రానున్న నూతన సంవత్సరం లో మరిన్ని సేవా కార్యక్రమాలు

రానున్న నూతన సంవత్సరం లో మరిన్ని సేవా కార్యక్రమాలు
- రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సభ్యులు
- నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కర
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్, తెనాలి:
రానున్న నూతన సంవత్సరం లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వించనున్నట్లు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సభ్యులు తెలిపారు. క్లబ్ కార్యాలయంలో శనివారం సాయంత్రం రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో 2024వ సంవత్సరానికి సంబంధించిన నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు పావులూరు రాంబాబు మాట్లాడుతూ మరిన్ని సేవా కార్యక్రమాలు క్లబ్ చేపట్టనున్నట్లు వివరించారు. ఏడాది పంచాంగం, క్లబ్ గతం లో చేపట్టిన సేవా కార్యక్రమాల చిత్రాలతో కూడినటువంటి క్యాలెండర్ను రోటరీ క్లబ్ తెనాలి తరపున మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో క్లబ్బు కోశాధికారి కేఎల్ జగదీశ్వరాంబ సభ్యులు ఈదర వెంకట పూర్ణ చంద్ ప్రసంగించారు. కార్యక్రమంలో రోటరీ సభ్యులు మరియు అసిస్టెంట్ గవర్నర్ కన్నెగంటి మురళీకృష్ణ డాక్టర్ దూళిపాళ్ల రవీంద్రనాథ్ డాక్టర్ డి మురళీకృష్ణ ,ఈదర శ్రీనివాసరావు, జీవీ నారాయణ, గుమ్మడి సరోజిబాబు ఆలపాటి కిరణ్ ,కీట్స్, నల్లూరి వెంకటేశ్వరరావు, ఎం అర్జున, నరేష్ కుమార్ జైన్, రమేష్ కుమార్ జైన్ తదితరులు పాల్గొన్నారు