2030 నాటికి ఈవీ ఇండస్ట్రీలో 50 మిలియన్‌ ఉద్యోగాలు ఎన్‌ఐటీ ఏపీ ఈఈఈ విభాగాధిపతి డాక్టర్‌ టీ.రమేష్‌

2030 నాటికి ఈవీ ఇండస్ట్రీలో 50 మిలియన్‌ ఉద్యోగాలు

  ఎన్‌ఐటీ ఏపీ ఈఈఈ విభాగాధిపతి డాక్టర్‌ టీ.రమేష్‌
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
2030 సంవత్సరం నాటికి ఈవీ ( ఎలక్ట్రిక్‌ వెహికల్‌) ఇండస్ట్రీలో 50 మిలియన్‌ ఉద్యోగాలు క్రియేట్‌ చేయబడుతాయని ఎన్‌ఐటీ ఏపీ ఈఈఈ విభాగాధిపతి డాక్టర్‌ టీ.రమేష్‌ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలలోని ఈఈఈ విభాగం వారు ఏఐసీటీఈ ఆర్థిక సహకారంతో ‘‘ సరై్టన్‌ ఆస్పెక్ట్స్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ టు అచీవ్‌ సస్టైనబుల్‌ ఎనర్జీ’’ అనే అంశంపై వారం రోజుల పాటు నిర్వహించనున్న అటల్‌ ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్‌ఐటీ ఏపీ ఈఈఈ విభాగాధిపతి డాక్టర్‌ టీ.రమేష్‌ మాట్లాడుతూ భవిష్యత్‌ అంతా ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌దేనని పేర్కొన్నారు.  దేశంలో రోజు రోజుకు పెరిగిపోతున్న జనాభా వలన ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ వినియోగం పెరిగిందన్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలకు ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌లలో వినియోగించే టెక్నాలజీలపైన అనుభవం కలిగిన వారు తక్కువగా ఉండటం ప్రధాన సమస్యగా మారిందన్నారు. కాబట్టి విద్యార్థులందరూ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌లో వినియోగించే టెక్నాలజీల మీద పట్టు సాధించినట్లైతే ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని తెలియజేసారు. 2026 సంవత్సరం కల్లా ఇండియన్‌ ఆటోమొబైల్‌ రంగం బిజినెస్‌ 300 యూఎస్‌ బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని తెలిపారు. విదార్యులు కేవలం ఉద్యోగాలకే పరిమితం అవ్వకుండా స్టార్టప్స్‌ను మొదలుపెట్టి ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా కూడా ఎదగాలన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కే.ఫణీంద్ర కుమార్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.