రిపబ్లిక్‌ డే పరేడ్‌కు విజ్ఞాన్స్‌ ఎన్‌సీసీ విద్యార్థిని ఎంపిక

రిపబ్లిక్‌ డే పరేడ్‌కు విజ్ఞాన్స్‌ ఎన్‌సీసీ విద్యార్థిని ఎంపిక
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోఇన్ఫర్మాటిక్స్‌ విభాగంలోని రెండో సంవత్సరానికి చెందిన నాగసంహిత చౌదరి అనే విద్యార్థిని ఈ నెల 26న న్యూఢిల్లీలో జరిగే రిపబ్లిక్‌ డే పరేడ్‌కు ఎన్‌సీసీ విభాగంలో ఎంపికయ్యిందని యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ శుక్రవారం తెలిపారు. 26న జరిగే రిపబ్లిక్‌ డే ప్రోగ్రాంలోని కర్తవ్య పాత్‌ విభాగంలో పాల్గొంటుందని వెల్లడించారు. విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన ఎన్‌సీసీ విద్యార్థులు గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా రిపబ్లిక్‌ డే పరేడ్‌కు ఎంపికవడం గర్వకారణమని తెలియజేసారు.  రిపబ్లిక్‌ డే పరేడ్‌కు ఎంపికైన విద్యార్థిని నాగసంహిత చౌదరిను విజ్ఞాన్స్‌ విద్యా సంస్థల చైర్మన్‌ లావు రత్తయ్య, వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌సీసీ సిబ్బంది, విద్యార్థులు అభినందించారు.