జాతీయ స్థాయి యోగాసన పోటీలకు విజ్ఞాన్స్‌ విద్యార్థుల ఎంపిక

జాతీయ స్థాయి యోగాసన పోటీలకు విజ్ఞాన్స్‌ విద్యార్థుల ఎంపిక
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన 6 గురు విద్యార్థులు జాతీయ స్థాయి యోగాసన చాంపియన్‌షిప్‌ పోటీలకు ఎంపికయ్యారని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన మాట్లాడుతూ గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో యోగాసన స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌  (వైఎస్‌ఏ ఏపీ) నిర్వహించిన 4వ రాష్ట్రస్థాయి యోగాసన చాంపియన్‌షిప్‌లో తమ యూనివర్సిటీకు చెందిన కే.సాయిక్రిష్ణ (బయోమెడికల్‌), ఈ.చరణ్‌ గణేష్‌ రెడ్డి (ఈసీఈ) అనే విద్యార్థులు రిథమిక్‌ పెయిర్‌ యోగాసన విభాగంలో గోల్డ్‌ మెడల్‌ సాధించి నేషనల్‌ లెవల్‌ చాంపియన్‌షిప్‌కు ఎంపికయ్యారని వెల్లడించారు. కట్టా రాజ్‌కుమార్‌ ( బీఎస్సీ), దారపునేని ఓం వెంకట సాయి చైతన్య( బీఎస్సీ) అనే విద్యార్థులు ఆర్టిస్టిక్‌ యోగాసన పెయిర్‌ విభాగంలో గోల్డ్‌ మెడల్‌ సాధించి నేషనల్‌ లెవల్‌ చాంపియన్‌షిప్‌కు ఎంపికయ్యారని తెలియజేసారు. ఈ.మృనాల్‌ (సీఎస్‌ఈ), జీ.ఆనంద్‌ అనే విద్యార్థులు ఆర్టిస్టిక్‌ యోగాసన పెయిర్‌ విభాగంలో సిల్వర్‌ మెడల్‌ సాధించి నేషనల్‌ లెవల్‌ చాంపియన్‌షిప్‌కు మొదటి స్టాండ్‌బై ప్లేయర్లుగా ఎంపికయ్యారని పేర్కొన్నారు. పతకాలు సాధించి జాతీయ స్థాయి చాంపియన్‌షిప్‌ పోటీలకు ఎంపికైన విద్యార్థులను విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఫిజికల్‌ డైరక్టర్లు, అధ్యాపక సిబ్బంది అభినందించారు.