రోటరీ క్లబ్ సేవలు అభినందనీయం

రోటరీ క్లబ్ సేవలు అభినందనీయం

తెనాలి: సమాజంలో సేవా సంస్థల పాత్ర ప్రముఖమని అందులోనూ రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సంస్థ చేస్తున్న సేవలు ప్రత్యేకతను సంతరించుకున్నాయని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ రాష్ట్ర నాయకులు కనపర్తి రత్నాకర్ అన్నారు. స్థానిక కార్యాలయంలో బుదవారం ఫెడరేషన్ ఆధ్వర్యంలో క్లబ్ సేవలను అభినందిస్తూ అభినందన సభ జరిగింది. సభకు తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు అంబటి శ్యామ్ సాగర్ అధ్యక్షత వహించారు. రత్నాకర్ మాట్లాడుతూ 2024 సంవత్సరానికి గాను ఫెడరేషన్ సభ్యులైన 34మందికి పోస్టల్ ప్రమాద భీమా రోటరీ అందించడం హర్షణీయమన్నారు. రూ 14,400 ఇన్సూరెన్స్ మొత్తాన్ని క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ కన్నెగంటి మురళి ద్వారా రోటరీ కార్యవర్గం చెల్లించడంపై కృతజ్ఞతలు తెలిపారు. ఫెడరేషన్ తెనాలి డివిజన్ అధ్యక్షులు మంచికలపూడి రవి కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టులు సేవలు గుర్తించి క్లబ్ ద్వారా పోస్టల్ ప్రమాద భీమా కల్పించడం అభినందనీయమన్నారు. రోటరీ క్లబ్ అధ్యక్షులు పావులూరి రాంబాబు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య జర్నలిస్టులు వారధిలా ఉంటూ ప్రజాసమస్యలు పరిష్కారంలో జర్నలిస్టులు ముందుంటారని వారి సేవలు ఉన్నతమైనవని ప్రశంసించారు. జర్నలిస్టులకు తమవంతు సేవలు అందించడంలో ముందుంటామని, రోటరీ క్లబ్ సెక్రెటరీ నల్లూరి వెంకేశ్వర్లరావు, కోగంటి శ్రీనివాసరావు, డి మురళి కృష్ణ, కటారి చేతన్ రాజ్, క్లబ్ పూర్వ అధ్యక్షులు ఈదర వెంకట పూర్ణ చంద్ అన్నారు. అనంతరం పోస్టల్ ప్రమాద భీమా బాండ్ పత్రాలను ఫెడరేషన్ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు పుట్ల పున్నయ్య, మేకల సుబ్బారావు, గురిందపల్లి ప్రభాకరరావు, బచ్చు సురేష్ బాబు, ఎస్ ఎస్ జహీర్, నరేష్ కుమార్ జైన్, ఎన్ జె శామ్యూల్, గుమ్మడి ప్రకాశరావు, అచ్యుత సాంబశివరావు, సిహెచ్ చంద్రశేఖర్, మునిపల్లి శ్రీకాంత్, బొరిగొర్ల చంద్రమోహన్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.