నేషనల్ తైక్వాండో పోటీలలో తెనాలి క్రీడాకారులకు రజిత కాంశ పథకాలు

నేషనల్ తైక్వాండో పోటీలలో తెనాలి క్రీడాకారులకు రజిత కాంశ పథకాలు
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
విభిన్న రంగాలలో విశిష్టతను చాటుకుంటున్న తెనాలిలో క్రీడల రంగానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. తైక్వాండో శిక్షణలో ప్రాధాన్యతను చాటుకుంటున్న కె ఎస్ ఆర్ తైక్వాండో అకాడమీలో శిక్షణ పొంది క్రీడాకారులు,10వ నేషనల్ తైక్వాండో పోటీలకు మన రాష్ట్రం నుండి పాల్గొన్న జట్టులో భాగస్వామ్యం వహించిన,తెనాలి కె ఎస్ ఆర్ తైక్వాండో అకాడమీ క్రీడాకారులు రజిత కాంస్య పథకాలను కైవసం చేసుకోవడం పట్ల ఏపీ తైక్వాండో సి ఓ కే వెంకటేశ్వరరావు క్రీడాకారులను అభినందించారు. ఈనెల 4 నుండి 6వ తేదీ వరకు ఢిల్లీలోని చత్ర పాల్ స్టేడియంలో నిర్వహించిన జాతీయ తైక్వాండో పోటీలలో మన రాష్ట్రం నుండి పోటీకి వెళ్లిన జట్టులో తెనాలి కె ఎస్ ఆర్ తైక్వాండో అకాడమీ క్రీడాకారులు ఆరాధ్యుల చరణ్, షేక్ తవ సిక్ భాష,పి.బెన్నీ రాజశేఖర్ లు రజిత పతకాలు సాధించగా,టి. సత్య జష్వంత్,ఎన్. జ్ఞాన తేజ్ లు,కాంశ,పతకాలు కైవశం చేసుకున్నారు.విజేతలను మద్దాలి శేషాచలం,కొత్త రామారావు,కెఎస్ ఆర్ తైక్వాండో అకాడమీ నిర్వాహకులు కె.శ్రీనివాసరావులు అభినందించారు.