Skip to main content

Posts

Showing posts from January, 2024

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

* ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు * టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: ▫ *6,100 పోస్టులతో* మెగా డీఎస్సీ నిర్ణయానికి కేబినెట్ ఆమోదం ✅ ▫అటవీ శాఖలో *689 పోస్టుల* భర్తీకి కేబినెట్ ఆమోదం ▫ఫిబ్రవరి 16 నుంచి వైఎస్ఆర్ చేయూత నిధుల విడుదలకు ఆమోదం ▫ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు  *రూ.5వేల కోట్ల నిధుల* విడుదలకు ఆమోదం ▫ప్రతి గ్రామ పంచాయతీకి పంచాయతీ సెక్రటరీ ఉండాలన్న నిర్ణయానికి ఆమోదం ▫SERTలోకి IB భాగస్వామ్యానికి  కేబినెట్ ఆమోదం ▫యూనివర్శిటీలు , ఉన్నత విద్యా సంస్థల్లో పని చేస్తున్న.. నాన్ టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయసు..  *60 నుంచి 62కు పెంపు* 📈 ▫ *SIPB ఆమోదించిన ఎనర్జీ* ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం✅ ▫నంద్యాల, కర్నూలు జిల్లాల్లో..  *రెండు విండ్ పవర్  ప్రాజెక్టులకు* ఆమోదం ▫శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో..  *600 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టుల* ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం ▫ *RJUKTకి రిజిస్ట్రార్ పోస్టు* ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం ▫ఆ మేరకు చట్టంలో సవరణకు  కేబినెట్ ఆమోదం

సమాజంలో పత్రికా విలేకరుల బాధ్యత కీలకమైనది

సమాజంలో పత్రికా విలేకరుల బాధ్యత కీలకమైనది   - డాక్టర్ కనపర్తి అబ్రహం లింకన్ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: వేమూరు జనవరి 31: సమాజంలో పత్రికా విలేకరుల బాధ్యత కీలకమైనదని, ఆకలితో అలమటించిపోతున్నా లెక్కచేయక ,ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులుగా పనిచేస్తూ సమాజ హితం కోరుతున్నారని, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంబేద్కర్ చైర్ పర్సన్, ప్రొఫెసర్ డాక్టర్ కనపర్తి అబ్రహం లింకన్ అన్నారు. బుధవారం స్థానిక ఎండిఓ కార్యాలయ మీటింగ్ హాల్లో ఏర్పాటుచేసిన ఏపీడబ్ల్యూజేఎఫ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు కనపర్తి రత్నాకర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జరిగిన అభినందన సభలో అబ్రహం లింకన్ మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న దారుణాలను, ప్రభుత్వం బాధ్యతలను ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ, సమస్యలను ఎలుగెత్తి ప్రజల ముందు బట్టబయలు చేస్తున్నారని, ఇందువల్ల తప్పులు చేసే నాయకులు, అధికారులు, సక్రమ మార్గంలో నడిచేందుకు విలేకరులు చేస్తున్న కృషి ఎంతైనా అభినందనీయమని అన్నారు. అధ్యక్షత వహించిన రాష్ట్ర నాయకులు కనపర్తి రత్నాకర్ మాట్లాడు...

రేపటి నుంచి విజ్ఞాన్‌ మహోత్సవ్‌

రేపటి నుంచి విజ్ఞాన్‌ మహోత్సవ్‌  _మూడు రోజుల పాటు అలరించనున్న జాతీయ స్థాయి వేడుకలు _ సందడి చేయనున్న సినీతారలు _ఆయా రాష్ట్రాల నుంచి 50 వేల మంది విద్యార్థులు రాక టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జాతీయ స్థాయి విజ్ఞాన్‌ మహోత్సవ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైస్‌ చాన్స్‌లర్‌ మాట్లాడుతూ విజ్ఞాన్‌ మహోత్సవ్‌ కార్యక్రమాన్ని నేటి నుంచి మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని పేర్కొన్నారు. జాతీయస్థాయిలో ప్రతిఏటా విజ్ఞాన్‌ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా చిందు యక్షజ్ఞానం ఆర్టిస్ట్‌ గద్దం సామయ్య (పద్మశ్రీ అవార్డు గ్రహీత), ఇండియన్‌ మ్యూజిక్‌ కంపోజర్‌ రఘు కుంచె హాజరవుతారని వెల్లడించారు. 3వ తారీఖున జరిగే ముగింపు కార్యక్రమానికి ఇండియన్‌ నేషనల్‌ క్రికెట్‌ టీమ్‌ మాజీ సెలక్టర్, క్రికెటర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ రానున్నారని తెలియజేసారు. విజ్ఞాన్‌ మహోత్సవ్‌లో పాల...

పంచరత్న కీర్తనలతో ఘనంగా త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవం

పంచరత్న కీర్తనలతో ఘనంగా త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవం టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: శిశు.ర్వేత్తి పశు ర్వేత్తి వేత్తి గానరసం ఫణిః శిశువులు,పశువులు,పాములను సైతం ఓల లాడించే సంగీత మాధుర్యాన్ని చాటుతూ భక్తి భావాంకిత కృతులను తన గాన మాధుర్యంతో భక్త జనానికి చేరువ చేసిన త్యాగరాజస్వామి 57వ ఆరాధనోత్సవం,స్ధానిక బోస్ రోడ్ లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో, శ్రీ రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి వారి సన్నిధానంలో, శ్రీ త్యాగరాజ గానసభ నిర్వాహణలో,మంగళవారం విశేషంగా నిర్వహించారు.ఈసందర్భంగా తొలుత శ్రీ సీతారామ స్వామికి పంచామృత స్న పన పూజలు,అనంతరం బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ మాడభూషి వేదాంత నరసింహాచార్యులు,వారి శిష్య బృందం త్యాగరాజ పంచరత్న కీర్తనలు సంగీత కచ్చేరి ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది.ఇదే క్రమంలో,మారీస్ పేటకు చెందిన, రత్నాకరం శ్రీనివాసాచార్యులు చే,స్థాపించబడిన, శ్రీ త్యాగరాజ గానసభ కు,సుదీర్ఘకాలం సంగీత విద్వాంసులు గా,సంస్థకు బాధ్యాతాయుత సేవలు అందించిన,శతాధిక వృద్ధులు టివి.కృష్ణశర్మ ను,సంస్థ తరఫున సంత్కరించారు.కాగా విశేషంగా ఆలపించిన ఎందరో మహాను భావులు,అందరికీ వం...

ప్రభుత్వ నిర్ణయం పై ఏపీడబ్లూజేఎఫ్ హర్షం

ప్రభుత్వ నిర్ణయం పై ఏపీడబ్లూజేఎఫ్ హర్షం టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: రాష్ట్రం లో పనిచేస్తున్న జర్నలిస్టులకు మూడు సెంట్ల ఇంటి స్థలం కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఏపీడబ్ల్యూజేఎఫ్ హర్షం వ్యక్తం చేసింది. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపుకు సంబంధించి ప్రభుత్వం తొమ్మిది వేలకు పైగా దరఖాస్తులను సమాచార శాఖ ధ్రువీకరించింది. జిల్లాల్లో కమిటీల ఏర్పాటు కూడా జరిగి కమిటీలు సమావేశమై జిల్లాల్లో ఎంత స్థలం అవసరమని అంశంపై ఒక నిర్ధారణకు రావలసి ఉన్నది. అన్ని జిల్లాల్లో కమిటీల సమావేశాలు ఇంకా పూర్తి కాలేదు. ఎన్నికల నోటిఫికేషన్ అతి తక్కువ కాలంలో వెలువడ బోతున్నదనే సమాచారంతో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు వ్యవహారంలో జాప్యం జరుగుతుందని ఆందోళన పెరుగుతున్నది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చి త్వరితగతిన ఇంటి స్థలం కేటాయించేందుకు వీలైన నిర్ణయం తీసు కోవాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఆంధ్ర ప్రదేశ్ బాడ్కస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్లు సంయుక్తంగా ప్రభుత్వానికి ప్రకటనలో విజ్ఞప్తి  చేశాయి. ప్రకటన చేసిన వారిరో  అధ్యక్షులు...

విజ్ఞాన్‌ యూనివర్సిటీలో వైభవంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

విజ్ఞాన్‌ యూనివర్సిటీలో వైభవంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం భారత 75వ గణతంత్ర దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు యుద్ధాల్లో వీర మరణం పొందిన సైనికులకు నివాళిగా ఏర్పాటు చేసిన అమర్‌ జవాన్‌ స్థూపానికి నివాళులర్పించి జ్యోతి వెలిగించారు. విద్యార్థులు 100 అడుగుల జాతీయ జెండాతో నిర్వహించిన ర్యాలీ, ఎన్‌సీసీ పరేడ్‌ ఎంతగానో ఆకర్షించాయి. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు నిర్వహించిన పలు పోటీల్లో సత్తాచాటిన విద్యార్థులకు ఈ సందర్భంగా బహుమతులు పంపిణీ చేశారు. అనంతరం యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మాట్లాడుతూ గడిచిన 75 ఏళ్లలో మన దేశం అనేక రంగాల్లో విస్తృతంగా అభివృద్ధి చెందిందని తెలిపారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎంతో ఉన్నతిని మనం సాధించాల్సి ఉందన్నారు. మన యువత శారీరక, మానసిక దృఢత్వం మన దేశ భవిష్యత్తుకు ఎంతో అవసరమని పేర్కొన్నారు. తమకు నచ్చిన రంగ...

తాలూకా హైస్కూల్ ప్రాంగణం విశేష ఆధ్యాత్మిక సేవకు వేదికకానుంది

తాలూకా హైస్కూల్ ప్రాంగణం విశేష ఆధ్యాత్మిక సేవకు వేదికకానుంది శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: తిరుమలలో శ్రీవారికి నిత్యం నిర్వహించే ఆర్జిత సేవలను ఈనెల 29నుండి ఫిబ్రవరి 4వరకు తాలూకా హైస్కూల్ ప్రాంగణంలో వేదికగా శ్రీ గోవింద నామ జప యజ్ఞ పూర్ణాహుతి శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభ వోత్సవములు విశేషంగా నిర్వహించనున్నట్లు శ్రీ విద్యాపీఠం ,శ్రీ.సాలిగ్రామ మఠం     మఠాధిపతి   శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాల స్వామీజీ వెల్లడించారు. గురువారం సాయంత్రం తాలూకా హైస్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్యక్రమానికి సంబంధించిన ప్రచార బ్రో చర్లనుఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాల స్వామీజీ మాట్లాడుతూ తిరుమలలో శ్రీవారికి సుప్రభాత సేవ నుండి ఏకాంత సేవ వరకు ఏ విధమై నటువంటి ఆర్జిత సేవలు నిర్వహిస్తారో, అదేవిధంగా తెనాలిలో ఏడు రోజులు శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభోత్సవములు ఉంటాయన్నారు 9 అడుగుల శ్రీవారి మూల విరాట్ కు ఆర్జిత సేవలను తిరుమలలో నిర్వహించే తీరుగా నిర్వహించడం జరుగుతుందన్నారు అదేవిధంగా ఏడు కోట్ల గోవింద నామ జప పూర్ణాహుతి కార్యక్రమం ప్రాధాన్యతను సంతరిం...

రేడియంట్ టాలెంట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్న డా.శ్రీజ సాదినేని

రేడియంట్ టాలెంట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్న డా.శ్రీజ సాదినేని టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది అని పెద్దలు అన్నారు. ఆమాటను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగితే మనం కూడా ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తామని ప్రముఖ సినీ,టీవీ, రంగస్థల నటి, రచయిత్రి, దర్శకురాలు డా.శ్రీజ సాదినేని తెలిపారు. ముప్ఫై మూడు తెలుగు నాటకాలకు దర్శకత్వం వహించిన తొలి తెలుగు మహిళా దర్శకురాలిగా రికార్డు సృష్టించి రేడియంట్ టాలెంట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్నారు డా.శ్రీజ సాదినేని. ఈ సందర్భంగా ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.  ప్రతి అవమానాన్ని అవకాశంగా మలచుకున్నాను, ప్రతి అపజయాన్ని విజయానికి పునాదిగా మార్చుకున్నానని, ఈ విజయం వెనుక తాను ఎదుర్కొన్న ఎన్నో సవాళ్ళను , వాటిని అధిగమించి విజయ పతాకం ఎగురవేసిన వైనాన్ని మీడియాతో పంచుకున్నారు. బాలనటిగా ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితం రంగస్థలంలో అడుగు పెట్టిన తాను అనతికాలంలోనే ఎందరో ప్రముఖ దర్శకులతో నాటకాలలో నటించి వందల నాటకాలను వేలలో ప్రదర్శనలు ఇచ్చి ప్రశంసలతో పాటు మూడు వేలకు పైగా  అవార...

రిపబ్లిక్‌ డే పరేడ్‌కు విజ్ఞాన్స్‌ ఎన్‌సీసీ విద్యార్థిని ఎంపిక

రిపబ్లిక్‌ డే పరేడ్‌కు విజ్ఞాన్స్‌ ఎన్‌సీసీ విద్యార్థిని ఎంపిక టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోఇన్ఫర్మాటిక్స్‌ విభాగంలోని రెండో సంవత్సరానికి చెందిన నాగసంహిత చౌదరి అనే విద్యార్థిని ఈ నెల 26న న్యూఢిల్లీలో జరిగే రిపబ్లిక్‌ డే పరేడ్‌కు ఎన్‌సీసీ విభాగంలో ఎంపికయ్యిందని యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ శుక్రవారం తెలిపారు. 26న జరిగే రిపబ్లిక్‌ డే ప్రోగ్రాంలోని కర్తవ్య పాత్‌ విభాగంలో పాల్గొంటుందని వెల్లడించారు. విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన ఎన్‌సీసీ విద్యార్థులు గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా రిపబ్లిక్‌ డే పరేడ్‌కు ఎంపికవడం గర్వకారణమని తెలియజేసారు.  రిపబ్లిక్‌ డే పరేడ్‌కు ఎంపికైన విద్యార్థిని నాగసంహిత చౌదరిను విజ్ఞాన్స్‌ విద్యా సంస్థల చైర్మన్‌ లావు రత్తయ్య, వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌సీసీ సిబ్బంది, విద్యార్థులు అభినందించారు.

మార్తా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆధ్వర్యంలో ఫేర్ వెల్ అండ్ ఫ్రెషర్స్ డే వేడుకలు

మార్తా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆధ్వర్యంలో ఫేర్ వెల్ అండ్   ఫ్రెషర్స్ డే వేడుకలు టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: స్థానిక సుల్తానాబాద్ సుందరయ్య నగర్లో  మార్త గ్రూప్ ఆఫ్ నర్సింగ్ విద్యాసంస్థల్లో ఫేర్ వెల్ & ఫ్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల ఆటపాటలతో కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగింది. తెల్లవారుఝాము వరకూ విద్యార్థులు తమ ఆనందాన్ని నూతన విద్యార్థులతో పంచుకున్నారు. ఈ వేడుకల్లో విశాఖ జిల్లా అరకు విద్యార్థులు చేసిన దింశా నృత్యం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. మార్త గ్రూప్ నర్సింగ్ విద్యా సంస్థలో విద్యనభ్యసించిన పలువురు పూర్వ విద్యార్థులు తమ అనుభవాలను వేదికపై పంచుకుని కన్నీటి పర్యంతమయ్యారు. మార్త విద్యా సంస్థల ద్వారా నర్సింగ్ విద్యను అభ్యసించి ప్రభుత్వ కొలువులో ఉద్యోగాలు  పొందటానికి  కారణమైన విద్యాసంస్థల చైర్మన్ యనమల ఈశ్వరరావు, చందన ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షురాలు యనమల గీత లను పలువురు కొనియాడారు. పేద విద్యార్థులపై వారు చూపించిన ప్రేమ, వాత్సల్యత వెలకట్టలేనిదని మల్లేపాడు పూర్వ విద్యార్దిని 23వ వార్డు హెల్త్ సెక్రటరీ కె రాజ్యం కన...

వేమూరు నియోజకవర్గం ఎ.పి వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

వేమూరు నియోజకవర్గం జర్నలిస్ట్స్ ఫెడరేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్, వేమూరు: అంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ వేమూరు నియోజకవర్గ నూతన కమిటీ ఎన్నిక జరిగింది. గుంటూరు జిల్లా తెనాలిలో గురువారం ఉదయం ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కనపర్తి రత్నాకర్ ఆధ్వర్యంలో ఈ ఎన్నిక జరిగింది. అధ్యక్షునిగా మేకల సుబ్బారావు(ఆంధ్ర ప్రభ), ప్రధాన కార్యదర్శి గా పులివర్తి బుల్లయ్య (సాక్షి) ఉపాధ్యక్షునిగా కరేటి సాంబశివరావు ( ప్రజా ప్రవాహం) సహాయ కార్యదర్శులు గా దాసరి వెంకటేశ్వరరావు (ఉదయం)యల్లమాటి రామకృష్ణ బాపనయ్య (టి వి 11) లను ఏకగ్రీవంగా గా ఎన్నికయ్యారు. నూతన కమిటీని ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు ఎ. ఆంజనేయులు, నాయకులు పున్నయ్య, జహీర్, సురేష్ బాబు, వేజండ్ల రాజారావు, డి. కోటేశ్వరరావు, ఎ. సాంబ శివరావు, ప్రకాశరావు, చందు, శ్రీకాంత్, ప్రసాద్, ఎస్.ఎస్. వి శేఖర్, వి. లక్ష్మణ్ , నాయుడు, ప్రవీణ్ తదితరులు అభినందించారు.

కాంగ్రెస్ పార్టీలోకి గ్రేస్ ఫౌండేషన్ చైర్మన్ కైతేపల్లి

కాంగ్రెస్ పార్టీలోకి గ్రేస్ ఫౌండేషన్ చైర్మన్ కైతేపల్లి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:  వేమురు నియోజకవర్గానికి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రేస్ ఫౌండేషన్ చైర్మన్ కై తేపల్లి షాలెం రాజు శనివారం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఏఐసీసీ సభ్యులు జెడి శీలం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంటఅంజి బాబు నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ తాడికొండ వెంకటేశ్వరరావు ల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నియోజకవర్గంలోని పల్లె కోన గ్రామానికి చెందిన షాలెం రాజు  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ మంత్రి మెరుగు నాగార్జున సన్నిహితంగా మెలిగేవారు. గత కొంతకాలం నుంచి మెరుగు నాగార్జున కు దూరంగా ఉంటూ గ్రేస్ ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గ గ్రామాల్లో సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదే రీతిలో వేమూరు నియోజకవర్గం నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం కూడా ఆశించారు. నియోజకవర్గంలోని మాదిగ సామాజిక వర్గానికి చెందిన షాలెం రాజు గత నాలుగైదు ఏళ్లగా  నియోజకవర్గంలో విస్తృత పర్యటనలు చేస్తూ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరయ్యారు, వై...

నేషనల్ తైక్వాండో పోటీలలో తెనాలి క్రీడాకారులకు రజిత కాంశ పథకాలు

నేషనల్ తైక్వాండో పోటీలలో తెనాలి క్రీడాకారులకు రజిత కాంశ పథకాలు టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: విభిన్న రంగాలలో విశిష్టతను చాటుకుంటున్న తెనాలిలో క్రీడల రంగానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. తైక్వాండో శిక్షణలో ప్రాధాన్యతను చాటుకుంటున్న కె ఎస్ ఆర్ తైక్వాండో అకాడమీలో శిక్షణ పొంది క్రీడాకారులు,10వ నేషనల్ తైక్వాండో పోటీలకు మన రాష్ట్రం నుండి పాల్గొన్న జట్టులో భాగస్వామ్యం వహించిన,తెనాలి కె ఎస్ ఆర్ తైక్వాండో అకాడమీ క్రీడాకారులు రజిత కాంస్య పథకాలను కైవసం చేసుకోవడం పట్ల ఏపీ తైక్వాండో సి ఓ కే వెంకటేశ్వరరావు క్రీడాకారులను అభినందించారు. ఈనెల 4 నుండి 6వ తేదీ వరకు ఢిల్లీలోని చత్ర పాల్ స్టేడియంలో నిర్వహించిన జాతీయ తైక్వాండో పోటీలలో మన రాష్ట్రం నుండి పోటీకి వెళ్లిన జట్టులో తెనాలి కె ఎస్ ఆర్ తైక్వాండో అకాడమీ క్రీడాకారులు ఆరాధ్యుల చరణ్, షేక్ తవ సిక్ భాష,పి.బెన్నీ రాజశేఖర్ లు రజిత పతకాలు సాధించగా,టి. సత్య జష్వంత్,ఎన్. జ్ఞాన తేజ్ లు,కాంశ,పతకాలు కైవశం చేసుకున్నారు.విజేతలను మద్దాలి శేషాచలం,కొత్త రామారావు,కెఎస్ ఆర్ తైక్వాండో అకాడమీ నిర్వాహకులు కె.శ్రీనివాసరావులు అభినందించారు.

ఈ నెల 14 న వైకుంఠపురం లో సామూహిక భోగిపళ్ళ వేడుక

ఈ నెల 14 న వైకుంఠపురం లో...సామూహిక భోగిపళ్ళ వేడుక టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి సంబరాల క్రమంలో,ఆదివారం ఉదయం 10గంటలకు, తెనాలి వైకుంఠపురం లో, భోగి పండుగ సందర్భంగా, 11 సంవత్సరాల లోపు చిన్నారులకు ,సామూహిక భోగిపళ్ళ వేడుక నిర్వహించ నున్నట్లు ఆలయ సహాయ కమిషనర్ ఎమ్.తిమ్మా నాయుడు,ధర్మకర్తల మండలి చైర్మన్ కుంభం సాయిబాబు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆరోజున ఆలయానికి వచ్చే భక్తులు, తమ కుటుంబంలోని చిన్నారులతో వచ్చి, భోగిపళ్ళ వేడుక లో పాల్గొనే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

విజ్ఞాన్‌లో పల్లెవించిన సంక్రాంతి

విజ్ఞాన్‌లో పల్లెవించిన సంక్రాంతి  - సంక్రాంతి అంటే రైతుల పండుగ  - విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య - విజ్ఞాన్‌ విశ్వవిద్యాలయంలో వైభవంగా ముందస్తు   సంక్రాంతి వేడుకలు - సంప్రదాయ వస్త్రాల్లో మెరిసిన విద్యార్థులు టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: సంక్రాంతి విశిష్టతను తెలిపే రంగురంగుల రంగవల్లులు, హరిదాసు సంకీర్తనలు, కోలాటాలతో తెలుగు సంప్రదాయాలు ఉట్టిపడేలా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య విద్యార్థులతో మాట్లాడుతూ సంక్రాంతి అంటేనే రైతుల పండుగని తెలిపారు. మన పండుగల్లోని విశిష్టతను, శాస్త్రీయతను విద్యార్థులు గుర్తించాలని సూచించారు. ఈ సమయంలో రైతు లోకం పంట చేతికొచ్చిన ఆనందంలో ఉంటుందని చెప్పారు. సంక్రాంతి పర్వదినాల్లో పల్లెటూళ్లు ఎంతో అందంగా, ఆహ్లాదంగా ఉంటాయని చెప్పారు. రకరకాల జానపద వినోద కళాకారులు, పగటివేషధారులు ఈ పండుగ సమయంలో పల్లెల్లో వినోదాన్ని పంచుతారని...

తెనాలి పట్టణ బిజెపి అధ్యక్షులుగా సంపత్ రాయుడు

తెనాలి పట్టణ బిజెపి అధ్యక్షులుగా సంపత్ రాయుడు టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:  భారతీయ జనతా పార్టీ తెనాలి పట్టణ అధ్యక్షులుగా సీనియర్ నాయకులు అడపా వెంకట లక్ష్మీ సంపత్ రాయుడు కు, మరోసారి అవకాశం.గురువారం గుంటూరు జిల్లా భారతీయ జనతాపార్టీ కార్యాలయంలో, జిల్లా పార్టీ అధ్యక్షులు వనమా నరేంద్రకుమార్ నుండి నియామక పత్రం అందుకున్న సంపత్ రాయుడు.ఈక్రమంలో పలువురు బిజెపి నాయకులు సంపత్ రాయుడు కు అభినందనలు తెలిపారు.కాగా తనకు తెనాలి పట్టణ బిజెపి అధ్యక్షులు గా అవకాశం కల్పించిన, రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి, రాష్ట్ర పార్టీ ప్రధానకార్యదర్శి దయాకర్ రెడ్డి, జిల్లా ఇంఛార్జి శ్రీనివాసరాజు, జిల్లా పార్టీ అధ్యక్షులు వనమా నరేంద్రకుమార్ లకు సంపత్ రాయుడు ధన్యవాదాలు తెలిపారు.పట్టణంలో పార్టీ అభివృధ్ధికి ,కమల వికాసం కోసం ,అందరిని కలుపుకుంటూ  ముందుకు వెళతామన్నారు

సంక్రాంతి సంబరాలకు వేదికైన జెఎమ్ జె కళాశాల

సంక్రాంతి సంబరాలకు వేదికైన జెఎమ్ జె మహిళా కళాశాల టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:  తెలుగింటి సంప్రదాయ వేడుక సంక్రాంతి సంబరాలను సంప్రదాయ రీతిలో నిర్వహించిన కళాశాల గృహ విజ్ఞాన విభాగం. గురువారం స్థానిక జయం జై మహిళ కళాశాలలో సర్వ మానవ సమానత్వాన్ని సమాజానికి చాటి చెప్పే తీరుగా ,రోమన్ కాధలిక్ ల,ఆధ్వర్యంలో నిర్వహించే జెన్జీ కళాశాలలో అందరి సంప్రదాయ ఆచార వ్యవహారాలను గౌరవిస్తూ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా పండుగలకు ప్రాధాన్యం కల్పించే క్రమంలో, చేంజ్ కళాశాల గృహ విజ్ఞాన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో సంక్రాంతి శోభను సంతరించుకున్న తీరుగా కార్యక్రమాలను నిర్వహించారు. రంగుల రంగవల్లులు, బొమ్మల కొలువు, వంటి వేడుకలతో సంక్రాంతి సంబర శోభను, పంచే విధంగా కార్యక్రమాన్ని రూపొందించారు. సిస్టర్ షైనీ వైస్ ప్రిన్సిపాల్ సిస్టర్ శారద, కరస్పాండెంట్ సిస్టర్ త్రీజ, హేమలత జి నవీన్ కళాశాల విద్యార్థినులు కార్యక్రమాన్ని ఆశాంతం ఆహ్లాదం పంచే విధంగా తీర్చిదిద్దారు.

టాలెంట్ ఎక్స్ ప్రెస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన డాక్టర్ కనపర్తి అబ్రహాం లింకన్

టాలెంట్ ఎక్స్ ప్రెస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన డాక్టర్ కనపర్తి అబ్రహాం లింకన్ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: తెనాలి: సీనియర్ జర్నలిస్ట్, దర్శకుడు కనపర్తి రత్నాకర్ ఎడిటర్ గా నిర్వహిస్తున్న టాలెంట్ ఎక్స్ ప్రెస్ నూతన సంత్సర కలెందర్ ను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంబేడ్కర్ చైర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కనపర్తి అబ్రహాం లింకన్ బుధవారం ఆవిష్కరించారు.  స్థానిక బస్టాండ్ సమీపంలో లోని అంబేడ్కర్ సేవా ట్రస్ట్ కార్యాలయం లో కాలెండర్ ఆవిష్కరణ సభ జరిగింది. ఈ సందర్భంగా గా అబ్రహాం లింకన్ మాట్లాడుతూ టాలెంట్ ఎక్స్ ప్రెస్ ద్వారా సమాజం లోని పలు విషయాలను, సమస్యలను తెలియజేస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తున్న రత్నాకర్ అభినందనీయులు అని అన్నారు. పత్రికా రంగం లో మరింత రాణించాలని సూచించారు. కార్యక్రమం లో టాలెంట్ ఎక్స్ ప్రెస్ సహ సంపాదకులు మేకల సుబ్బారావు, ప్రతినిధి అత్తోట సంజయ్ కుమార్, జర్నలిస్ట్ లు  గుమ్మడి ప్రకాశరావు, అంబటి శ్యామ్ సాగర్, పి. పున్నయ్య, సి.హెచ్ చంద్రశేఖర్, హకీమ్ జాని, ట్రస్ట్ కార్యదర్శి డి. సందీప్ తదితరులు పాల్గొన్నారు.

భారత్‌ – ఇజ్రాయిల్‌ సంబంధాలు మరింత బలోపేతం

భారత్‌ – ఇజ్రాయిల్‌ సంబంధాలు మరింత బలోపేతం  - భారతదేశంలో ఇజ్రాయిల్‌ రాయబారి నవోర్‌ గిలోన్‌ - విజ్ఞాన్స్‌ యూనివర్సిటీను సందర్శించిన ఇజ్రాయిల్‌ ప్రతినిధులు టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: భారత్‌–ఇజ్రాయిల్‌ దేశాల మధ్య అగ్రికల్చర్‌ రంగం విభాగంలో టెక్నాలజీతోపాటు పరస్పర అవగాహన సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయని భారతదేశంలో ఇజ్రాయిల్‌ రాయబారి నవోర్‌ గిలోన్‌ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇజ్రాయిల్‌ రాయబారి నవోర్‌ గిలోన్‌తో పాటు ఇతర ప్రతినిధులకు వర్సిటీ చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ పుష్పగుచ్చం అందించి సాదరంగా ఆహ్వానించారు. యూనివర్సిటీలో జరిగిన ఈ కార్యక్రమంలో అకడమియాతో పాటు దౌత్యపరమైన అంశాల గురించి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌తో ఆయన చర్చించారు. ఈ సందర్భంగా ఇజ్రాయిల్‌ రాయబారి నవోర్‌ గిలోన్‌తో విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు, వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎ...

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విద్యార్థికి పీహెచ్‌డీ

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విద్యార్థికి పీహెచ్‌డీ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని ఈసీఈ విభాగానికి చెందిన అంబవరం ప్రతాప్‌రెడ్డి అనే విద్యార్థికి ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో తమ యూనివర్సిటీ పీహెచ్‌డీ పట్టా అందించిందని వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ ఇన్వెస్టిగేషన్‌ ఆన్‌ బాండ్‌విడ్త్‌ అండ్‌ గేన్‌ ఎన్‌హ్యాన్స్‌మెంట్‌ ఆఫ్‌ మైక్రోస్ట్రిప్‌ ప్యాచ్‌ యాంటినా ఫర్‌ వైమ్యాక్స్‌–5జీ–డబ్యూలాన్‌ అప్లికేషన్స్‌’’ అనే అంశంపై ఆయన పరిశోధన చేశారని తెలియజేశారు.  ఈయనకు విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని ఈసీఈ డిపార్ట్‌మెంట్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎమ్‌.పచియానన్‌ గైడ్‌గా వ్యవహరించారని పేర్కొన్నారు. పీహెచ్‌డీ పట్టా పొందిన అంబవరం ప్రతాప్‌రెడ్డిని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది అభినందించారు.

తెనాలి పట్టణ వన్ టౌన్ సిఐగా దశరథ రామయ్య

వన్ టౌన్ సిఐగా దశరథ రామయ్య   టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: తెనాలి పట్టణ వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా  జి. దశరధరామయ్య మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన సి.ఐ. కె.చంద్రశేఖర్ వి.ఆర్. కు బదిలీ అయ్యారు. నూతన సీఐ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించి, పనిచేస్తానని,శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీను సందర్శించిన జపాన్‌ ప్రతినిధులు

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీను సందర్శించిన జపాన్‌ ప్రతినిధులు టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీను సోమవారం న్యూఢిల్లీలో గల అంబసీ ఆఫ్‌ జపాన్‌ ప్రతినిధులు సందర్శించారు. ముందుగా అంబసీ ఆఫ్‌ జపాన్‌ ప్రతినిధులైన కౌన్సిలర్‌ కెంటారో ఒరిటా, సెకండ్‌ సెక్రటరీ రైతా సైటో, అడ్మినిస్ట్రేటివ్‌ అటాచీ రికుతో ఐటోలకు విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణం ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మాట్లాడుతూ గుంటూరు రీజియన్‌లోని విద్యార్థులు నేర్చుకోవడానికి వీలుగా జపనీస్‌ లాంగ్వేజ్‌ సెంటర్‌ను విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఏర్పాటు చేయాలని జపాన్‌ ప్రతినిధులను కోరారు. అంతేకాకుండా స్టూడెంట్స్, ఫ్యాకల్టీ ఎక్స్‌చేంజ్, అకడమిక్, పరిశోధన, కన్సల్టన్సీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ ప్రోగ్రామ్స్‌ను అభివృద్ధి చేసుకోవడానికి అవగాహన ఒప్పందం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. వీటితో పాటు జాయింట్‌ మాస్టర్స్, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లను కూడా ప్రారంభిచేలా క...

విద్యార్థుల ప్రవర్తనను అధ్యాపకులు గమనించాలి

విద్యార్థుల ప్రవర్తనను అధ్యాపకులు గమనించాలి  - విజ్ఞాన్స్‌ విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య  - విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఘనంగా ముగిసిన మూడు       రోజుల వర్క్‌షాప్‌ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: అధ్యాపకులు, కౌన్సిలర్లు తరగతి గదిలోని విద్యార్థుల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని విజ్ఞాన్స్‌ విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్‌ యూనివర్సిటీలోని సోషల్‌ సైన్సెస్‌ అండ్‌ హుమానిటీస్, అకాడమీ ఫర్‌ ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్, ఐక్యూఏసీ, ఏపీఏ ఇండియాల సంయుక్త ఆధ్వర్యంలో ‘‘ఎంపవరింగ్‌ త్రూ ప్రివెన్షన్‌ – ప్రొఫెషనల్‌ ట్రైనింగ్‌ ఆన్‌ లైఫ్‌–సేవింగ్‌ ఎడ్యుకేషన్‌’’ అనే అంశంపై మూడు రోజుల పాటు అధ్యాపకులకు, కౌన్సిలర్‌లకు నిర్వహించిన  వర్క్‌షాప్‌ను ఆదివారం ఘనంగా ముగించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజ్ఞాన్స్‌ విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య విద్యార్థులకు అధ్యాపకులు వాళ్ల పరిధిని దాటి క్రియేటివ్‌గా, సరికొత్తగా ఆలోచించేలా ప్రేరిపించాలన్నారు. విద్యార్థులకు సమస్యలు ఎదురైనప్పుడు అద...

విశాలాంధ్ర నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన ఏఐటీయూసీ గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ గురుబ్రహ్మం

విశాలాంధ్ర నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన ఏఐటీయూసీ గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ గురుబ్రహ్మం   టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: నిజాన్ని నిర్భయంగా ప్రచురిస్తూ వాస్తవాలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందించడంలో విశాలాంధ్ర దినపత్రిక ముందుంటుందని ఏఐటీయూసీ   గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ గురుబ్రహ్మం అన్నారు స్థానిక సిపిఐ  పార్టీ కార్యాలయంలో ఆదివారం విశాలాంధ్ర 2024 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. జిల్లా నాయకులు బొల్లి ముంత కృష్ణ మాట్లాడుతూ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని పలువురికి ఉపాధి కల్పిస్తూ సుదీర్ఘ చరిత్ర కలిగిన పత్రిక విశాలాంధ్ర అన్నారు పత్రికతో పాటు తక్కువ ధరకు ప్రత్యేక పుస్తకాలను ముద్రించి ప్రజలకు అందించడం సంతోషకరమన్నారు విశాలాంధ్ర దినపత్రిక దినదినాభివృద్ధి   చెందాలని ఆకాంక్షిస్తూ పత్రిక యాజమాన్యానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఐటియూసి తెనాలి నియోజవర్గ సెక్రటరీ  మునిపల్లి శ్రీకాంత్, బి వెంకట్, అనపర్తి వెంకటేశ్వరరావు, సుభాష్ చంద్రబోస్, విజయలక్ష్మి, విజయదుర్గ తదితరులు పాల్గొన్నారు

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:   చుండూరు జనవరి5 కుల మతాలకు పార్టీలకు అతీతంగా అర్హత ప్రామాణికంగా గుర్తించి ప్రతి నెలవాలంటీర్ల ద్వారా అవ్వ తాతలకు ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ అందించే విధంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వరికూటి అశోక్ బాబుఅన్నారు 2750 పెన్షన్ను పెంపు  ద్వారా 3000 రూపాయలు పెన్షన్ అందించే కార్యక్రమాన్ని శుక్రవారం స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ప్రారంభించారుఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో  ఆయన మాట్లాడుతూగత ప్రభుత్వ ఆయాయంలో పెన్షన్ల కోసం రోజుల తరబడి కార్యాలయాలు చుట్టూజన్మభూమి కమిటీల చుట్టూతిరిగే వారన్నారుముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లో అర్హత ఉన్న ప్రతి వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకున్నట్టు గుర్తు చేశారు ఇటువంటి సంక్షేమ ఫలాలు అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిరిగి అధికారంలోకి తెచ్చే విధంగా ప్రతి ఒక్కరు అండగా ఉండాలన్నారుఈ సందర్భంగా గతంలో 7549 పెన్షన్  లు ఉండగాకొత్త 202పెన్షన్లను  కలపి7751పంపిణీ చేశారు  ఈకార్యక్...

భవిష్యత్‌ మీద ఆశ కలిగించాలి

భవిష్యత్‌ మీద ఆశ కలిగించాలి - ఐఏఎన్‌ఎల్‌పీ ప్రెసిడెంట్‌ విశేష్‌ - విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఘనంగా ప్రారంభమైన మూడు రోజుల వర్క్‌షాప్‌ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: విద్యార్థులకు సమస్యలు ఎదురైనప్పుడు అధ్యాపకులుగా, కౌన్సిలర్లుగా వారికి భవిష్యత్‌ మీద ఆశ కలిగించాలని ఐఏఎన్‌ఎల్‌పీ ( ఇంటర్నేషనల్‌ న్యూరో లింగ్విస్టిక్‌ ప్రోగ్రామ్‌) ప్రెసిడెంట్‌ విశేష్‌ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్‌ యూనివర్సిటీలోని సోషల్‌ సైన్సెస్‌ అండ్‌ హుమానిటీస్, అకాడమీ ఫర్‌ ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్, ఐక్యూఏసీ, ఏపీఏ ఇండియాల సంయుక్త ఆధ్వర్యంలో ‘‘ఎంపవరింగ్‌ త్రూ ప్రివెన్షన్‌ – ప్రొఫెషనల్‌ ట్రైనింగ్‌ ఆన్‌ లైఫ్‌–సేవింగ్‌ ఎడ్యుకేషన్‌’’ అనే అంశంపై మూడు రోజుల పాటు అధ్యాపకులకు, కౌన్సిలర్‌లకు నిర్వహించే  వర్క్‌షాప్‌ను ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐఏఎన్‌ఎల్‌పీ ప్రెసిడెంట్‌ విశేష్‌ మాట్లాడుతూ అధ్యాపకులుగా మీరందరూ విద్యార్థులను ఎప్పుడు కూడా సరికొత్తగా ఆలోచించే విధంగా  ప్రోత్సహించాలన్నారు. అలా చేయనట్లైతే మెదడు చెడు ఆలోచనలవైపు దృష్టిమరలుతుందన్నారు. తరగతిగదిలో ఉపాధ్యాయుడు లీడర్‌గా మ...

సేంద్రియ ఆహారం దివ్యౌషధం

సేంద్రియ ఆహారం దివ్యౌషధం సహస్ర క్రాప్‌ సైన్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.శ్రీరామ రెడ్డి    విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఘనంగా రైతులకు అవగాహన సదస్సు టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారా పండించిన పంటలను మానవాళి ఆహారంగా తీసుకుంటే అవి దివ్యౌషధంగా పనిచేస్తాయని సహస్ర క్రాప్‌ సైన్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.శ్రీరామ రెడ్డి అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ ఫుడ్‌ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో సహస్ర క్రాప్‌ సైన్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వారి ఆర్థిక సహకారంతో ‘‘ఎంపవరింగ్‌ ఫార్మర్స్‌ ఆన్‌ ఆర్గానిక్‌ ఎన్‌రిచ్‌మెంట్‌ ఫర్‌ అగ్రికల్చరల్‌ అండ్‌ హార్టికల్చరల్‌ క్రాప్స్‌ ( ఈఎఫ్‌వోఈఏహెచ్‌సీ)’’ అనేఅంశంపై రైతులకు అవేర్‌నెస్‌ వర్క్‌షాప్‌ను నిర్వహించారు. ఆర్గానిక్‌ పంటలపై జరిగిన ఈ అవగాహన కార్యక్రమానికి యూనివర్సిటీ దత్తగ్రామాలైన వేజండ్ల, వడ్లమూడి, సుద్దపల్లి గ్రామాల నుంచి రైతులు హాజరయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హైదరాబాద్‌లోని సహస్ర క్రాప్...

మన చదువుల తల్లి సావిత్రి బాయ్ పూలే జయంతి నేడు.

నాకు తెలిసిన సావిత్రి బాయ్ పూలే.. ఆమెకు 9 యేళ్ళు నిరక్షరాస్యురాలు 12 ఏళ్ళ జ్యోతిరావు పూలే ను పెళ్ళిచేసుకున్నారు... జ్యోతిరావు పూలే ప్రోత్సాహంతో ఇంట్లోనే చదువుకుని విద్యావంతురాలు అయ్యారు... కొంతకాలానికి భర్త తో కలిసి పాఠశాల స్థాపించారు... ఈ పాఠశాల ఆర్థీకలావాదేవీలకో , సమాజం లో పలుకుబడికోసమో కాదు... కులమత భేదాలకు అతీతంగా సమాజం మార్పు కోసం... ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని తన భర్తతో కలసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించారు... కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా అనుకున్నారు... ఆమె ఆడవాళ్ళు చదవాలని పోరాడుతూ ఉపాధ్యాయురాలిగా బాలికలను ప్రోత్సాహిస్తున్న సమయంలో ఆమె పై వేధింపులకు, భౌతికదాడులకు పూనుకున్నారు... పాఠశాలకు నడిచే దారిలో ఆమెపై బురద చల్లడం, రాళ్లు విసరడం, అసభ్య పదజాలాన్ని వాడటం వంటివి చేశారు... అయినా ఆమె తన వృత్తిని నిర్వహించేవారు... పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి మన సావిత్రి బాయ్ ...

జాతీయస్థాయి తైక్వాండో పోటీల్లో ద్వితీయస్థానం

జాతీయస్థాయి తైక్వాండో పోటీల్లో ద్వితీయస్థానం టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: తెనాలి: 02-01-2024: కెనడా రాజధాని ఒట్టావా కేంద్రంగా నడుస్తున్న అంతర్జాతీయ సంస్థ ఛాన్ హన్ ఇంటర్నేషనల్ తైక్వాండో ఫెడరేషన్, బాపట్ల జిల్లా రేపల్లెకు చెందిన బోధిధర్మ మార్షల్ ఆర్ట్స్ అకాడెమీ సంయుక్త ఆధ్వర్యంలో డిసెంబర్ 30, 31వ తేదీలలో రేపల్లెలో జరిగిన తొలి జాతీయ ట్రడీషనల్ తైక్వాండో ఛాంపియన్షిప్ -2023 జాతీయస్థాయి పోటీలు అండర్-12 బాలికల విభాగంలో స్థానిక బోస్రోడ్డులోని నెహ్రూనికేతన్ అయిదవ తరగతి చదువుతున్న షేక్ సనా ఫాతిమా ద్వితీయస్థానాన్ని కైవసం చేసుకుంది. నిర్వాహకులు ఇచ్చిన ధ్రువపత్రంతో పాటు రజత పతకాన్ని మంగళవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో నెహ్రూనికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి సనా ఫాతిమాకు అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో బాలబాలికలు, ఉపాధ్యాయలు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ప్రారంభమైన జాతీయస్థాయి క్రికెట్‌ పోటీలు

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ప్రారంభమైన జాతీయస్థాయి క్రికెట్‌ పోటీలు టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విద్యార్థుల ఆధ్వర్యంలో సోమవారం నూతన సంవత్సర వేడుకలతో పాటు మహోత్సవ్‌–2కే24లో భాగంగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి క్రికెట్‌ చాంపియన్‌షిప్‌ పోటీలను ఘనంగా ప్రారంభించారు. ఈ చాంపియన్‌షిప్‌లో విజేతలుగా నిలిచిన జట్లకు ప్రశంసా పత్రాలు, మెడల్స్‌తో పాటు విన్నర్‌కు రూ. 50,000, రన్నర్‌కు రూ.30,000, మూడో స్థానంకు రూ.20,000, నాలుగో స్థానంకు రూ.10,000 నగదు బహుమతులను అందజేస్తామని వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ వెల్లడించారు. విద్యార్థులు కోటి ఆశలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌  ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించడానికి సరికొత్త మార్గాలను అన్వేషించాలన్నారు. నూతన టెక్నాలజీలపై అవగాహన పెంచుకున్న విద్యార్థులకు మాత్రమే భవిష్యత్తులో ఉన్నత ఉద్యోగాలు దక్కుతాయని తెలిపారు. 2024 సంవత్సరంలో వి...

ఒక ఆడపిల్లగా సొంతంగా ఎదగడం ఎంతో కష్టం

ఒక ఆడపిల్లగా సొంతంగా ఎదగడం ఎంతో కష్టం .  - సినీ, టీవీ, రంగస్థల నటి,దర్శకురాలు డా.శ్రీజ సాదినేని టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: ఒంటరిగా ఆడపిల్ల ఎదగాలి అంటే ఈ సమాజంలో ఎంత కష్టమో 20 ఏళ్ల నుండి చూస్తున్నాను. అయినా పోరాట పటిమ వదలకుండా నా సంస్థను ఈ స్థాయికి తీసుకుని వచ్చాను" అన్నారు సినీ,టీవీ,రంగస్థల నటి, దర్శకురాలు డా.శ్రీజ సాదినేని. డిసెంబర్ 30, శనివారం నాడు తమ సొంత సంస్థ శ్రీ జయా ఆర్ట్స్ ఇరవయ్యవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించుకున్నారు శ్రీజ. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ " నాటకరంగం మీద మమకారంతో సాంస్కృతిక సంస్థను 2003 డిసెంబర్ 30 న స్థాపించి తన స్వీయ నిర్మాణ దర్శకత్వంలో 33 తెలుగు నాటిక, నాటకాలు రూపొందించిన శ్రీజ తన కళా రంగ ప్రయాణంలో ఎదుర్కొన్న సవాళ్ళను, సమస్యలను ఎంతో ధైర్యంగా అధిగమించి ఇప్పటి వరకూ రెండు వేల మందికి పైగా విద్యార్థులకు నటనలో శిక్షణ ఇచ్చి నాటక, టీవీ, సినీ రంగాలలో అవకాశాలు కల్పించినందుకు ఎంతో గర్వంగా ఉంది అని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆడపిల్ల దర్శకత్వం అంటే తోటి నటీమణులు కూడా అందులో నటించడానికి ఆసక్తి చూపేవారు కాదని, బైటి నుండి కళాకారులు సపోర్ట్ చేయరని,మిత్రుల...