సంక్రాంతి సంబరాలకు వేదికైన జెఎమ్ జె కళాశాల

సంక్రాంతి సంబరాలకు వేదికైన జెఎమ్ జె మహిళా కళాశాల
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: 
తెలుగింటి సంప్రదాయ వేడుక సంక్రాంతి సంబరాలను సంప్రదాయ రీతిలో నిర్వహించిన కళాశాల గృహ విజ్ఞాన విభాగం. గురువారం స్థానిక జయం జై మహిళ కళాశాలలో సర్వ మానవ సమానత్వాన్ని సమాజానికి చాటి చెప్పే తీరుగా ,రోమన్ కాధలిక్ ల,ఆధ్వర్యంలో నిర్వహించే జెన్జీ కళాశాలలో అందరి సంప్రదాయ ఆచార వ్యవహారాలను గౌరవిస్తూ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా పండుగలకు ప్రాధాన్యం కల్పించే క్రమంలో, చేంజ్ కళాశాల గృహ విజ్ఞాన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో సంక్రాంతి శోభను సంతరించుకున్న తీరుగా కార్యక్రమాలను నిర్వహించారు. రంగుల రంగవల్లులు, బొమ్మల కొలువు, వంటి వేడుకలతో సంక్రాంతి సంబర శోభను, పంచే విధంగా కార్యక్రమాన్ని రూపొందించారు. సిస్టర్ షైనీ వైస్ ప్రిన్సిపాల్ సిస్టర్ శారద, కరస్పాండెంట్ సిస్టర్ త్రీజ, హేమలత జి నవీన్ కళాశాల విద్యార్థినులు కార్యక్రమాన్ని ఆశాంతం ఆహ్లాదం పంచే విధంగా తీర్చిదిద్దారు.