Skip to main content

Posts

Showing posts from December, 2023

క్రోడీకరించి వర్గీకరిస్తేనే ఉజ్వల భవిష్యత్‌

క్రోడీకరించి వర్గీకరిస్తేనే ఉజ్వల భవిష్యత్‌  చెన్నైలోని డీఎన్‌ఈజీ టెక్‌ మెడోస్‌ ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్, డేటా సైంటిస్ట్‌ డాక్టర్‌ ఈ.డీ.బూబలన్‌ విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో వైభవంగా ముగిసిన జాతీయస్థాయి సెమినార్‌ టాలెంట్ ఎక్స్ ప్రెస్: విభిన్న వర్గాల వినియోగదారులు, వారి అభిరుచులు, వారి అవసరాలను గుర్తించే క్రమంలో సమాచారాన్ని సేకరించడం... వాటిని క్రోడీకరించి వర్గీకరిస్తేనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని చెన్నైలోని డీఎన్‌ఈజీ టెక్‌ మెడోస్‌ ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్, డేటా సైంటిస్ట్‌ డాక్టర్‌ ఈ.డీ.బూబలన్‌   తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ అప్లైడ్‌ సైన్సెస్‌ అండ్‌ హుమానిటీస్‌ విభాగంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మేథమాటిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌ విభాగం ఆధ్వర్యంలో ‘‘ ఎండ్‌ టు ఎండ్‌ డేటా సైన్స్‌’’ అనే అంశంపై రెండు రోజుల పాటు జరిగిన జాతీయస్థాయి వర్క్‌షాప్‌ను ఘనంగా ముగించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన  డేటా సైంటిస్ట్‌ డాక్టర్‌ ఈ.డీ.బూబలన్‌ మాట్లాడుతూ వినియోగదారుల నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి, సూచనలు, సలహా...

నంది నాటకోత్సవ బహుమతుల వివరాలు..

టాలెంట్ ఎక్స్ ప్రెస్: *బహుమతుల వివరాలు* 2023 డిసెంబరు 29న జరిగిన నంది నాటకోత్సవ ముగింపు కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందజేయబడ్డాయి. *నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం*  డా. మీగడ రామలింగస్వామి - పద్య నాటకం *వైయస్సార్ రంగస్థలం పురస్కారం* యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ (కాకినాడ) *ఉత్తమ గ్రంథం* రాయలసీమ నాటకరంగం (డాక్టర్ మూల మల్లికార్జునరెడ్డి, విశ్రాంత ఆచార్యులు యోగివేమన విశ్వవిద్యాలయం కడప) *పద్య నాటకం*     ఉత్తమ తొలి ప్రదర్శన - శ్రీ మాధవ వర్మ     ఉత్తమ ద్వితీయ ప్రదర్శన - శ్రీకాంత కృష్ణమాచార్య     ఉత్తమ తృతీయ ప్రదర్శన - వసంత రాజీయం     ఉత్తమ రచయిత - డా. మీగడ రామలింగస్వామి (శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం)     ఉత్తమ ద్వితీయ రచయిత - పల్లేటి లక్ష్మీకులశేఖర్ (శ్రీరామ పాదుకలు)     ఉత్తమ దర్శకుడు - డా. పి.వి.ఎన్. కృష్ణ (శ్రీ మాధవ వర్మ)     ఉత్తమ నటుడు - అంజిరెడ్డి (వసంత రాజీయం)     ఉత్తమ నటి - సురభి వెంగమాంబ (నర్తనశాల)     ఉత్తమ బాలనటులు - జి. జగన్, రంజిత్ రాజీవ (శ్రీ మాధవ వర్మ)     ఉ...

నంది నాటకోత్సవాల్లో తెనాలి వైభవం చాటిన కళల కాణాచి కళాకారులు

నంది నాటకోత్సవాల్లో తెనాలి  వైభవం చాటిన కళల కాణాచి కళాకారులు టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి నంది నాటకోత్సవం లో స్టార్ సినీ రైటర్ డాక్టర్ బర్రా సాయి మాధవ్ ఆధ్వర్యంలో లో నిర్వహిస్తున్న కళల కాణాచి తెనాలి వారి జనక్ జనక్ పాయల్ భాజే సాంఘిక నాటకం పలు విభాగాల్లో బహుమతులు అందుకుని తెనాలి కళా వైభవాన్ని మరో సారి చాటింది. ఉత్తమ ప్రతి నాయకుడు, ఉత్తమ బాల నటి, ఉత్తమ ఆహార్యం, ఉత్తమ హాస్య నటుడు అవార్డులను సొంతం చేసుకుంది. రచన , దర్శకత్వం డాక్టర్ ఎం. ఎస్. చౌదరి వహించారు.

కేంద్ర ప్రభుత్వ పధకాల ప్రయోజనాలు అర్హులైన ప్రజలందరికీ అందించటమే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ముఖ్య ఉద్దేశ్యం

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కేంద్ర ప్రభుత్వ పధకాల ప్రయోజనాలు అర్హులైన ప్రజలందరికీ  అందించటమే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ముఖ్య ఉద్దేశ్యం అని  కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డా.మన్ సుఖ్ మాండవియా పేర్కొన్నారు.    శుక్రవారం పొన్నూరు మండలం మామిళ్లపల్లి గ్రామంలోని  ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ను , 104 మొబైల్ మెడికల్ క్లినిక్ ను  కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డా.మన్ సుఖ్ మాండవియా , రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖ మంత్రి విడదల రజిని, రాష్ట్ర ప్రబరి అధికారి కేంద్ర ప్రభుత్వం తరపున సాల్మన్ ఆరోఖ్య రాజ్  , రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యంటీ. కృష్ణ బాబు , రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్,  జిల్లా సంయుక్త కలెక్టర్ జి. రాజకుమారి లతో కలసి సందర్శించారు. పంట పొలంలో రసాయనాలు వెదజల్లెందుకు ఉపయోగించే అత్యాధునిక  డ్రోన్ ప్రదర్శనను , పౌర సరఫరాల శాఖ ప్రధాన మంత్రి ఉజ్వల యోజన, ఆరోగ్య శాఖ ఆయుష్మాన్ భారత్, టీబీ స్ర్కీనింగ్, ఎలిమినేషన్, నెహ్ర...

నాటక రంగాన్ని, నాటకరంగ కళాకారులను ప్రోత్సహించడమే ముఖ్యమంత్రి జగన్ లక్ష్యం

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్ , గుంటూరు, 29 డిసెంబరు 2023 : సమాజానికి ప్రాణప్రధానమైన నాటక రంగాన్ని, నాటకరంగ కళాకారులను ప్రోత్సహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నంది నాటకోత్సవాలను  ఘనంగా నిర్వహించి అధ్బుతమైన అవార్డులు అందిస్తున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. శుక్రవారం శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన  22వ నంది నాటక బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టివి మరియు నాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పోసాని కృష్ణ మురళి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టీవీ మరియు నాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, రాష్ట్ర సమాచార మరియు పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి తో కలసి పాల్గొన్నారు. ఎన్టీ ఆర్ రంగస్థల అవార్డు 2022 విశాఖపట్నంకు చెందిన ప్రముఖ రంగస్థల నటులు, రచయిత  డా. మీగడ రామలింగ స్వామి కి గజమాల తో సన్మానించి జ్ఞాపిక, రూ.1,50,000 చెక్కు  అందించారు.    డా. వై ఎస్ ఆర్ అవార్డు 2023 కాకినాడకు చెందిన యంగ్ మెన్స్ హ్యపీ క...

శ్రద్ధాంజలి

రానున్న నూతన సంవత్సరం లో మరిన్ని సేవా కార్యక్రమాలు

రానున్న నూతన సంవత్సరం లో మరిన్ని సేవా కార్యక్రమాలు - రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సభ్యులు - నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కర టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్, తెనాలి: రానున్న నూతన సంవత్సరం లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వించనున్నట్లు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సభ్యులు తెలిపారు. క్లబ్ కార్యాలయంలో శనివారం సాయంత్రం రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో 2024వ సంవత్సరానికి సంబంధించిన నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు పావులూరు రాంబాబు మాట్లాడుతూ మరిన్ని సేవా కార్యక్రమాలు క్లబ్ చేపట్టనున్నట్లు వివరించారు. ఏడాది పంచాంగం, క్లబ్ గతం లో చేపట్టిన సేవా కార్యక్రమాల చిత్రాలతో కూడినటువంటి క్యాలెండర్ను రోటరీ క్లబ్ తెనాలి తరపున మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో క్లబ్బు కోశాధికారి కేఎల్ జగదీశ్వరాంబ సభ్యులు ఈదర వెంకట పూర్ణ చంద్ ప్రసంగించారు. కార్యక్రమంలో రోటరీ సభ్యులు మరియు అసిస్టెంట్ గవర్నర్ కన్నెగంటి మురళీకృష్ణ డాక్టర్ దూళిపాళ్ల రవీంద్రనాథ్ డాక్టర్ డి మురళీకృష్ణ ,ఈదర శ్రీనివాసరావు, జీవీ నారాయణ, గుమ్మడి సరోజిబాబు ఆలపాటి క...

రోడ్డు ప్రమాదాల నివారణ యువశక్తితోనే సాధ్యం

రోడ్డు ప్రమాదాల నివారణ యువశక్తితోనే సాధ్యం   తెనాలి డివిజన్‌ ఆర్టీవో కే.ప్రసాద్‌  రహదారి భద్రతపై విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో విద్యార్థులకు అవేర్‌నెస్‌ ప్రోగ్రామ్‌ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే యువశక్తిలో వచ్చే మార్పుతోనే సాధ్యమవుతుందని తెనాలి డివిజన్‌ ఆర్టీవో కే.ప్రసాద్‌ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శనివారం విజ్ఞాన్స్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో ‘‘రహదారి భద్రత – జీవితానికే రక్ష’’ అనే అంశంపై విద్యార్థులకు అవేర్‌నెస్‌ ప్రోగ్రామ్‌ను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెనాలి డివిజన్‌ ఆర్టీవో కే.ప్రసాద్‌ మాట్లాడుతూ దేశంలో యువత ఎక్కువగా ఉన్నారని, అయితే రోడ్డు ప్రమాదాల బారిన పడి చనిపోయేవారిలో ఎక్కవ మంది యువతే ఉన్నారని పేర్కొన్నారు. యువత ప్రమాదాల బారిన పడి తల్లిదండ్రులకు గుండెకోత మిగల్చరాదన్నారు. ప్రాణం ఎంతో విలువైనదని, ఏ ఒక్కరూ కూడా రోడ్డు ప్రమాదాల్లో మరణించకూడదనే ఉద్దేశ్యంతో అన్ని రకాలుగా కృషి చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్, సీట్‌ బెల్ట్‌ ధరించాలని పదేపదే అవగాహన కల్పిస్తు...

ఈ నెల 30న తెనాలిలో..

ప్రేమతోనే సమస్యలకు పరిష్కారం

ప్రేమతోనే సమస్యలకు పరిష్కారం   స్టూడెంట్‌ కౌన్సిలర్, మోటివేషనల్‌ స్పీకర్‌ ఆర్‌.శ్రీనివాసరావ్‌ విజ్ఞాన్స్‌ వర్సీటీలో ఘనంగా సెమీ క్రిస్ట్‌మస్‌ వేడుకలు టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: సమాజంలోని చాలా సమస్యలను డబ్బు పరిష్కరించలేదని.... ప్రేమతో అన్ని సమస్యలను తీర్చవచ్చునని స్టూడెంట్‌ కౌన్సిలర్, మోటివేషనల్‌ స్పీకర్‌ ఆర్‌.శ్రీనివాసరావ్‌ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని విద్యార్థుల ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్‌ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్టూడెంట్‌ కౌన్సిలర్, మోటివేషనల్‌ స్పీకర్‌ ఆర్‌.శ్రీనివాసరావ్‌ మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ ఇంకా నేను ఎక్కువ రోజులు బతకాలని ఆశపడతాడే గాని.... ఏదో ఒకరోజు మరణించాల్సిందే కదా అనే విషయాన్ని మాత్రం అంగీకరించడని పేర్కొన్నారు. విద్యార్థులందరూ జీవితంలో ఎదురయ్యే సమస్యలతో పాటు నిజాలనేవి కఠినంగా ఉన్నా సరే ఎదుర్కోవడానికి మానసికంగా సిద్ధపడాలన్నారు. మరణం గురించి ఎవరూ చింత చెందుతూ భయపడవద్దన్నారు. ప్రతి వ్యక్తి జీవితంలో కష్టసుఖాలనేవి సాధారణమని, జీవితంలో చీకటి తర్వాత ...

రూ.620 కోట్లతో 4,34,185 మంది విద్యార్థులకు బైజూస్‌ కంటెంట్‌తో ట్యాబ్‌లు పంపిణి చేసిన సీఎం జగన్

* రూ.620 కోట్లతో 4,34,185 మంది విద్యార్థులకు బైజూస్‌ కంటెంట్‌తో ట్యాబ్‌లు పంపిణి చేసిన సీఎం జగన్ *  *మన పిల్లలు ప్రపంచంలోనే దిబెస్ట్‌గా ఉండాలనేదే నా ఆకాంక్ష: సీఎం జగన్* *రూ. 17,500 ట్యాబ్ లలో, 15,500 విలవైన బైజూస్ కంటెంట్ వేసి ఇస్తున్నాం, దీంతో ప్రతి విద్యార్ధికి రూ. 33,000 లబ్ది* *ట్యాబ్‌లలో చదువుకు సంబంధించిన అంశాలే ఉంటాయి.. తల్లిదండ్రులకు ఎలాంటి భయాలు అవసరం లేదు* *జగన్ అప్పులు చేస్తున్నాడని చెబుతునే 6 గ్యారెంటీల పేరుతో జగన్ ఇచ్చేదానికన్నా మూడువంతులు ఎక్కవ ఇస్తామంటున్నారు* టాలెంట్ ఎక్స్ ప్రెస్:  ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ఎనిమిదో తరగతి విద్యార్థులకు వరుసగా రెండో ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం ట్యాబ్స్‌ పంపిణీ చేపట్టింది. పేదింటి పిల్లలు అంతర్జాతీయ వేదికపై తమ సత్తాచాటాలన్న సీఎం జగన్ లక్ష్యం మేరకు రూ.620 కోట్ల వ్యయంతో బైజూస్‌ ప్రీలోడెడ్‌ కంటెంట్‌ గల 4,34,185 ట్యాబ్స్‌ను 9,424 పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి నుంచి సీఎం జగన్ ట్యాబ్‌ల పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగించారు.. "మన పిల్లలు ప్రపంచ...

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీతో టీఎస్‌ఎస్‌సీ అవగాహన ఒప్పందం

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీతో టీఎస్‌ఎస్‌సీ అవగాహన ఒప్పందం టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీతో న్యూఢిల్లీలోని టీఎస్‌ఎస్‌సీ (టెలికాం సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్‌) అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని బుధవారం యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టెలికాం సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్‌ సీఈవో అరవింద్‌ బాలితో వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ అవగాహన ఒప్పందానికి సంబంధించిన పత్రాలను మార్చుకున్నారు. యూనివర్సిటీలోని ఆఫీస్‌ ఆఫ్‌ డీన్‌ ప్రమోషన్స్‌ కొలాబరేషన్స్‌ అండ్‌ ఫ్యాకల్టీ అఫైర్స్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో అవగాహన ఒప్పందం అనంతరం వివిధ విభాగాల డీన్లు, అధిపతులతో టీఎస్‌ఎస్‌సీ సీఈవో అరవింద్‌ బాలి ఇంటరాక్టివ్‌ సెషన్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలకు భారతదేశం స్కిల్‌ క్యాపిటల్‌గా ఏర్పాటు కాబోతుందన్నారు. దేశంలోని యువతకు స్కిల్‌ను డెవలప్‌ చేసి టెలికాం సెక్టార్‌లో ఉపాధి చూపించడమే మా లక్ష్యమని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇండస్ట్రీ 4.0, వెబ్‌ 3.0, 5...

నాయకుడంటే నలుగురి కోసమే..

నాయకుడంటే  నలుగురి కోసమే కానీ   నాలుగు మెతుకులు కొసం ఆరాట పడని వాడని...! నాయకుడంటే  సమాజానికై తాను మారుతూ రేపటి సమాజం కోసం బలమైన పునాదిలా నిలిచే వీరబాహుడని నాయకుడంటే  తనతో తానే యుద్ధం చేస్తూ తన'లో' నుండి మొదలై జనం'లో ' కి  లావాలా ప్రవహించే వాడని...! నాయకుడంటే నాలుగు జ్ఞాన విత్తుల కోసం గజ్జె గట్టి, డప్పుగొట్టి చిందై నర్తిస్తూ నాలుగూళ్ళకు నానుడయ్యే వాడని...! నాయకుడంటే కాలం నిత్యం మారుతున్నా   పట్టిన విలువని పిడికిలి బిగువుతో  వెన్నుముకల్లే నిటారుగా నిల్పెటోడని నాయకుడంటే ఉద్యమాన్ని ఎత్తుకుని గ్రామాలకు తరలెల్లే మద్ధ్యాన్నపు సూర్యుని మల్లె వెలిగిన నిజమైన దేశభక్తుడని నాయకుడంటే కారంచేడు నుండి కొల్లిపర దాకా అహంకారాన్ని ఎదిరించే ముల్లుగర్రై నీలిజెండా పోరులో కలబడి నిలబడే దళిత బెబ్బులి అని...! 'నాయకుడు' అనే  ఒక పదాన్ని జీవిత కాలం దాని నిజమైన  అర్ధ గౌరవంతో  ఆత్మ గౌరవంతో విర్రవీగేలా చేసిన విప్లవ వీరుడా  మార్క్స్ ఫూలే అంబేడ్కర్  రంజన్ బాబు ల ఆశయ సాధకుడా  నా భావజాలపు సహోదరుడా  కె వై రత్నమా(కనపర్తి యేసు రత్నం) న...

జాతీయ స్థాయి యోగాసన పోటీలకు విజ్ఞాన్స్‌ విద్యార్థుల ఎంపిక

జాతీయ స్థాయి యోగాసన పోటీలకు విజ్ఞాన్స్‌ విద్యార్థుల ఎంపిక టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన 6 గురు విద్యార్థులు జాతీయ స్థాయి యోగాసన చాంపియన్‌షిప్‌ పోటీలకు ఎంపికయ్యారని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన మాట్లాడుతూ గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో యోగాసన స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌  (వైఎస్‌ఏ ఏపీ) నిర్వహించిన 4వ రాష్ట్రస్థాయి యోగాసన చాంపియన్‌షిప్‌లో తమ యూనివర్సిటీకు చెందిన కే.సాయిక్రిష్ణ (బయోమెడికల్‌), ఈ.చరణ్‌ గణేష్‌ రెడ్డి (ఈసీఈ) అనే విద్యార్థులు రిథమిక్‌ పెయిర్‌ యోగాసన విభాగంలో గోల్డ్‌ మెడల్‌ సాధించి నేషనల్‌ లెవల్‌ చాంపియన్‌షిప్‌కు ఎంపికయ్యారని వెల్లడించారు. కట్టా రాజ్‌కుమార్‌ ( బీఎస్సీ), దారపునేని ఓం వెంకట సాయి చైతన్య( బీఎస్సీ) అనే విద్యార్థులు ఆర్టిస్టిక్‌ యోగాసన పెయిర్‌ విభాగంలో గోల్డ్‌ మెడల్‌ సాధించి నేషనల్‌ లెవల్‌ చాంపియన్‌షిప్‌కు ఎంపికయ్యారని తెలియజేసారు. ఈ.మృనాల్‌ (సీఎస్‌ఈ), జీ.ఆనంద్‌ అనే వి...

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీతో సీఎస్‌సీ అకాడమీ అవగాహన ఒప్పందం

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీతో సీఎస్‌సీ అకాడమీ అవగాహన ఒప్పందం టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ భారత ప్రభుత్వంలోని మినిస్ట్రీ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీ విభాగంతో నిర్వహించబడుతున్న విశాఖపట్నంలోని సీఎస్‌సీ (కామన్‌ సర్వీస్‌ సెంటర్‌) అకాడమీతో సోమవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎస్‌ఎస్‌ అకాడమీ వర్చువల్‌ లెర్నింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ రామ్‌ మోహన్‌తో వర్సిటీ ఇంచార్జి రిజిస్ట్రార్‌ డాక్టర్‌ పీఎంవీ రావు అవగాహన ఒప్పందానికి సంబంధించిన పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మాట్లాడుతూ ఈ అవగాహన ఒప్పందం వలన 8000 విద్యార్థులతో పాటు అధ్యాపకులకు కూడా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ టెక్నాలజీపైన ఉచితంగా శిక్షణ అందిస్తామన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సీ–డాక్, ఐఈఈఈ సంస్థల ద్వారా సర్టిఫికె...

సేవకు ప్రభుత్వ గుర్తింపు

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్  చుండూరుడిసెంబర్ 17 మంగళగిరి పోలీస్ ప్రధాన కార్యాలయంలో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ రాజేంద్రనాద్ రెడ్డి  చేతుల మీదుగా బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తోపాటుగా చుండూరు పోలీస్ స్టేషన్లో  ఏఎస్ఐగావిధులు నిర్వహిస్తున్న313 రాజ్ కుమార్ నేర చేదనలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు రాష్ట్ర డిజిపి చేతుల మీదుగా బ్రోంజ్ మేడల్ ను  శనివారంఅందుకున్నారు రాజ్ కుమార్ తెనాలి పరిసర ప్రాంతాల్లో నేర చరిత్ర కలిగిన వారిపై ప్రత్యేకంగా దృష్టిసరించి వారి కదలికలపై నిఘా ఏర్పాటు చేసి   సఖ స క్యాంగా అనేక నేర పరిశోధనలను చేసి అనేక కేసులను  సేధిస్తూ ఉన్నతాధికారులకు తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తూ ఆయన  విదు లు నిర్వహిస్తున్నారు బ్రోంజ్ మెడల్ సాధించిన రాజ్ కుమార్ ను ఉన్నతాధికారులు సిబ్బంది  అభినందించారు

తెనాలిలో ఘనంగా సెమీ క్రిస్మస్ సంబరాలు

తెనాలిలో ఘనంగా సెమీ క్రిస్మస్ సంబరాలు టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: తెనాలి చిన్నరావూరులో శనివారం రాత్రి ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగాగా జరిగాయి. లూథరన్ చర్చ్ స్త్రీల సమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ప్రదర్శించిన క్రీస్తు పుట్టుక నాటిక విశేషంగా ప్రేక్షకులను అలరించింది. మహిళలు ప్రత్యేక క్రిస్మస్ గీతాలకు కోలాట నృత్యాలు ప్రదర్శించి అబ్బురపరచారు. వీనులవిందైన సంగీతంతో కూడిన క్రిస్మస్ గీతాలు భక్తులను ఆకట్టుకున్నాయి. సురభి సెట్టింగ్స్, ఆహార్యాలతో నాటికను రక్తికట్టించారు. రోస్ లీనా లెనిన్ దర్శకత్వం వహించిన నాటికలో అందరూ మహిళలు నటించడం విశేషం. కార్యక్రమాన్ని సంఘ కాపరులు, సంఘపెద్దలు, రంగస్థల నటులు, దర్శకులు కనపర్తి బాబురావు, బడుగు మోహనరావు తదితరులు పర్యవేక్షించారు.

కొత్త రంగాలను అన్వేషించాలి

కొత్త రంగాలను అన్వేషించాలి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: -  గుంటూరులోని ఐటీసీ లిమిటెడ్‌ అగ్రి బిజినెస్‌ డివిజన్‌ హెచ్‌ఆర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పీ.వీరాస్వామి     - విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఘనంగా ముగిసిన జాతీయస్థాయి కాన్ఫరెన్స్‌ విద్యార్థులు తమను తాము మెరుగుపరుచుకునేందుకు కృషి చేస్తూ తమ పరిజ్ఞానంతో  కొత్త రంగాలను అన్వేషించాలని గుంటూరులోని ఐటీసీ లిమిటెడ్‌ అగ్రి బిజినెస్‌ డివిజన్‌ హెచ్‌ఆర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పీ.వీరాస్వామి అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శనివారం డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ విభాగం ఆధ్వర్యంలో ‘‘ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ మేనేజ్‌మెంట్‌ పర్‌స్పెక్టివ్స్‌ (ఎన్‌సీఎమ్‌పీ2023)’’ అనే అంశంపై రెండు రోజులపాటు నిర్వహించిన జాతీయస్థాయి సదస్సు ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమాన్ని ‘‘ మేనేజ్‌మెంట్‌ 4.0  ఎమర్జింగ్‌ ట్రెండ్స్‌ ఇన్‌ అనలిటిక్స్‌ అండ్‌ డిజిటల్‌ మేనేజ్‌మెంట్‌’’ అనే ఇతివృత్తంతో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గుంటూరులోని ఐటీసీ లిమిటెడ్‌ అగ్రి బిజినెస్‌ డివిజన్‌ హెచ్‌ఆర్‌ వైస్‌ ప్రె...

ప్రపంచ ఔషధశాలగా భారత్‌

  ఏపీ ఫార్మసీ కౌన్సిల్‌ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎమ్‌ విలియమ్‌ క్యారే   విజ్ఞాన్‌ ఫార్మసీలో ఘనంగా ప్రారంభమైన అంతర్జాతీయ సదస్సు టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: దేశంలో ఫార్మారంగం శరవేగంగా అభివృద్ధి చెందటంతో పాటు ప్రపంచ దేశాలకు భారతదేశం ఔషధశాలగా పేరొందుతోందని ఏపీ ఫార్మసీ కౌన్సిల్‌ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎమ్‌ విలియమ్‌ క్యారే అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాలలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫార్మసీ ప్రాక్టీస్‌ ఆధ్వర్యంలో ‘‘ అడ్వాన్డ్స్‌ ప్రాక్టీసెస్‌ అండ్‌ ఇన్నోవేషన్స్‌ ఇన్‌ గ్లోబల్‌ హెల్త్‌కేర్‌’ అనే అంశంపై మూడు రోజులపాటు జరిగే అంతర్జాతీయ సదస్సును శుక్రవారం వైభవంగా ప్రారంభించారు. ఈ అంతర్జాతీయ సదస్సును ‘‘కొలాబరేటివ్‌ బ్లెండింగ్‌ ఆఫ్‌ ఐడియాస్‌ అండ్‌ ఇన్‌సైట్స్‌ టు ఎంపవర్‌ ఫార్మాసిస్ట్స్‌ టువర్డ్స్‌ ఏ హెల్తియర్‌ వరల్డ్‌’’ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ ఫార్మసీ కౌన్సిల్‌ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎమ్‌ విలియమ్‌ క్యారే మాట్లాడుతూ నూతన ఆవిష్కరణలతో కొత్త...

రోటరీ క్లబ్ సేవలు అభినందనీయం

రోటరీ క్లబ్ సేవలు అభినందనీయం తెనాలి: సమాజంలో సేవా సంస్థల పాత్ర ప్రముఖమని అందులోనూ రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సంస్థ చేస్తున్న సేవలు ప్రత్యేకతను సంతరించుకున్నాయని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ రాష్ట్ర నాయకులు కనపర్తి రత్నాకర్ అన్నారు. స్థానిక కార్యాలయంలో బుదవారం ఫెడరేషన్ ఆధ్వర్యంలో క్లబ్ సేవలను అభినందిస్తూ అభినందన సభ జరిగింది. సభకు తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు అంబటి శ్యామ్ సాగర్ అధ్యక్షత వహించారు. రత్నాకర్ మాట్లాడుతూ 2024 సంవత్సరానికి గాను ఫెడరేషన్ సభ్యులైన 34మందికి పోస్టల్ ప్రమాద భీమా రోటరీ అందించడం హర్షణీయమన్నారు. రూ 14,400 ఇన్సూరెన్స్ మొత్తాన్ని క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ కన్నెగంటి మురళి ద్వారా రోటరీ కార్యవర్గం చెల్లించడంపై కృతజ్ఞతలు తెలిపారు. ఫెడరేషన్ తెనాలి డివిజన్ అధ్యక్షులు మంచికలపూడి రవి కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టులు సేవలు గుర్తించి క్లబ్ ద్వారా పోస్టల్ ప్రమాద భీమా కల్పించడం అభినందనీయమన్నారు. రోటరీ క్లబ్ అధ్యక్షులు పావులూరి రాంబాబు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య జర్నలిస్టులు వారధిలా ఉంటూ ప్రజాసమస్యలు పరిష్కారంలో జర...

2030 నాటికి ఈవీ ఇండస్ట్రీలో 50 మిలియన్‌ ఉద్యోగాలు ఎన్‌ఐటీ ఏపీ ఈఈఈ విభాగాధిపతి డాక్టర్‌ టీ.రమేష్‌

2030 నాటికి ఈవీ ఇండస్ట్రీలో 50 మిలియన్‌ ఉద్యోగాలు   ఎన్‌ఐటీ ఏపీ ఈఈఈ విభాగాధిపతి డాక్టర్‌ టీ.రమేష్‌ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: 2030 సంవత్సరం నాటికి ఈవీ ( ఎలక్ట్రిక్‌ వెహికల్‌) ఇండస్ట్రీలో 50 మిలియన్‌ ఉద్యోగాలు క్రియేట్‌ చేయబడుతాయని ఎన్‌ఐటీ ఏపీ ఈఈఈ విభాగాధిపతి డాక్టర్‌ టీ.రమేష్‌ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలలోని ఈఈఈ విభాగం వారు ఏఐసీటీఈ ఆర్థిక సహకారంతో ‘‘ సరై్టన్‌ ఆస్పెక్ట్స్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ టు అచీవ్‌ సస్టైనబుల్‌ ఎనర్జీ’’ అనే అంశంపై వారం రోజుల పాటు నిర్వహించనున్న అటల్‌ ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్‌ఐటీ ఏపీ ఈఈఈ విభాగాధిపతి డాక్టర్‌ టీ.రమేష్‌ మాట్లాడుతూ భవిష్యత్‌ అంతా ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌దేనని పేర్కొన్నారు.  దేశంలో రోజు రోజుకు పెరిగిపోతున్న జనాభా వలన ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ వినియోగం పెరిగిందన్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలకు ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌లలో వినియోగించే టెక్నాలజీలపైన అనుభవం కలిగిన వారు తక్కువగా ఉండటం ప్రధాన సమస్యగా మారిందన్నారు...

కొత్త ఐడియాలతోనే జీవితంలో మార్పు

కొత్త ఐడియాలతోనే జీవితంలో మార్పు   విజయవాడలోని ఎస్‌టీపీఐ జాయింట్‌ డైరక్టర్‌ బీ.వినయ్‌ కుమార్‌   విజ్ఞాన్స్‌లో ఘనంగా వీఐఐఐఎస్‌ఏ టీబీఐ స్టార్టప్‌ ఫండింగ్‌ సదస్సు   సదస్సుకు 12 రాష్ట్రాల నుంచి హాజరైన 30 స్టార్టప్‌ కంపెనీలు  టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: జీవితంలో ఎవరైనా మార్పుతో పాటు అభివృద్ధి చెందాలనుకుంటే కొత్త ఐడియాలతోనే సాధ్యమని విజయవాడలోని ఎస్‌టీపీఐ జాయింట్‌ డైరక్టర్‌ బీ.వినయ్‌ కుమార్‌ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని  టెక్నాలజీ బిజినెస్‌ ఇంకుబేటర్‌ వారు న్యూఢిల్లీలోని డీఎస్‌టీ ఆర్థిక సహాయంతో ‘‘ వీఐఐఐఎస్‌ఏ (విజ్ఞాన్స్‌ ఇన్నోవేషన్, ఇగ్నిషన్‌ అండ్‌ ఇంకుబేషన్‌ ఫర్‌ స్టార్టప్‌ యాక్సిలరేషన్‌) టెక్నాలజీ బిజినెస్‌ ఇంకుబేటర్‌ స్టార్టప్‌ ఫండింగ్‌ ఏంజెల్‌ ఇన్వెస్టర్స్‌ అండ్‌ వెంచర్‌ క్యాపటలిస్ట్స్‌) సదస్సు కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సదస్సుకు 12 రాష్ట్రాల నుంచి ఎంపికచేసిన 30 స్టార్టప్‌ కంపెనీలు హాజరయ్యాయి. ఈ 30 కంపెనీలు ప్రారంభించాలనుకుంటున్న వివిధ రకాల స్టార్టప్‌ కంపెనీల ఐడియాలను ఈ సదస్సులో తెలియజేసారు. ఉత్తమంగా ...