సంగం డెయిరి నూతన ఉత్పత్తుల ఆవిష్కరణ

సంగం డెయిరి నూతన ఉత్పత్తుల ఆవిష్కరణ 
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
 పదమూడు రకాల నూతన  బేకరీ ఉత్పత్తులు, స్వీట్స్ ను మార్కెట్లోకి విడుదల చేసిన సంగం డెయిరి చైర్మన్ ధూలిపాళ్ళ నరేంద్ర కుమార్ మరియు పాలకవర్గ సభ్యులు. ఆట లడ్డు 200 గ్రామ్స్ , బేసిన్ లడ్డు 200 గ్రామ్స్ , చేనా లడ్డు 200 గ్రామ్స్, ప్లెయిన్ కాజు బైట్స్, ఆరంజ్ కాజు బైట్స్ , చాక్లెట్ కాజు బైట్స్200 గ్రామ్స్, బాదం రాకీ 200 గ్రామ్స్ , పైనాపిల్ బార్ కేక్ 32 గ్రామ్స్ , కాజు స్టిక్స్120&200 గ్రామ్స్ , ప్లమ్ కేక్ 100 గ్రామ్స్ , గులాబ్ జామున్ 1/2 కేజీ(500గ్రామ్స్), కుర్ద్ కుప్స్ 200గ్రామ్స్, సుచేట్ కుర్ద్ లను మార్కెట్లో ఆవిష్కరించిన సంగం డెయిరి.
నూతన ఉత్పత్తుల ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు డిస్ట్రిబ్యూటర్లు ఏజెంట్లు.
సంగం డెయిరి పాల పదార్థాలను కంపెనీ వివిధ దశలలో 114 రకాల పరీక్షలు నిర్వహిస్తుందని తెలియజేసిన చైర్మన్.8 వేలకు పైగా డిస్ట్రిబ్యూటర్లు మరియు ఏజెంట్ల ద్వారా 82 రకాల పాలు మరియు పాల ఉత్పత్తులను 160 వివిధ  పరిమాణాల్లో లక్షలాది గృహాలకు సరఫరా చేస్తున్నామని తెలియజేసిన చైర్మన్. ఆంధ్రప్రదేశ్లో 6720 గ్రామాలలో విస్తరించి 1,50,000 మంది పాడి రైతుల నుండి సంఘం డైరీ రోజువారి ప్రాతిపదిక దాసరి 7,80,000 లీటర్ల పాలను సంగం డెయిరి సేకరిస్తుంది.సాంకేతికంగా అధునాతన ప్లాంట్లలో ఉత్పత్తులను తయారు చేస్తున్నాం.
సంగం డెయిరిలో అత్యాధునిక టెక్నాలజీతో యాంత్రీకరణ ద్వారా ఆటోమేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుంది.
పాడి రైతుల ఆర్ధిక ప్రగతే సంగం డెయిరి ప్రధమ లక్ష్యం. సంగం డెయిరికి ఉత్పత్తిదారులు, వినియోగదారులు రెండు కళ్ళు.
పంపిణీ దారులు ఏజెంట్ల ఆదాయాలను  పెంచడం కోసమే వివిధ రకాల కొత్త ఉత్పత్తులను తయారు చేస్తున్నాం  అనిసంగం డెయిరి చైర్మన్ ధూలిపాళ్ళ నరేంద్ర కుమార్ అన్నారు.