కేంద్ర ప్రభుత్వ పధకాల ప్రయోజనాలు అర్హులైన ప్రజలందరికీ అందించటమే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ముఖ్య ఉద్దేశ్యం

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కేంద్ర ప్రభుత్వ పధకాల ప్రయోజనాలు అర్హులైన ప్రజలందరికీ  అందించటమే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ముఖ్య ఉద్దేశ్యం అని  కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డా.మన్ సుఖ్ మాండవియా పేర్కొన్నారు. 
  శుక్రవారం పొన్నూరు మండలం మామిళ్లపల్లి గ్రామంలోని  ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ను , 104 మొబైల్ మెడికల్ క్లినిక్ ను  కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డా.మన్ సుఖ్ మాండవియా , రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖ మంత్రి విడదల రజిని, రాష్ట్ర ప్రబరి అధికారి కేంద్ర ప్రభుత్వం తరపున సాల్మన్ ఆరోఖ్య రాజ్  , రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యంటీ. కృష్ణ బాబు , రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్,  జిల్లా సంయుక్త కలెక్టర్ జి. రాజకుమారి లతో కలసి సందర్శించారు. పంట పొలంలో రసాయనాలు వెదజల్లెందుకు ఉపయోగించే అత్యాధునిక  డ్రోన్ ప్రదర్శనను , పౌర సరఫరాల శాఖ ప్రధాన మంత్రి ఉజ్వల యోజన, ఆరోగ్య శాఖ ఆయుష్మాన్ భారత్, టీబీ స్ర్కీనింగ్, ఎలిమినేషన్, నెహ్రుయువకేంద్రం, గ్రామ వార్డు సచివాలయ శాఖ మై భారత్ వాలంటీర్ ఎన్రోల్మేంట్ మరియు ఆధార్ క్యాంప్, వ్యవసాయ శాఖ భూసార పరీక్షలు, ప్రకృతి వ్యవసాయంపై ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. సభలో తొలుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం వీడియోను, ప్రభుత్వ పధకాలపై రూపొందించిన లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. వికసిత్ భారత్ సంకల్ప ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డా.మన్ సుఖ్ మాండవియా మాట్లాడుతూ మామిళ్లపల్లిలో జరుగుతున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్ర  కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనడం సంతోషకరం అన్నారు. సమాజాభివృద్ధి కొరకు మరియు పేదల అభివృద్ధి కొరకు భారత ప్రభుత్వము గౌరవనీయ ప్రధానమంత్రి గారు నిర్దేశించిన విధముగా 17 పధకముల అమలు ,  దాని వలన జరిగిన, జరుగుచున్న అభివృద్ధిని ప్రజలకు తెలియపరుచుటకు వికసిత్ భారత్ సంకల్ప యాత్రను నిర్వహించటం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం పీయంజేవై కార్డు ద్వారా గాని , రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కార్డు ద్వారానైనా గాని  వైద్య చికిత్సలు ఉచితంగా అందుతాయని , పియంజేవై కార్డు పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లోగులు కలసి వుంటాయన్నారు. యువతి యువకులు వ్యాపార అవసరాల కోసం బ్యాంక్ లోన్ కోసం  ముద్ర లోన్స్  తీసుకోవచ్చన్నారు. గ్యాస్ కనెక్షన్ లేనివారు అప్లై చేసుకుంటే వెంటనే  అందించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ పనితీరు బాగుందని , వైద్య రంగం అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించడం జరుగుతుందన్నారు. గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతి వర్గానికి అన్ని రకాల సంక్షేమ ఫలాలను అందిస్తున్నారాని , అర్హత వుండి ఎవరికైనా కేంద్ర ప్రభుత్వ పధకాల లబ్ది చేకూరని వారికి వికసిత్ భారత్ యాత్ర కార్యక్రమం ద్వారా లబ్ది చేకూర్చడం జరుగుతుందన్నారు. రైతులకు నానో ఫర్టీలైజర్ ఎరువులు అందించడం ద్వారా నాణ్యమైన పంటలను పండించవచ్చన్నారు. పంట పొలంలో రసాయనాలు వెదజల్లెందుకు అత్యాధునిక  డ్రోన్ నానో ఫర్టీలైజర్ ఎరువులు , డిఏపి కలిపి  ఉపయోగిస్తే మొక్కలకు చక్కగా అందుతుందని , తద్వారా పంట దిగుబడి బాగుంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వ పధకాలు అర్హులు ఉపయోగించుకొని లబ్ది పొందాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నానన్నారు.  
  రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పధకాల అమలు తీరును రాష్ట్రాలలో ప్రత్యక్షంగా పరిశీలించి తెలుసుకోవడానికి  కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డా. మన్ సుఖ్ మాండవియా రావడం చాలా సంతోషకరమన్నారు.  జిల్లాలో అమలు చేస్తున్న కేంద్ర పధకాలను   డా.మన్ సుఖ్ మాండవియా కు వివరించడం జరిగిందన్నారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్. జగన్ మోహన్ రెడ్డి వైద్య రంగంలో తీసుకువచ్చిన విప్లవాత్మకమైన మార్పుల గురించి తెలియజేడం జరిగిందన్నారు.  నాడు నేడు కార్యక్రమం ద్వారా 17 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసి ఆసుపత్రులను అభివృద్ది చేయడం జరిగిందని , రాష్ట్రంలో 8,500 కోట్ల రూపాయలతో 11 మెడికల్ కళాశాల నిర్మాణాలు చేపట్టడం జరుగుతున్నదని , వీటిలో ఐదు కళాశాలు అందుబాటులోకి రానున్నాయన్నారు. వైయస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా 90 శాతం పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా వుందన్నారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య చికిత్సల పరిమితిని ఐదు లక్షల రూపాయల నుండి 25 లక్షల వరకు పెంచడం జరిగిందన్నారు.   జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా సూపర్ స్పెషాలిటీ  ఆసుపత్రి సేవలు గ్రామాల్లో అందజేసేటట్లు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. వైద్య రంగంలో కేంద్ర ప్రభుత్వం  అమలు చేస్తున్న పధకాలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందజేస్తుందని తెలియజేశారు.  రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యంటీ. కృష్ణ బాబు మాట్లాడుతూ భారత దేశం అభివృద్ది లో 2047  నాటికి అగ్ర దేశాల సరసన చేరాలన్నది వికసిత భారత సంకల్ప యాత్ర ముఖ్య ఉద్దేశ్యమన్నారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పియంజేవై , వైయస్సార్ ఆరోగ్య శ్రీ కార్డు ద్వారా గాని ఉచితంగా వైద్య సేవలు అందుతాయన్నారు. పియంజేవై కార్డుపై రూ. 5 లక్షల పరిమితి వుందని , వైయస్సార్ ఆరోగ్య శ్రీ కార్డు పై రూ.25 లక్షల పరిమితి వుందన్నారు. అదే క్యాన్సర్ లాంటి వ్యాధులకు పరిమితి లేదని తెలియజేశారు. వైయస్సార్ ఆరోగ్య శ్రీ కార్డు లు ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలలో రిఫరల్ ఆశుపాత్రులలో పని చేస్తుందని , పియంజేవై కార్డు దేశం మొత్తం మీద ఉపయోగించుకోవచ్చన్నారు.  ఇతర రాష్ట్రాలకు వెళ్లేటప్పుడు పియంజేవై కార్డును అందుబాటులో వుంచుకోవాలన్నారు.  కార్యక్రమంలో జెడ్పీ సిఈఓ మోహన్ రావు , డియం అండ్ హెచ్ ఓ డా. శ్రావణ బాబు , జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు , పౌర సరఫరాల శాఖ అధికారిణి కోమలి పద్మ , జాతీయ లేబర్ బోర్డు ఛైర్మన్ వల్లూరి జయప్రకాష్ నారాయణ , బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర , జిల్లా ప్రధాన కార్యదర్శి వైవి. సుబ్బారావు , పొన్నూరు అసెంబ్లీ  కన్వీనర్ సుధాకర్ , పొన్నూరు మండల తహశీల్దార్ శ్రీకాంత్ కేధార్ నాథ్ , యంపిడీఓ శ్రీనివాస్ , మామిళ్లపల్లి గ్రామ సర్పంచ్ జాలాది యానాది రావు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ వైద్యాధికారులు , సిబ్బంది , ఏఎన్ఎం లు, ఆశా వర్కర్లు , ప్రజలు పాల్గొన్నారు.