తెనాలిలో ఘనంగా సెమీ క్రిస్మస్ సంబరాలు

తెనాలిలో ఘనంగా సెమీ క్రిస్మస్ సంబరాలు

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
తెనాలి చిన్నరావూరులో శనివారం రాత్రి ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగాగా జరిగాయి. లూథరన్ చర్చ్ స్త్రీల సమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ప్రదర్శించిన క్రీస్తు పుట్టుక నాటిక విశేషంగా ప్రేక్షకులను అలరించింది. మహిళలు ప్రత్యేక క్రిస్మస్ గీతాలకు కోలాట నృత్యాలు ప్రదర్శించి అబ్బురపరచారు. వీనులవిందైన సంగీతంతో కూడిన క్రిస్మస్ గీతాలు భక్తులను ఆకట్టుకున్నాయి. సురభి సెట్టింగ్స్, ఆహార్యాలతో నాటికను రక్తికట్టించారు. రోస్ లీనా లెనిన్ దర్శకత్వం వహించిన నాటికలో అందరూ మహిళలు నటించడం విశేషం. కార్యక్రమాన్ని సంఘ కాపరులు, సంఘపెద్దలు, రంగస్థల నటులు, దర్శకులు కనపర్తి బాబురావు, బడుగు మోహనరావు తదితరులు పర్యవేక్షించారు.