాధించేందుకు సీఆర్టీ
బీటెక్‌ కోర్సుతోపాటు 200 గంటలపాటు ప్రత్యేకంగా క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ ట్రైనింగ్‌ (సీఆర్టీ) తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు. దీనివల్ల ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఎనలైటికల్‌ స్కిల్స్‌ పెరుగుతాయని తెలిపారు. అంతేకాకుండా అంతిమంగా విద్యార్థి ఉద్యోగ అవకాశాలను మరింతగా పెంచుకోగలడని పేర్కొన్నారు. తమ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు అమెజాన్, లాయిస్, సిస్కో, లాటెంట్‌ వ్యూ అనలిటిక్స్, ఈపామ్‌ వంటి ప్రముఖ బహుళజాతి కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. వీరందరూ ప్రఖ్యాత సంస్థలైన టీసీఎస్, ఐబీఎం, విప్రో, హెసీఎల్, సీటీఎస్, ఇన్ఫోసిస్, ఐటీసీ వంటి తదితర 65 సంస్థల్లో ఉద్యోగాలు సాధించారన్నారు. భవిష్యత్తులో మరిన్ని సంస్థలు వర్సిటీలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయన్నారు. 90 శాతం మంది విద్యార్థులు ఉద్యోగాల్లోను, 10 శాతం మంది విద్యార్థులు ఉన్నత చదువులకు విదేశాలకు వెళుతున్నారని వెల్లడించారు.

సివిల్స్‌ కోచింగ్‌ కూడా అందిస్తున్నాం:  ఇంచార్జి రిజిస్ట్రార్‌ డాక్టర్‌ పీఎంవీ రావు
విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ ఇంచార్జి రిజిస్ట్రార్‌ డాక్టర్‌ పీఎంవీ రావు మాట్లాడుతూ తమ యూనివర్సిటీ బీటెక్‌ కోర్సుతోపాటుగా ఆసక్తి ఉన్న విద్యార్థులకు సమాంతరంగా సివిల్స్‌ కోచింగ్‌ కూడా ఇస్తోందని తెలిపారు. బ్యాంకింగ్, ఫైనాన్స్‌ రంగాలతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన కోచింగ్‌ను కూడా తమ యూనివర్సిటీ ఇస్తున్నదని చెప్పారు. 

ఇన్నోవేటర్స్, ఇంక్యుబేషన్‌ సెంటర్లు
విద్యార్థులకు వచ్చే అద్భుత ఆలోచనలు కార్యరూపం దాల్చేందుకు వీలుగా విజ్ఞాన్‌లో ఇన్నోవేటర్స్‌ క్లబ్‌ ఉందని, ఇది ఇప్పటికే మంచి ఫలితాలు సాధిస్తోందని తెలిపారు. వర్సిటీలోని ఇంక్యుబేషన్‌ సెంటర్‌ ద్వారా విద్యార్థులను భావి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే ప్రక్రియ కొనసాగుతున్నట్లు చెప్పారు. దీనివల్ల విద్యార్థులు పారిశ్రామికవేత్తలుగా రూపుదిద్దుకునేందుకు కావాల్సిన నైపుణ్యాన్ని ఒడిసిపడుతున్నారని వివరించారు. ఈ వ్యాపార నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల వల్ల చాలా మంది విద్యార్థులు ప్రయోజనం పొందారని లె లిపారు. ప్రధాని ఇచ్చిన మేక్‌ ఇన్‌ ఇండియా నినాదంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రనైపుణ్యాభివృద్ధి సంస్థ రూ.4 కోట్లతో విజ్ఞాన్‌లో రూపుదిద్దుకున్నదని తెలిపారు. ఇది విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతోందని చెప్పారు. 

పలు సంస్థలతో ఒప్పందం
విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విద్యార్థులు, సిబ్బందిలో పరిశ్రమలకు అనుగుణంగా నైపుణ్యాలు పెరిగేందుకు 12 దేశాలకు చెందిన యూనివర్సిటీలతో తాము అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పారు. ఆంగ్లభాషా నైపుణ్యానికి సంబంధించిన పెట్, బెక్‌ పరీక్షలలో తమ యూనివర్సిటీకి చెందిన 90 శాతం మంది విద్యార్థులు అత్యద్భుత ప్రదర్శన కనబరుస్తుండటంతో లండన్‌లోని కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ ఎంతో అరుదైన సెలా పురస్కారాన్ని తమకు అందజేసిందని వివరించారు. యూనివర్సిటీ చేపట్టిన పలుపరిశోధనా ప్రాజెక్టుల కోసం కేంద్రప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగం అందజేసిన రూ.20 కోట్ల నిధులతో పరిశోధనలు జరుగుచున్నవని చెప్పారు. గడిచిన 5 సంవత్సరాలలో తమ ఫ్యాకల్టీ 3000కు పైగా రీసెర్చ్‌ పేపర్లు పబ్లిష్‌ చేశారని వెల్లడించారు.

రూ.4 కోట్లకు పైగా విలువైన ఫీజు రాయితీ
ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడంలో తమ యూనివర్సిటీ ఎప్పుడూ ముందుంటుందని డైరక్టర్‌ అడ్మిషన్స్‌ ఏ. గౌరిశంకర్‌ రావు తెలిపారు. గతేడాది ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులకు మొత్తం అన్ని కోర్సుల్లో రూ.20 కోట్లకు పైగా స్కాలర్‌షిప్స్‌ ఇచ్చామన్నారు. వీటితోపాటు సామాజిక బాధ్యతగా భావించి తమ యూనివర్సిటీలో అడ్మిషన్లు పొందే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులందరికీ గత ఏడాది నుంచి 25 శాతం పీజు రాయితీ ఇస్తున్నట్లు వెల్లడించారు.

కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, ఇంచార్జి రిజిస్ట్రార్‌ డాక్టర్‌ పీఎంవీ రావు, డీన్‌ అడ్మిషన్స్‌ డాక్టర్‌ కేవీ క్రిష్ణకిషోర్, డైరక్టర్‌ అడ్మిషన్స్‌‡ ఏ. గౌరిశంకర్‌ రావు పాల్గొన్నారు.