Skip to main content

నాటక రంగాన్ని, నాటకరంగ కళాకారులను ప్రోత్సహించడమే ముఖ్యమంత్రి జగన్ లక్ష్యం


టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్ ,
గుంటూరు, 29 డిసెంబరు 2023 : సమాజానికి ప్రాణప్రధానమైన నాటక రంగాన్ని, నాటకరంగ కళాకారులను ప్రోత్సహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నంది నాటకోత్సవాలను  ఘనంగా నిర్వహించి అధ్బుతమైన అవార్డులు అందిస్తున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. శుక్రవారం శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన  22వ నంది నాటక బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టివి మరియు నాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పోసాని కృష్ణ మురళి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టీవీ మరియు నాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, రాష్ట్ర సమాచార మరియు పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి తో కలసి పాల్గొన్నారు. ఎన్టీ ఆర్ రంగస్థల అవార్డు 2022 విశాఖపట్నంకు చెందిన ప్రముఖ రంగస్థల నటులు, రచయిత  డా. మీగడ రామలింగ స్వామి కి గజమాల తో సన్మానించి జ్ఞాపిక, రూ.1,50,000 చెక్కు  అందించారు.    డా. వై ఎస్ ఆర్ అవార్డు 2023 కాకినాడకు చెందిన యంగ్ మెన్స్ హ్యపీ క్లబ్  ప్రతినిధులను గజమాలతో సన్మానించి జ్ఞాపిక , రూ.5,00,000 చెక్కు అందించారు. సినీయర్ నాటక  కళాకారులు కె ఎస్ కె సాయి ని ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ గుంటూరులో ప్రముఖ కళాకారుడు, హరిశ్చంద్ర నాటక రచయిత బలిజేపల్లి లక్ష్మీకాంతం కళా ప్రాంగణంలో నంది నాటకోత్సవాల తుది పోటీలకు సంబంధించి 38 ప్రదర్శనల కార్యక్రమం వైభవంగా నిర్వహించటం చాలా సంతోషంగా ఉందన్నారు. నాటక  రంగం మొదటిదని, నాటకరంగంలో విజయవంతమైన వారు సినిమాల్లోను విజయాలు సాధిస్తారన్నారు. నాటకాల ప్రదర్శన చాల కష్టతరమైనదని, మంచి సందేశాన్ని అందించే  నాటకాలు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సంక్షిప్త రూపంలో ప్రదర్శిస్తున్నారన్నారు. సినిమాల్లో, టీవీలో నటించేవారు డబ్బు సంపాదిస్తారని, నాటకం రంగంలో డబ్బులు పోగొట్టుకున్న నటీ, నటీనటులే ఎక్కువ మంది ఉన్నారన్నారు. నాటక కళాకారులకు డబ్బు కంటే ప్రేక్షకులు కోట్టే చప్పట్లే గౌరవాన్ని ఇస్తాయన్నారు. ప్రజలను ఆకట్టుకునేలా రాజకీయ నాయకులు ప్రసంగాలు చేయాలన్నా మాడ్యూలేషన్ తో మాట్లాడే నాటకరంగంలో అనుభవం తప్పనిసరి అన్నారు. నాటక కళాకారులుగా పేద, మధ్యతరగతికి చెందిన వారు ఉంటారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాటకరంగాన్ని ప్రోత్సహించాటానికి ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలలు తీసుకుంటున్నారన్నారు. నాటక, టీవీ, చలన చిత్ర రంగంలో విశేష అనుభవం ఉన్న పోసాని కృష్ణ మురళి ని నాటక, టీవీ, చలన చిత్ర అభివృద్ధి సంస్థ కు నిదర్శనంగా నియమించటమే అందుకు నిదర్శనం అన్నారు. 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టివి మరియు నాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హత కల్గిన కళాకారులకే అవార్డులు అందిచాలని, కళారంగాన్ని, కళాకారులను ప్రోత్సహిస్తాననే నమ్మకంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  నాకు రాష్ట్ర చలన చిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా అవకాశం కల్పించారన్నారు. కరోనా కారణంగా రెండున్నర సంవత్సరాలు ఇబ్బంది ఉండటంతో తొలుత నాటక రంగానికి సంబంధించి నంది నాటకోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించటం జరుగుతుందన్నారు. నంది నాటకోత్సవాలలో అర్హత ఉన్న వారికే నంది బహుమతులు అందించేందుకు నిష్ణాతులైన న్యాయనిర్ణేతలను నియమించటంతో పాటు వారికి పూర్తి స్వేఛ్చను ఇవ్వటం జరిగిందన్నారు. నాటక ప్రదర్శనలలో అత్యుత్తమమైనవి ఎంపిక చేయటానికి, ఎన్టీఆర్ మరియు డా.వైఎస్సార్ రంగస్థల పురస్కారాల ఎంపికకు ప్రపంచంలోనే ఎప్పుడు లేని విధంగా 27 మంది న్యాయనిర్ణేతలను నియమించటం జరిగిందన్నారు,నంది నాటకాల ఎంపికల్లో కులం మతం ప్రాంతం సిఫార్సులు లాంటివాటికి తావులేకుండా పూర్తి పారదర్శకంగా వ్యవహరించామని, ఎక్కడైనా పొరపాటు ఉంటే నా చొక్కా పట్టుకుని నిలదీయాలనీ, లై డిటెక్టర్ పరీక్షకు సైతం సిద్ధంగా ఉన్నాన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టీవీ మరియు నాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మరియు రాష్ట్ర సమాచార మరియు పౌర సంబంధాల శాఖ  కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నాటకరంగాన్ని ప్రోత్సహించాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో 22వ నంది నాటకోత్సవాలను మహ యజ్నంలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించటం జరిగిందన్నారు. నందినాటకోత్సవాలకు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన 115 ఎంట్రీలను ప్రాధమికంగా సెప్టెంబరు నెలలో పరిశీలించి వాటిలో పద్య నాటకం, సాంఘిక నాటకం, సాంఘిక నాటిక, బాలల నాటిక, విశ్వవిద్యాలయ, కళాశాల నాటిక విభాగాల్లో 38 నాటకాలను  తుది పోటీలకు ఎంపిక చేయటం జరిగిందన్నారు. వారం రోజులపాటు జరిగిన ప్రదర్శనలలో కళాభిమానులు, ప్రజలు ఉత్సాహాంగా పాల్గొని తిలకించటం జరిగిందన్నారు. నాటక ప్రదర్శనలకు వచ్చిన దాదాపు 1200 మంది కళాకారులకు వసతి, భోజన, రవాణ తదితర సౌకర్యాలను ఎఫ్ డీ సీ, జిల్లా అధికారులు, నాటకరంగానికి చెందిన వారితో ఏర్పాటు చేసిన కమిటీలు పూర్తి స్థాయిలో కల్పించటం జరిగిందన్నారు. వసతులపై కళాకారులు పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేయటం జరిగిందన్నారు. నందినాటకోత్సవాల అవార్డుల ఎంపిక పక్షపాతం లేకుండా నిజమైన అర్హులకే అందిస్తున్నందుకు గర్విస్తున్నామన్నారు. నంది నాటకోత్సవాలకు వచ్చిన ప్రతి ప్రదర్శన అత్యద్బుతమైనవని, బహుమతులు రాని వారు నిరాశచెందాల్సిన అవసరం లేదన్నారు. నాటక ప్రదర్శనలను ఘనంగా నిర్వహించటానికి సహకారం అందించిన జిల్లా యంత్రాగానికి, ఇతర అధికారులకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.
  నంది నాటకోత్సవాలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన వారికి , వివిధ కమిటీల బాధ్యతలు నిర్వహించిన అధికారులను , ఉద్యోగులను సన్మానించి జ్ఞాపికలు అందించారు. 22 వ నంది ఉత్తమ నాటక అవార్డులు విజేతలకు స్వర్ణ, రజిత, కాంస్య నందులను , వ్యక్తిగత విభాగాల్లోనూ నందులను  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టివి మరియు నాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పోసాని కృష్ణ మురళి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టీవీ మరియు నాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, రాష్ట్ర సమాచార మరియు పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి అందించారు. 22 వ నంది ఉత్తమ నాటక అవార్డులు విజేతల వివరాలు  పద్య నాటకాలు స్వర్ణ, రజిత, కాంస్య నందులు వరుసుగా  1.మాధవ వర్మ , 2. శ్రీకాంత కృష్ణమాచార్య , 3. వసంత రాజీయం సాంఘిక నాటకం స్వర్ణ, రజిత, కాంస్య నందులు వరుసుగా  1. ఇంద్రప్రస్తం, 2. ద ఇంపోస్టర్స్ 3. కలనేత సాంఘిక నాటిక  స్వర్ణ, రజిత, కాంస్య నందులు వరుసుగా  1. ఆస్థికలు, 2. కమనీయం,3. చీకటి పువ్వుబాలల నాటికలు స్వర్ణ, రజిత, కాంస్య నందులు వరుసుగా  1. ప్రపంచ తంత్రం ,2. బాధ్యత ,3. మూడు ప్రశ్నలుయూనివర్సిటీ/కాలేజి నాటికలు స్వర్ణ, రజిత, కాంస్య నందులు వరుసుగా  1. ఇంకానా , 2. కపిరాజు, 3. ఉద్దం సింగ్ కార్యక్రమంలో రాష్ట్ర చలన చిత్ర , టీవీ నాటక రంగ అభివృద్ది సంస్థ జనరల్ మేనేజర్ శేష సాయి , రాష్ట్ర కుమ్మరి , శాలివాహన కార్పొరేషన్ చైర్మెన్ మండేపూడి పురుషోత్తం , జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ప్రభాకర రెడ్డి , ఎఫ్ డీసీ అధికారులు , కళాకారులు పాల్గొన్నారు. 

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...